దివ్యదేశ వైభవ ప్రకాశికా/ఆళ్వారుల వైభవం

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయనమ:

ఆళ్వార్ల వైభవము

1 పొయిగై యాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-

    తులాయాం శ్రవణేజాతం కాంచ్యాం కాంచన వారిజాత్
    ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాశ్రయే ||
నిత్య తనియన్:-
    కాంచ్యాం సరసి హేమాబ్జే జాతం కాసారయోగినామ్‌|
    కలయే యశ్శ్రియ: పత్యూ రవిన్దీప మకల్పయత్||

వీరు ద్వాపర యుగాది 8,60,900 సంవత్సరమైన సిద్ధార్ది నామ సంవత్సర అల్పిశి(తుల)నెల శుద్ధ అష్టమీ జయవారం (మంగళ) శ్రవణా నక్షత్రమందు కాంచీపురం యథోక్తకారి సన్నిధి యందుగల పుష్కరణిలో స్వర్ణమయమైన తామర పుష్పమునందు అయోనిజులై అవతరించిరి. వీరికి సరో యోగి యనియు, కాసారయోగి యనియు నామాంతరములు. ఆచార్యులు సేనముతలియార్.

వీరు పాంచజన్యాంశ సంభూతులు. వీరు నిస్పృహులై గ్రామైక రాత్రముగా తిరుగుచు భగవద్గుణానుభవమే ధారక పోషక భోగ్యములు కాగా వేంచేసియుండిరి. ఒకనాడు "తిరుక్కోవలూర్" అను దివ్యదేశము వేంచేసి పెరుమాళ్లకు మంగళాశాసనము చేసి ఒక తిన్నెమీద వేంచేసి యుండగా పూదత్తాళ్వార్ వేంచేసినారు. అపుడు ఇద్దరును కూర్చుండిరి. కొంతసేపటికి పేయాళ్వార్లు అక్కడకు వేంచేసిరి. ముగ్గురకు కూర్చుండుటకు స్థలము లేకుండుటచే నిలుచుండిరి. వీరి సంశ్లేషమును గోరిన సర్వేశ్వరుడు వీరిమధ్య ప్రవేశించెను.

నిలిచియుండుటకును స్థలము చాలనందున వారు అందుకు కారణమేమా! యని యోగ దృష్టిచే చూడగా శ్రియ:పతి సాక్షాత్కరించెను. అపుడు వారి అనుభవ పరీవాహరూపముగా అవతరించిన దివ్య ప్రబన్దములే ముదల్ తిరువన్దాది, ఇరండాం తిరువన్దాది, మూన్ఱాం తిరువందాదులు. ప్రతిపాశురాంతపదము పాశురాది యందు వచ్చుటచే ఈ ప్రబంధములకు అన్దాది యని పేరు కలిగెను.

ఆళ్వార్-పొయిగై యాళ్వార్. తిరునక్షత్రం: తుల-శ్రవణం

తిరువవతారస్థలం: కాంచీ తిరువెஃకా(యథోక్తకారి సన్నిధి) పొయ్‌గై పుష్కరిణీ యందలి స్వర్ణ కమలము.

                                             181 

ఆచార్యులు:- సేనముదలి యాళ్వార్

అనుగ్రహించిన ప్రబందము:- ముదల్ తిరువందాది 100 పాశురములు.

మంగళాశాసన దివ్యదేశములు:- 6

నాళ్‌పాట్టు

ఐప్పిశియిల్ ఓణం; అవిట్టం శదయమివై;
ఓప్పిలవానాళ్‌గళ్; ఉలగత్తీర్-ఎప్పువియుం
పేశుపుగழ் ప్పొయ్‌గైయార్ పూదత్తార్;పేయాళ్వార్;
తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాழிతిరునామజ్గళ్

శెయ్య తులా వోణత్తిల్ శగత్తు దిత్తాన్ వాழிయే
     తిరుక్కచ్చి మానగరుమ్‌ శెழிక్క వందోన్ వాழிయే
వై యన్దగళి నూఱుమ్‌ వగుత్తరై త్తాన్ వాழிయే
     వనశమలర్ క్కరుపదనిల్ వన్దమైన్దాన్ వాழிయే
వెయ్య కదిరోన్ దన్నై విళక్కిట్టాన్ వాழிయే
     వేజ్గడవర్ తిరుమలై యై విరుమ్బుమవన్ వాழிయే
పొయ్‌గై ముని వడివழுగుమ్‌ పొఱ్పదముమ్‌ వాழிయే
    పొన్ ముడియుమ్‌ తిరుముగముమ్‌ పూతలత్తిల్ వాழிయే.

