దివ్యదేశ వైభవ ప్రకాశికా/

వికీసోర్స్ నుండి

విజయవాడ - 49

ఇది ప్రసిద్ధ నగరము. కొత్తగుళ్ళు అనేపేరుతో ప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి సేవింపవలెను. ఇచట కృష్ణానదీ స్నానము విశేషము. పండ్రెండు సంవత్సరములకు ఒకసారి గురువు కన్యారాశిలో ప్రవేశించినపుడువచ్చు కృష్ణాపుష్కర సంరంభము తప్పక సేవింపవలెను.

మార్గము: మద్రాసు-విశాఖ రైలుమార్గములో విజయవాడ ప్రముఖ స్టేషన్.

పెదముత్తేవి - 50

ఇది కృష్ణాజిల్లాలోనిదే. విజయవాడ నుండి పోవచ్చును. సుప్రసిద్ధులైన శ్రీశ్రీశ్రీ సీతారామ యతీంద్రులు వారి అంతే వాసులు శ్రీశ్రీ లక్ష్మణయతీంద్రులు నివసించిన ప్రదేశము-వారి ఆశ్రమము లక్ష్మీనారాయణుల సన్నిధి కలవు.


171

శోభనాచలము (ఆగిరిపల్లి) - 51

వ్యాఘ్ర నరసింహస్వామి - రాజ్యలక్ష్మి త్తాయార్.

విశే:- కొండమీద స్వామి సన్నిధి గలదు. స్వామి మిక్కిలి ప్రభావ సంపమన్నులు. నూజివీదు ఆస్థాన మహావిద్వాన్ ఉ.వే.శ్రీమాన్ కిడాంబి గొపాల కృష్ణమాచార్యుల వారు ఈ స్వామిని ఉద్దేశించి "శోభనాద్రీశవైభవము"అను బృహత్తర చంపూప్రబంధమును (సంస్కృతభాషలో) అను గ్రహించినారు. ఇందు రామాయణ భారత భాగవతాదులతో పాటు బ్రిటిష్ పరిపాలన వరకు గల భారతదేశ చరిత్ర సమీక్షింపబడినది.

మార్గము: కృష్ణా జిల్లా నూజివీడుకు సమీపము.

172

ద్వారకా తిరుమల - 52

శ్రీవేంకటేశ్వరస్వామి-సుదర్శన తీర్థము-నిలచున్నసేవ-తూర్పుముఖము-ద్వారకా మహర్షికి ప్రత్యక్షము.

విశే: ద్వారక మహర్షి కోరికపై స్వామి కొండపై వెలసినాడు. మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి. తిరుపతి క్షేత్రమును సేవింపలేనివారు ఈ స్వామిని సేవించి కానుకలర్పింతురు.

ప్రసిద్ధ ప్రార్థనా స్థలము-ఈస్వామి భక్తుల పాలిటి కొంగుబంగారము.

మార్గము: విజయవాడ-రాజమండ్రి స్టేషనుల భీమడోలు స్టేషన్ నుండి 20 కి.మీ. ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ నుండి బస్‌వసతి కలదు.


173

అంతర్వేది - 53

లక్ష్మీనరసింహస్వామి-రాజ్యలక్ష్మీత్తాయార్-కూర్చున్నసేవ-తూర్పుముఖము-సాగర సంగమము-వసిష్ఠమహర్షికి ప్రత్యక్షము.

విశే: ఇది నరసాపురం పట్టణమునకు 10 కి.మీ. దూరములో సముద్రతీరమున గల పుణ్యక్షేత్రము. సముద్రస్నానము విశేషము. మాఘశుద్ధ దశమినాడు జరుగు కల్యాణము ఏకాదశినాటి రథోత్సవమును సేవించుటకు లక్షలాదిగా భక్తులువత్తురు. ఈ స్వామి సన్నిధిలో సుదర్శనాళ్వాన్ వేంచేసియున్నారు. ప్రముఖప్రార్థనా స్థలము. ప్రసిద్ద నృసింహక్షేత్రములలో ప్రధానమైనది అంతర్వేది.

మార్గము: నరసాపురం నుండి లాంచీమీదను, గోదావరి దాటి బస్ మీదను చేరవచ్చును.

నృసింహస్వామి(అంతర్వేది)

NRISIMHA SWAMY(ANTARVEDI)

174

ర్యాలి - 54

ఇది అతి పురాతనమైన సన్నిధి. స్వామి జగన్మోహినీ కేశవస్వామి, పరమశివునకు ప్రత్యక్షము.

విశే: మోహినీ అవతారమును చూచి మోహించిన పరమశివునకు తన నిజస్వరూపమును ప్రదర్శించిన స్థలము. కావుననే స్వామి ముందుభాగము కేశవుడుగా, వెనుకభాగము జగన్మోహినిగా వేంచేసియుందురు. ఈదృశ్యము అతిమనోహరమైనది. స్వామి శ్రీపాదముల నుండి సదా గంగా ప్రవహించు చునేయుండును. మకరతోరణముపై దశావతారములు కలవు.

