పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

25


గ్గల మగు[1]నేమమ్మును మతి
కలిమికి [2]వినతియును నొప్పుఁ గరుణాంబునిధీ!

72


క.

జ్ఞానికి శాంతంబును నవ
ధానికి లింగార్పితముల తాత్పర్యంబున్
దానికి నుచితంబును నభి
మానికి నడుగమియు నొప్పు మహితగుణాఢ్యా!

73


క.

ఎట్టి వ్రతస్థుం డైనను
నెట్టి మహాభక్తుఁ డైన నెన్నఁ[3]గఁబడుఁ దాఁ
బట్టిన నియమంబులు [4]తుద
ముట్టినచో బీఱువోకమున్నె మహాత్మా!

74


క.

ఒడలును బ్రాణము [5]మానస
మొడమియుఁ గొనియాడ కవసరోచిత మైనం
గడఁగి నివేదింపక చొ
ప్పడునే సద్భక్తి? భక్తిపారీణమతీ!

75


ఉ.

మంచిగ నిత్యధర్మనియమవ్రతతత్పరుఁ డై దయాత్ముఁ డై
సంచితపుణ్యుఁ డై గుణవిశారదుఁ డై శివలింగపూజలం
దంచితసత్క్రియానిరతుఁ డై చరియించిన; భక్తుఁడే మనో
వంచకుఁ డైనఁ బ్రాణధనవంచకుఁ డైన సదోచితంబులన్.

76


క.

ఒడ లిది నాయది యన్నన్
జెడు నొడ లది లేక భక్తి సేయఁగరా ద
య్యొడలు గొని యుండియును దా
నొడలిగుణంబులను బొరయకుండఁగ వలదే?

77
  1. నేమానము
  2. వినుతి
  3. గలఁడు
  4. తను
  5. మానము నుడికిం