182

2 పూదత్తాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-
   తులా ధనిష్ఠా సంభూతం భూతం కల్లోల మాలిన:|
   తీరేపుల్లోత్పలే మల్లాపుర్యామీడే గదాంశజమ్‌ ||

నిత్యతనియన్:-
   మల్లావర పురాధీశం మాధవీ కుసుమోద్భవమ్‌ |
   భూతం నమామి యోవిష్ణో: జ్ఞానదీప సుకల్పయత్||

వీరు పొయిగై యాళ్వార్ అవతరించిన మరునాడు అనగా సిద్దార్థి నామ సంవత్సర తులామాసం శుద్ద నవమీ బుదవారం ధనిష్ఠా నక్షత్రమున తిరుక్కడల్ మల్లై(మహాబలిపురం) దివ్యదేశమందు మాదవీ పుష్పమునందు అయోనిజులై యవతరించిరి. పూతమ్‌ అనగా ఆత్మ సర్వేశ్వరునకు ఆత్మగా నుండుట వలన వీరికి పూదత్తాళ్వార్ అనుపేరు వచ్చెను. వీరు గదాంజశులు మిగిలిన వివరము పొయ్‌గై ఆళ్వార్ చరిత్రలో చూడవచ్చును.

ఆళ్వార్:- పూదత్తాళ్వార్ .
తిరునక్షత్రం:- తుల, ధనిష్ఠ.
అవతార స్థలం:- "తిరుక్కడల్‌మల్లై".
ఆచార్యులు:- సేనముదలి యాళ్వార్.
అనుగ్రహించిన ప్రబంధము:- ఇరణ్డాన్దిరువన్దాది 100 పా||
మంగళాశాసన దివ్యదేశములు:- 13.

నాళ్‌పాట్టు

   ఐప్పిశియిల్ ఓణం ; అవిట్టం శదయమివై;
   ఓప్పిలవానాళ్‌గళ్; ఉలగత్తీర్-ఎప్పువియుమ్‌
   పేశుపుగழ் ప్పొయిగైయార్ పూదత్తార్; పేయాళ్వార్;
   తేశుడనే;తోన్ఱు శిరప్పాల్.

వాழிతిరునామజ్గళ్

   అన్భేదగళినూఱు మరుళినాన్ వాழிయే
         ఐప్పిశియిల్ అవిట్టత్తిల్ అవదరిత్తాన్ వాழிయే
   నన్సుకழ் శేర్ కురుక్కత్తి నాణ్మలరోన్ వాழிయే
         నల్ల తిరుక్కడల్ మల్లై నాదనార్ వాழிయే
   ఇన్బురుగు శిన్‌దై తిరియిట్ట పిరాన్ వాழிయే
         ఎழிల్ ఇన్‌చ్చుడర్ విళక్కై యేత్తినాన్ వాழிయే
   పొన్నురై యుమ్‌ తిరువరజ్గల్ పుగழுరై ప్పోన్ వాழிయే
        పూదత్తార్ తాళిణై ఇప్పూదలత్తిల్ వాழிయే.

183

3. పేయాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-
   తులా శతభిషగ్ఱాతం మయూర పురి కైరవాత్
   మహాస్తం మహదాఖ్యాతం వన్దే శ్రీ నన్దకాంశజమ్‌||
నిత్య తనియన్:-
   దృష్టాని తుష్టావ యో విష్ణుం రమయా మయిలాధినమ్‌
   కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయ మాశ్రయే||

వీరు ముదలాళ్వార్ల ముగ్గురిలో మూడవవారు. మదరాసులోని మయూరపురి(మైలాపూర్) యందు మణికైరవమనెడి భావియందవతరించిరి. వీరు మహాయోగులై లోకరీతిని వ్యవహరింపక సదా సర్వేశ్వరునే ధ్యానించుచు ఉన్మత్తుల వలె నుండుటచే పేయాళ్వార్ అని ప్రసిద్ధులైరి. వీరు ద్వాపరయుగాది 8,60,900 సంవత్సరమున సిద్దార్థినామ సంవత్సరమున తులా మాసం శుద్ద దశమీ గురువారం శతబిషానక్షత్రము నందవతరించిరి. మిగిలిన చరిత్ర పొయిగైయాళ్వార్ చరిత్రలో చూడవలెను.వీరునందకాంశజులు.

ఆళ్వార్లు:- పూదత్తాళ్వార్.
తిరునక్షత్రం:- తుల-శతబిషమ్‌.
అవతారస్థలం:- మయూరపురి.
ఆచార్యులు:- సేనముదలియాళ్వార్.
తిరువారాదన:-ఆళ్వార్కళ్‌నైనార్
ప్రబంధము:-మూన్ఱాం తిరువన్దాది. 100 పా.
మంగళాశాసన దివ్యదేశములు:- 15.

