పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

అనుభవసారము


దవికల్పం బగుచలమును
భవియెడ రోఁతయును వలయు భక్తుల కెందున్.

58


క.

కామంబు భక్తి రతియెడఁ
దా మఱి క్రోధంబు దేహధర్మములయెడన్
వ్యామోహము భక్తులయెడ
శ్రీమతిలోభంబు వలయు శివపూజయెడన్.

59


క.

మదమాత్సర్యంబులు మది
[1]వదలినకార్యములు గాఁగ వర్తించుచు నె
మ్మదిఁ జనునాతని జన్మం
బది సఫలము; కానినాఁడు నది శ్లాఘ్యంబే?

60

శివపూజావసరసావధానము లింగస్థలము

సీ.

లింగార్చనక్రియాసంగతి శృంగార
         రసమును నద్భుతరసముఁ దోఁప
ననయంబు జంగమార్చన సేయుచో శాంత
         రసము భయానకరసముఁ దోఁప
సంసారసంపదల్ చర్చించుచో హాస్య
        రసమును బీభత్సరసముఁ దోఁప
దుష్టేంద్రియంబులఁ దూలించుచో రౌద్ర
        రసమును నతివీరరసముఁ దోఁప


ఆ.

నెల్లజీవరాశియెడలను గారుణ్య
రసముఁ దోఁప భక్తి రమణఁ బరఁగు

  1. వదలని