మార్గము: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు 10 కి.మీ దూరము.

జగన్మోహినీ కేశవ స్వామి(ర్యాలి)

JAGANMOHINI KESAVA SWAMY(RYALY)

175

పాలకొల్లు - 55

అష్టభుజస్వామి సన్నిధి కలదు. సన్నిధి ప్రాచీనమైనది. స్వామి అష్టభుజములతో వేంచేసియున్న కారణమున అష్టభుజస్వామియని పేరువచ్చెను. కాంచీపురములోని అష్టభుజస్వామి తరువాత ఆరీతిలో వేంచేసియున్న దివ్యస్థలము. ఇది సుప్రసిద్ధ వ్యాపారకేంద్రము. ఇచట ప్రతి వత్సరము ఉభయవేదాన్త సభలు జరుగు చున్నవి. దీనికి 10 కి.మీ అభినవభూతపురి(నరసాపురము)కలదు.

మార్గము: భీమవరం-నరసాపురం రైల్వే మార్గంలో పాలకొల్లు స్టేషన్.

కొఠాలపఱ్ఱు - 56

ఆదికేశవ ప్పెరుమాళ్-యతిరాజవల్లి త్తాయార్-అనంత విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ.

విశే: ఇదియు ప్రాచీనమైన సన్నిధి-సన్నిధిలో నరసాపురం సన్నిధిలోవలె కైంకర్యములు జరుగును. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి అతిశయముగా కలదు. స్వామి వరప్రదుడు.

మార్గము: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండనుండి 5 కి.మీ.

రాజమహేంద్రవరము - 57

ఇది అతిప్రాచీనమైన నగరము. ఆదికవినన్నయ మహాభారతము నాంధ్రీకరించిన ప్రదేశము. గోదావరీనదీ తరంగాలతో సుశీతలమైన నగరము. గురుడు సింహరాశిలో ప్రవేశించునపుడు జరుగు పుష్కర సంరంభములు జగద్విఖ్యాతములు. ఇచట గోదావరీ స్నానము విశేషము. గోదావరి సమీపముననే ప్రాచీనమైన వేణుగోపాలస్వామి దేవాలయము కలదు. నగరములోని తులసీ రామానుజకూటము భక్తులకు వాసయోగ్యము.

మార్గము: విజయవాడ-విశాఖ రైలుమార్గములో రాజమండ్రి స్టేషన్. అన్ని ప్రధాన నగరముల నుండి బస్సు వసతి కలదు.

కోరుకొండ - 58

ఇచటకొండమీద ప్రాచీనమైన నరసింహస్వామి సన్నిధి గలదు. శ్రీరంగం పరాశర సుదర్శన్ భట్టర్ వంశీకులైన భట్టర్‌స్వామివారి నిర్వాహములోగల క్షేత్రము. స్వామి వరప్రదుడు-ప్రతి సంవత్సరము ఉభయ వేదాంత సభలు వైభవముగా జరుగుచుండును.

మార్గము: రాజమహేంద్రవరమునకు 20 కి.మీ.

176

పిఠాపురం - 59

ఇదిప్రాచీనమైన నగరము. పీఠికాపురియనిపేరు. ఇచట కున్తీ మాధవ స్వామి సన్నిధికలదు. దీనిని మణవాళమహామునులు ప్రతిష్ఠించినట్లు చెప్పుదురు.

పద్మనాభం, రామతీర్థం - 60

ఈరెండును విజయనగరం సమీపములోనివి. పద్మనాభస్వామి, కోదండరామస్వాముల సన్నిధులు కలవు. ప్రాచీనమైనవి. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి మిక్కుటముగా గలదు.

కాకినాడ - 61

ఇది ప్రసిద్దనగరము. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణము. ఈనగరమునకు 10 కి.మీ. దూరములోని జి.వేమవరం అనే గ్రామంలో అష్టాక్షరీ క్షేత్రము కలదు.ఇచట వేంచేసియున్న వైకుంఠనారాయణ పెరుమాళ్ అతిశయమైన సౌందర్యముతో భక్తుల హృదయాలను దోచుకొందురు. ఇచట ప్రతి నిత్యము అష్టాక్షరీ జప తర్పణ హోమాదులు జరుగును. దీని నిర్వాహకులు ఉపనిషత్ సిద్దాంతాచార్య పీఠాధిపతులు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగరామానుజ జీయర్ స్వామివారు.

శ్రీ వైకుంఠ నారాయణులు

SRI VYKUNTA NARAYANULU

177

ధర్మపురి - 62

ఇది కరీంనగర్ జిల్లాలోనిది. నరసింహస్వామి సన్నిధి గోదావరీ నదీతీరమున గలదు. ప్రాచీన దేవాలయములలో ధర్మపురి యొకటి. ఈ క్షేత్రస్వామి విషయమై శేషప్పకవి నృసింహ శతకమును రచించెను. తుఱుష్కులవలన బాధలుపడిన శేషప్పకవి స్వామిని నిందాస్తుతి గర్బముగ స్తుతించెను.