నాళ్‌పాట్టు

   ఐప్పిశియిల్ ఓణం ; అవిట్టం శదయమివై;
   ఓప్పిలవానాళ్‌గళ్;ఉలగత్తీర్-ఎప్పువియుమ్‌
   పేశుపుగழ் ప్పొయిగైయార్ పూదత్తార్;పేయాళ్వార్;
   తేశుడనే; తోన్ఱు శిరప్పాల్.

వాழிతిరునామజ్గళ్

   తిరుక్కణ్డే నెననూఱుమ్‌ శెప్పినాన్ వాழிయే
        శిఱన్ద ఐప్పిశియిల్ శదయమ్‌ శెనిత్త వళ్ళల్ వాழிయే
   మరుక్కమழுమ్‌ మయిలై నగర్ వాழవన్దోన్ వాழிయే
        మలక్కరియ నెయ్‌దన్ తనిల్ వన్దుదిత్తాన్ వాழிయే
   నెరుక్కిడవే యిడై కழிయిల్ నిన్ఱ శెల్వన్ వాழிయే
        నేమి శజ్గం వడివழగై నె--ల్వైప్పోన్ వాழிయే
   పెరుక్కముడన్ తిరుమழிశై ప్పిరాన్ తొழுవోన్ వాழிయే
        పేయాళ్వార్ తాళిణై యెప్పెరు నిలత్తిల్ వాழிయే

184

తిరుమழிశై యాళ్వార్

తిరునక్షత్రతనియన్:-
   సుఖాయాం సుకరేమాసి చక్రాంశం భార్గవోద్భవమ్‌
   మహీసార పురాధీశం భక్తిసార మహం భజే|
నిత్యతనియన్:-
   శక్తి ప--మయ విగ్రహాత్మనే, శుక్తిహారజిత చిత్తహారిణే
   ముక్తిదాయక మురారి పాదయో భక్తిసారముపయే నమోనమ:||

వీరు తొణ్డమణ్డలములో చేరిన "తిరుమழிశై" అను క్షేత్రమునందు ద్వాపరంతమున విభవనామ సంవత్సర మకరమాసమున కృష్ణదశమీ గురువారం మఖా నక్షత్రమునందవతిరించిరి. వీరు భార్గవమహర్షికి కనకాంగి యను అప్సర స్త్రీవలన జన్మించిరి. తిరుమழிశై యను క్షేత్రము నందవతరించుటచే తిరుమழிశై యాళ్వార్ అనిప్రసిద్ధినొందిరి. వీరు చక్రాంశజులు.

వీరుమొదట శైవ సిద్దాన్తమునందు ప్రవేశించిరి. వీరి వృత్తాన్తమును తెలిసిన పేయాళ్వార్లు వీరున్నచోటునకు పోయి వారికి శ్రీవైష్ణవ సిద్దాన్తము నందు రుచి కలుగజేసి పంచ సంస్కారములననుగ్రహించిరి. వీరిప్రభావము అమితమైనది. దానిని గురుపరంపరాప్రభావాది గ్రంథములలో చూడనగును.

ఆళ్వార్లు:- తిరుమழிశై ఆళ్వార్, భక్తిసారులు.
తిరునక్షత్రం:-మకరమాసం-మఖానక్షత్రం.
ఆచార్యులు:-పేయాళ్వార్.
అవతారస్థలం:-తిరుమழிశై.
పరమపదము:-తిరుక్కుడన్దై.
ప్రబంధము:-నాన్ముగన్ తిరువన్దాది 96 పా. తిరుచ్చన్దవిరుత్తము 120 పా.
మంగళాశాసన దివ్యదేశములు:-16

నాళ్‌పాట్టు

   తై యిల్ మకం ఇన్ఱు;తారణియీర్! ఏత్‌తం-ఇన్ఱ
   త్తై యిల్ మగత్తుక్కు; చాత్‌తు గిన్ఱేన్-తుయ్యమది
   పెత్‌త మழிశై ప్పిరాన్;పిఱన్ద నాళెన్ఱు;
   వల్‌తవరగళ్;కొణ్డాడుం నాళ్.

