పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

అనుభవసారము


క.

ఏయెడ భక్తుఁడె భక్తని
కాయం బిల మెచ్చ బాహ్యగతి మెలఁగండే,
నాయంతర్గతియు మనో
నాయకుఁ డీశుండు మెచ్చ నడవండేనిన్?

67


క.

తను సేయుభక్తి తాఁ జే
యను విహితం బట్లు గాక యన్యులఁ జేయం
బనుచుట సజ్జనభక్తికి
ననుచిత మె ట్లనిన సత్క్రియాభరణాంకా!

68


క.

సంతతము నెట్టి యాప్తులఁ
గాంతలఁ గవయంగఁ గుడువఁ గట్టఁగఁ దా నై
కంతుహరు పూజ సేయఁగ
నెంతశఠుం డైనఁ బనుచునే? త్రిపురారీ!

69


క.

తా [1]నురవడించె నేనియుఁ
గానంగా రాదు భక్తికడ యెఱుఁగ కుదా
సీనుం డైనం జెడు నటు
గాన వివేకంబు భక్తిగతి త్రిపురారీ!

70


క.

[2]ఉరువిడికిఁ దెలివి; భక్తికిఁ
బరిచర్య; కృతార్థమతికి భయమును; వ్రతత
త్పరతకుఁ జలమును; దగుస
చ్చరితకు నిస్పృహయు నొప్పు సద్భక్తినిధీ!

71


క.

వలపునకుఁ దలఁపు; చేఁతకు
నలయమి; పలుకులకు వినయ; మారాధన క

  1. నురువడించె
  2. ఉరువడికి