నల్గొండ - 63

ఇదిజిల్లా కేంద్రము. ఇచటరామగిరిలో శ్రీసీతారామస్వామి సన్నిధి ఆండాళ్ సన్నిధి కలదు. శ్రీరామనవమి, ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. పలు ప్రాంతముల నుండి భక్తులు వచ్చి దర్శింతురు.

యాదగిరిగుట్ట - 64

లక్ష్మీనరసింహస్వామి సన్నిధి కొండమీద గలదు. భక్తులకు వరప్రసాది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. పలుప్రాంతముల నుండి భక్తులు వచ్చి సేవింతురు.

మార్గము: విజయవాడ రైలు మార్గంలో రాయగిరి స్టేషన్‌కు 10 కి.మీ.

నరసింహస్వామి(యాదగిరి గుట్ట)

NARASIMHA SWAMY

(YADAGIRIGUTTA)

178

సికిందరాబాద్ - హైదరాబాద్ - 65

ఇది ప్రసిద్ధనగరము. ఇచట గల లక్ష్మీనారాయణ మందిరము, శ్రీరంగనాథస్వామి సన్నిధి సేవింపవలెను. ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. ఈనగరములోనే గల సీతారాంబాగ్‌లోను ప్రాచీనమైన లక్ష్మీనారాయణుల సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి కలదు. ఎందరో మహానీయులు ఇచటకు వేంచేసి మంగళా శాసనం కృపచేసిన స్థలము.బిర్లాసంస్థ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి మనోహరమైనది

ఈనగరములోనే మరియొక సన్నిధి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి. ఇది ఆల్వాలలో కలదు.(సికిందరాబాద్-బొలారం మార్గము) దీనికి దేవుని అల్వాల అనియేపేరు. వందల సంవత్సరముల నాటి సన్నిధి శిధిలముకాగా దానిని ప్రస్తుతం పునర్నిర్మించుచున్నారు.

స్తంభాద్రి - 66

ఇది ఖమ్మం మెట్టుకు 2 కి.మీ దూరములో గలదు. ఇచటగల నరసింహస్వామి సన్నిధి ప్రాచీనమైనది. ఈస్వామి భక్తుల పాలిటి కల్పవృక్షము.

వేదాద్రి - 67

ఆంధ్రదేశమున సుప్రసిద్ధమైన నృసింహ క్షేత్రములలో వేదాద్రియొకటి. ఇచట ఒక చిన్నపర్వతముపై స్వామివేంచేసియున్నారు. చతుర్ముఖబ్రహ్మ నారదాదులకు ఈ పర్వతము మీదనే వేదపురాణాదులను ఉపదేశించెననియు వారి ప్రార్థనపై స్వామి అర్చారూపముగా ఇచటవేంచేసెనని చెప్పుదురు. కావుననే ఈపర్వతమునకు వేదాద్రియని పేరువచ్చినది.

మార్గము: హైదరాబాద్-విజయవాడ బస్సు మార్గములో జగ్గయ్యపేటకు సమీపములో కలదు.

బుచ్చిరెడ్డి పాలెం - 68

కోదండరామస్వామి-సీతాదేవి-లక్ష్మీ నృసింహస్వామి-ప్రాచీనమైన దివ్యస్థలము. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవము అతివైభవముగా జరుగును.

మార్గము: నెల్లూరుకు 15 కి.మీ దూరములో కలదు.

179

శ్రీకాకుళం - 69

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఇది కృష్ణాతీరమునగల ప్రాచీన దేవాలయము. ఈస్వామి శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నమున సాక్షాత్కరించి ఆముక్త మాల్యదను రచింపుమని ఆదేశించినట్లు రాయలు తన ఆముక్తమాల్యద పీఠికలో తెలియజేసెను.

మార్గము: కృష్ణాజిల్లా చల్లపల్లికి సమీపములో గలదు.

భీమవరం - 70

శ్రీరామకోటి క్షేత్రము. ఇది శ్రీమత్పరమహంసేత్యాది శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వాముల వారి శ్రీహస్తములచే ప్రతిష్ఠింపబడిన రామకోటిక్షేత్రము. దీనిని భగవద్రామానుజ దర్శన కైంకర్య సమితివారు నిర్వహించుచున్నారు. నిత్య కల్యాణము, నిత్య తదీయారాధనము జరుగు చున్నవి. ఉభయవేదాన్త సభలను నిర్వహించు చున్నారు.

మార్గము: ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రధాన నగరములలో ఒకటి.

గుమ్మడదల - 71

ఇది ప్రాచీనమైన క్షేత్రము. కల్యాణ రామచంద్ర స్వామి దేవస్థానము కలదు. ఈ సన్నిధిలో జరుగు అధ్యయనోత్సవమును శ్రీ ఘంటంభట్ట వేంకట భుజంగరాయశర్మ గారు మనోహర కావ్యముగా రూపొందించినారు.

మార్గము: మెదక్ జిల్లా నరసాపూర్‌కు సమీపములో కలదు.

180