వాழிతిరునామమ్‌

   అన్బుడ వన్దాది తొణ్ణూత్తాఱురైత్తాన్ వాழிయే
        అழగారుం తిరుమழிశై యమర్‌న్ద శెల్వన్ వాழிయే
   ఇన్బమిగు తై యిల్ మగత్తిజ్గువన్దాన్ వాழிయే
        ఎழிల్ చన్ద విరుత్తం నూత్తిరుపత్తీన్దాన్ వాழிయే
   మున్బుగత్తిల్ వన్దుతిత్త మునివనార్ వాழிయే
       ముழுప్పెరుక్కిన్ పొన్నియెదిర్ మిదన్ద కొల్లోన్ వాழிయే
   నన్బువియల్ నాలాయిరతైழு మాత్తాన్ వాழிయే
       వజ్గళ్ పత్తిశారార్ ఇఱునఱ్పదజ్గళ్ వాழிయే

185

నమ్మాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-
    వృషభేతు విశాఖాయాంకురికాపురి కారిజమ్‌
    పాండ్యదేశే కలేరాదౌ శఠారిం పైన్యసం భజే||
నిత్యతనియన్:-
    మాతాపితా యువతయ స్తవయా విభూతి
    స్సర్వం యదేవ నియమేన మదంవయానామ్‌|
    అధ్యస్యన:కుపపతే ర్వకుళాభి రామం
    శ్రీ మత్తరంఘ్రి యుగళం ప్రణమామి మూర్థ్నా||

ప్రసన్న జనకూటస్థులగు నమ్మాళ్వార్లు కలియుగాది 43 వ దినమగు ప్రమాది నామ సం||ర వైశాఖ శుక్ల చతుర్దశీ శుక్రవారం విశాఖా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమున ఉడై యనంగై యార్ (నాథనాయకి) కారియార్ అను దంపతులకు పుత్రులుగా తిరుక్కురుగూర్ నందవతిరించిరి. వీరు విష్వక్సేసుల యవతారము.

వీరు జన్మించిన దాదిగా స్తన్యపానము చేయక భగవద్గుణానుభవముతో కాలము గడుపుచుండగా తల్లిదండ్రులాశ్చర్యపడి వీరిని "పొలిన్ద నిన్ఱపిరాన్" అను పెరుమాళ్ల సన్నిధికి తీసికొనిపోయిరి. వీరును నేత్రములు తెఱచి పెరుమాళ్లను సేవించి శేషాంశము నందవతరించిన "తిరుప్పుళియాళ్వార్ల" (నిద్రపోని చింతమాను) క్రింద యోగనిష్ఠులై వేంచేసిరి. వీరికి శఠగోపులనియు, వకుళాభరణములు అనియు, పరాంకుశులు అనియు తిరునామములు కలవు

మధుర కవి యాళ్వార్లు ఉత్తరదేశయాత్ర చేయుచు అయోధ్యలో నుండగా నొకనాటి రాత్రి దక్షిణదేశమునుండి ఒక కాంతిపుంజము కనుపింపగా దానిననుసరించి తిరుక్కురుగూర్ చేరి ఆళ్వార్లను సేవించిరి. వారు యోగనిష్ఠలో నుండుటచే వారిని మేల్కొలుపుటకై పెద్దరాతిని పడవేసి శబ్దము చేసిరి. అంతట కనులు తెఱచి చూచిన ఆళ్వార్లను, స్వామీ! ప్రకృతిలో జన్మించిన జీవుడు దేనిని తిని యెచట పరుండునని ప్రశ్నింపగా ఆళ్వార్లు దానినే తిని అచటనే పడియుండునని సమాదానము చెప్పిరి. మధుర కవులు సంతసించి ఆళ్వార్లకు శిష్యులైరి. వీరి వైభవము వాచాను గోచరము. గురుపరంపరా ప్రభావాదులతో సేవింపవచ్చును.

అవతారస్థలము:తిరుక్కురుగూర్(ఆళ్వార్‌తిరునగరి).
తిరునక్షత్రం:వృషభం, విశాఖ.
ఆచార్యులు: సేనముతలియార్.
ప్రబంధము: తిరువిరుత్తం 100, తిరువాశరియం 7

186

పెరియతిరువన్దాది, 87 తిరువాయి మొழி 1102.
మంగళాశాసన దివ్యదేశములు: 38

నాళ్‌పాట్టు

పా. ఏరార్ వైగాశి విశాగత్తి నేற்றత్తై
   ప్పారోరఱియ ప్పగర్‌గిన్ఱేన్-శీరారుమ్‌
   వేదం తమిழ்శెయ్‌ద మెయ్యన్ ఎழிల్‌కురగై
   నాదన్ అవదరిత్త నాళ్.

పా. ఉణ్డో వైగాశి విశాగత్తుక్కు ఒప్పారునాళ్?
   ఉణ్డో శడగోపర్‌క్కు ఒప్పారువర్-ఉణ్డో
   తిరువాయిమొழிక్కొప్పు? తెన్‌కురుగైక్కు ఉణ్డో
   ఒరుసార్ దన్ని లొక్కుమూర్?

