పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

21


ఆ.

యగుచు నాది కాది యగుచు నఖండితం
బగుచు సకలనిష్కళాంగ మగుచు
నభిమతార్థదాయి యగుచు శిష్యావళిం
దన్నుఁ జేర్చుకొనును దాత యగుచు.

53


క.

హేతువులు పాఱి దృష్టాం
తాతీతం బై పరాంత మగుచున్న పరం
జ్యోతి మఱి తానె యిల గురు
వై తనరుట శిష్యరక్షణార్థము గాదే?

54


క.

భక్తునకు గమ్యమాన మ
భక్తునకు నగమ్య[1]మానపద మగుటం బ్ర
వ్యక్తిగ గురురూపము భయ
[2]భక్తులకును బట్టు దానిఁ బట్టఁగఁ దరమే?

55


క.

భయ మది భక్తికి హేతువు
క్రియ గొన సద్భక్తి ముక్తికిని హేతువు ని
శ్చయముగ భక్తులకుం ద
ద్భయమె ప్రధానంబు భక్తి[3]పారీణతకున్.

56


క.

నియతియె భక్తికి జీవము
భయ మది మును ప్రాణపదము భావాదికశు
ద్ధియు చైతన్యము తగు స
త్క్రియశృంగారంబు భక్తికిం ద్రిపురారీ!

57


క.

శివభక్తులయెడ భయమును
శివునెడ నతివీరగుణము శీలంబులయం

  1. మూల
  2. భక్తిని కాతొంట దాన
  3. పారీణులకున్.