వాழி తిరునామజ్గళ్

తిరుక్కురుకై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్‌కళ్ వాழிయే,
         తిరువాన తిరుముకత్తు చ్చెవియెన్ఱుమ్‌ వాழிయే,
ఇరుక్కుమొழி యెన్నె--ల్ తేక్కినాన్ వాழிయే,
         ఎన్దై యెతిరాశర్ క్కిఱైయవనార్ వాழிయే,
కరుక్కుழிయిల్ పుకావణ్ణమ్‌ కాత్తరుళ్‌వోన్ వాழிయే,
        కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాழிయే,
వరుత్త మఱవెన్దన్నై వాழ்విత్తాన్ వాழிయే
        మతురకవి తమ్బిరాన్ వాழி వాழி వాழிయే.

ఆన తిరువిరుత్తం నూఱు మఱుళినాన్ వాழிయే
        ఆశిరియ మేழுపాట్టు అళిత్త పిరాన్ వాழிయే
ఈనమఱ వన్దాది యెణ్బత్తేழிన్దాన్ వాழிయే
        ఇలగు తిరువాయిమొழி యాయిరత్తొరు మాత్తిరణ్డురైత్తాన్ వాழிయే
వానణియుమ్‌ మామాడక్కురుగై మన్నన్ వాழிయే
       వైగాశి విశాగత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
శేనై యర్‌కో నవతారం శెయ్‌ద వళ్ళల్ వాழிయే
       తిరుక్కురుగై చ్చడగోపర్ తిరువడిగళ్ వాழிయే

187

మేదివియిల్ వైయాశి విశాగత్తోన్ వాழிయే
      వేదత్తై శెన్దమిழாయ్ విరిత్తురైత్తాన్ వాழிయే
ఆదిగురువాయ్ ప్పువియిల్ అవదరిత్తాన్ వాழிయే
     అనవరతమ్‌ శేనై యర్కోన్ అడితొழுవోన్ వాழிయే
నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాన్ వాழிయే
     వన్ మధురకవి వణజ్గుమ్‌ నావీరన్ వాழிయే
మాదవన్ పొఱ్పాదుకైయాయ్ వళర్‌న్దరుళ్‌వోన్ వాழிయే
     మగిழ்మాఱన్ శడగోపన్ వైయగత్తిల్ వాழிయే.

నమ్మాళ్వార్

NAMMALVAR

ఋషీం జాషామహే కృష్ణ తృష్ణ తత్త్వ మివోదితమ్‌

సహస్ర శాఖాం యోద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితామ్‌.

188

మధుర కవియాళ్వార్

తిరునక్షత్రతనియన్:-
   మేషే చిత్తా సముద్భూతం పాండ్య దేశే గణాంశకమ్‌
   శ్రీపరాంకుశ సద్బక్తం మధురం కవి మాశ్రయే||
   హస్త స్థ తాళద్వితయం ప్రపద్యే శఠారి వా గ్వ్యాసముదారకీర్తమ్|
   మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సమ్బావిత బుద్దితత్త్వమ్‌||
నిత్యతనియన్:-
   అవిదిత విషయాంతర శఠారే:
   ఉపవిషదాముపగానమాత్మభోగ:
   అపిచగుణవశాత్తదైక శేషీ
   మధురకవి: హృదయే మమావిరస్తు.

వీరు పాండ్య దేశమందలి తిరుక్కోళూరు అను దివ్య దేశమున కుముద గణేశాంశమున వకుళభూషణ భాస్కరోదయమునకు ముందు(నమ్మాళ్వార్ల అవతారమునకు) అరుణోదయమువలె మేషమాసమున చిత్తా నక్షత్రమునందవతరించిరి.

వీరు ఉత్తర దివ్యదేశయాత్ర చేయుచు ఒకనాడు అయోధ్యలో వేంచేసియుండగా నాటిరాత్రి దక్షిణ దిశనుండి అప్రాకృత దివ్యతేజ:పుంజమును చూచి ఆశ్చర్యచకితులై రాత్రి భాగమునందు దాని ననుసరించుచు పోయి క్రమముగా ఆళ్వార్ తిరునగరి చేరిరి. అచట తింత్రిణి మూలమున పద్మాసనోపవిసిష్ఠులై వేంచేసియున్న నమ్మాళ్వార్లను సేవించిరి.

వారు ముకుళితనేత్రులై యుండుటచే వారి శ్రవణేంద్రియ పాటవమును పరికింప నొకరాతినియెత్తి పడవైచిరి. ఆశబ్దమునువిని ఆళ్వార్లు కనులు విప్పి జాడగా "ప్రకృతి సంబంధముగల జీవుడు దేనిని తి యెచట పడియుండు" నని ప్రశ్నింపగా ఆళ్వార్లు "దానినే తిని యచటనే పడియుండునని" సమాధానమిచ్చిరి.

ఆ సమాధానము వినిన మదురకవులు ఆళ్వార్ల జ్ఞాన విశేషమునకాశ్చర్యపడి వారిని ఆచార్యులుగా వరించిరి. ఆళ్వార్లును వీరినభిమానించి తామనుగ్రహించిన దివ్య ప్రబంధమును వీరికినుపదేశించిరి. మధురకవులును తమయాచార్యుల యందలి ప్రావణ్యముచే "కణ్ణిమణ్ శిరుత్తాంబు" అనుదివ్య ప్రబంధము ననుగ్రహించిరి.

189

ఆళ్వార్లు: మధురకవియాళ్వార్.
తిరునక్షత్రం: మేషం-చిత్త.
అవతారస్థలము: తిరుక్కోళూరు.
ఆచార్యులు: నమ్మాళ్వార్
అనుగ్రహించిన ప్రబంధము: కణ్ణిమణ్ శిరుత్తాంబు. 11 పాశురములు.

నాళ్‌పాట్టు

ఏరార్ మధురకవి; ఇవ్వులగిల్ వన్దుదిత్త,
శీరారుం శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్-పారులగిల్
మత్‌తుళ్ల ఆళ్వార్గళ్;వన్దుదిత్తనాళ్ గళిలుమ్‌
ఉత్‌తదమక్కెన్ఱు నె--! ఓర్.

వాழிతిరునామజ్గళ్

శిత్తిరయిల్ శిత్తిరై నాళ్ శిఱక్క వందోన్ వాழிయే
     తిరుక్కోళూరపదరిత్త శెల్వవార్ వాழிయే
ఉత్తర కజ్గాతీరత్తుయర్ తవత్తోన్ వాழிయే
     ఒళి కదిరోన్ తెఱ్కు తిక్క పుగున్దు వన్దాన్ వాழிయే
పత్తి యెడు పదినొన్ఱుమ్‌ పాడినాన్ వాழிయే
     పరాంకుశనే వరనెన్ఱువత్తి నాన్ వాழிయే
మత్తిమమాం పదప్పొరుళై వాழ் విత్తాన్ వాழிయే
     మధురకవి తిరువడిగళ్ వాழி వాழி వాழிయే.

మధురకవి ఆళ్వార్

MADHURA KAVI

190

కులశేఖరాళ్వార్లు

తిరునక్షత్రతనియన్:-
   కుంభే పునర్వసౌ జాతాం కేరళే చోళ పట్టణే
   కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రయే||
నిత్యతనియన్:-
   ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
   తమహం శిరసా వందే రాజాసం కులశేఖరమ్‌||

వీరు చేరదేశమున(కేరళ)తిరువంజిక్కళం (కోழி) యను దివ్యదేశమున క్షత్రియ వర్ణమున కలియుగాది ఇరువది యెనిమిదవ సంవత్సరమగు పరాభవనామ సంవత్సర కుంభ(మాఘ) మాసము శుద్ద ఏకాదశి గురువారము పునర్వసు నక్షత్రమున కౌస్తుభాంశమున అవతరించిరి.

వీరు "కూరార్‌న్ద వేల్ వలవన్ కోழிయర్‌కోన్ కుడైక్కులశేఖరన్" (వాడియైన వేల్ అను ఆయుధ ప్రయోగమున దక్షులును, కోழி నగర ప్రభువులును, చత్రధారులును అగు కులశేఖరాళ్వర్లు) అనునట్లు క్షత్రియోచితముగ రాజ్యపాలన చేసెడివారు.

పిమ్మట సర్వేశ్వరుని నిర్హేతుక జాయమాన కటాక్షలబ్ధి దివ్యజ్ఞాన సంపన్నులై "ఇన్బమరుమ్‌ శెల్వముమ్‌ ఇవ్వరశుమ్‌ యాన్ వేణ్డేన్" (భోగ సమృద్ధమైన యీ సంపద, రాజ్యము నాకు వలదని విరక్తులై శ్రీరంగనాథులను సేవింపవలెనను ఆశచే ప్రతినిత్యము శ్రీరంగయాత్రా ప్రయత్నము చేయుచుండెడివారు.

వీరికి శ్రీరామచంద్రుల యందు ప్రేమాతిశయమధికము. ఒక పర్యాయము వీరు శ్రీరామాయణ కాలక్షేపమున "జన స్థానమునగల పదునాల్గు వేల రాక్షస పరివార సహితులగు ఖరదూషణ త్రిశిరులను శ్రీరామచంద్రడెదుర్కొనె" నను ఘట్టమునువిని తన్మయులై సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమున శ్రీరామచంద్రులకు సహాయపడుటకై పరివార సమేతముగా బయల్వెడలిరి. ఇదిగాంచిన మంత్రులు పౌరాణికులచే శ్రీరామచంద్రుల విజయమును వినిపింపగా సంతృప్తులై వెనుదిరిగిరి.

శ్రీవైష్ణవ సంప్రదాయమున శ్రీరమచంద్రునకు "పెరుమాళ్" అని తిరునామము. వారియందు అత్యంత ప్రీతి కలిగి వారి నక్షత్రము నందవతరించిన ఈ ఆళ్వార్లకును పెరుమాళ్ అనుతిరునామ మేర్పడినది. వీరనుగ్రహించిన దివ్య ప్రబంధము

                                    191 

పెరుమాళ్ తిరుమొழி. వీరి వైభవమును గురుపరంపరా ప్రభావమున సేవింపవచ్చును.

అవతారస్థలము:కేరళదేశమున కోழிయను నగరము.
తిరునక్షత్రం: కుంభం, పునర్వసు.
ప్రబంధము:పెరుమాళ్ తిరుమొழி(105 పా)
మంగళాశాసన దివ్యదేశములు:-10

నాళ్‌పాట్టు

మాశిప్పునర్ పూసం; కాణ్మిన్ ఇన్ఱు మణ్ణులగీర్!
తేశిత్తివశత్తుకేదెన్నిల్-పేశుగిన్ఱేన్
కొల్లినగర్‌కోన్;కులశేకరన్ పిరప్పాల్
నల్లవర్గళ్; కొణ్డాడుం ణాఆల్.

వాழிతిరునామజ్గళ్

అ--న మామలై ప్పిఱవి యాదరిత్తోన్ వాழிయే
      అణియరజ్గర్ మణై త్తూణై యడై న్దుయ్‌న్దోన్ వాழிయే
వ--నగరన్దన్నిల్ వాழవన్దోన్ వాழிయే
      మాశిదనిర్ పునర్పూశం వన్దుదిత్తాన్ వాழிయే
అ-- లెన క్కుడప్పామ్బిలమ్‌ కై యిట్టాన్ వాழிయే
      అనవరత మిరామకదై అరుళుమవన్ వాழிయే
శె--ల్ మొழி నూత్త--మ్‌ శెప్పినాన్ వాழிయే
     శేరలర్కోన్ శెజ్గమల త్తిరువడిగళ్ వాழிయే.

కులశేఖరాళ్వార్

KULASEKHARALWAR

192

పెరియాళ్వార్లు

మిధునే స్వాతిజం విష్ణో:రథాంశం ధన్విన: పురే|
ప్రపద్యే శ్వశురం విష్ణో:విష్ణుచిత్తం పురశ్శిఖమ్‌|
గురుముఖ మన ధీత్య ప్రాహనేదానశేషాన్
నరపతి పరిక్లప్తం శుల్కమాదాతుకామ:
శ్వశురమమర సంద్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి

వీరు పాండ్యదేశమునందలి "శ్రీవిల్లిపుత్తూరు" ఆను దివ్యదేశమున కలియుగాది 47వ సంవత్సరమైన క్రోదన నామ సంవత్సర మిధున (ఆషాడ)మాసము శుక్ల ఏకాదశీ భానువాసరమున స్వాతీ నక్షత్రమున పెరియ తిరువడి అంశమున (గరుత్మంతుల అంశ) శ్రీముకున్దాచార్యుల వారికి "పద్మైయార్" అను దేవియందు అవతరించిరి. వీరికి తండ్రిగారు పెట్టినపేరు. రామాండార్. భట్టనాథులనియు; విష్ణుచిత్తులనియు నామాంతరములు. వీరు సకల శాస్త్ర పారంగతులు. వైదిక నిష్ఠాగరిష్టులు కావుననే వీరికి భట్టనాథులనియు, పట్టర్ పిరాన్ అనియు పేరువచ్చినది. "వేదప్పయన్ కొళ్ళవల్ల వీట్టుశిత్తన్"; మున్నగు వాక్యములు వీరి వైదిక నిష్ఠను తెలియజేయుచున్నవి. "పీతకవాడ పీరానార్ పిరమ గురువాగివన్దు" (పీతాంబరుడే పరమాచార్యుడై వచ్చి) అనువీరి వాక్యము వలన సర్వేశ్వరునే ఆచార్యులుగా వరించి సమస్త శాస్త్రములను అదికరించిరని తెలియుచున్నధి. మఱియు అపస్తంభ ధర్మ సూత్రములకు దూర్తస్వామి రచించిన వృత్తికి వీరు వ్యాఖ్యానము చేసినట్లు పెద్దలు చెప్పుదురు.

"ప్రహ్లాదో జన్మవైష్ణవ:" అనునట్లు వీరు బాల్యము నుండి శ్రీమన్నారాయణుని పాదపద్మములందు ప్రావణ్యము కలిగియుండిరి. శ్రీవిల్లిపుత్తూరులో పెరుమాళ్లకు నిత్యము పుష్పకైంకర్యము నిర్వహించెడివారు.

పాండ్యదేశమును పరిపాలించు వల్లభదేవుని ఆస్థానమున జరిగిన విద్వద్గోష్ఠిలో శ్రీమన్నారాయణుడే పరతత్త్వమని సిద్ధాంతస్థాపన చేసి వల్లభదేవుని వైష్ణవోత్తమునిగా తీర్చిరి. తన భక్తుని కార్యమునకు మెచ్చిన సర్వేశ్వరుడు గరుడ వాహనారూడుడై వేంచేయగా "సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహమును సేవించిన ఆళ్వార్లు "అతిస్నేహ: పాపశంకీ" అనునట్లు ప్రేమాతిశయముచే సర్వేశ్వరునకు ప్రాకృతుల వలన ఏమిచేటగునోయని భయపడి వారికి పల్లాండు పాడిరి. (మంగళా శాసనం చేసిరి) ఆకారణమున వీరిని పెరియాళ్వార్లు అని అందురు.

వీరికి శ్రీకృష్ణావతారమున ప్రావణ్యమధికవణజ్గుమ్‌. వీరనుగ్రహించిన

                       193 దివ్య ప్రబంధములు రెండు. మొదటిది తిరుపల్లాండు. వేదపారాయణకు ప్రారంభమున ప్రణవము వలె దివ్య ప్రబంధపారాయణకు తిరుపల్లాండు మొదటిది. రెండవ ప్రబంధము పెరియాళ్వార్ తిరుమొழி. వీరి కుమార్తె ఆండాళ్. ఆమెను శ్రీరంగనాథుల కిచ్చి వివాహము చేయుటచే వీరు శ్రీరంగనాథులకు మామగారైరి.

అవతారస్థలం: శ్రీవిల్లిపుత్తూరు
తిరునక్షత్రం: ఆని(మిధున)మాసం స్వాతి.
దివ్యప్రబంధము: తిరుపల్లాండు-12;పెరియాళ్వార్ తిరుమొழி 429 పాశురములు
మంగళాశాసన దివ్యదేశములు: 19

నాళ్‌పాట్టు

పా. ఇన్‌ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏழை నెంజే!
    ఇన్‌ఱై క్కెన్‌నేత్ తమెనిల్ ఉరైక్కేన్-నన్ఱిపునై
    పల్లాణ్డు పాడియ నం పట్టర్ వన్దుదిత్త
    వాల్లావియిల్ శోదినాళ్.

పా. మానిలత్తిల్ మున్ నం పెరియాళ్వార్ వన్దుదిత్త
    ఆనిదన్నిర్ శోది యెన్ఱాల్ ఆదరిక్కుం-ఈనియర్‌కు
    ఒప్పోరిల్లై ఇవ్వులగుదనిల్ ఎన్ఱు నెంజే
    ఎప్పోదుం శిన్ధిత్తిరు.

పా. మజ్గళా శాసనత్తిన్ మత్తుళ్ల ఆళ్వార్ కళ్
    తజ్గళార్వత్తళవు దావన్ఱి-పాజ్గుమ్‌
    పరివాళే విల్లిపుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్
    పెరియాళ్వారెన్ఱుం పెయర్.

వాழிతిరునామజ్గళ్

   వల్ల తిరుప్పల్లాణ్డు వాన్ మూన్ఱోన్ వాழிయే
        నామాత్‌తిఱుపత్తొన్ఱుమ్‌ నమక్కురైత్తాన్ వాழிయే
   శొల్లరియ వానిదనిఱ్పోది వన్దాన్ వాழிయే
       తొడై శూడిక్కొడుత్తాళ్ తొழுన్దమప్పన్ వాழிయే
   శెల్వవమ్బిదనై ప్పోల శిఱప్పుత్‌త్తాన్ వాழிయే
       శెన్ఱు కిళియఱుత్తుమాల్ తెయ్‌వమెన్ఱాన్ వాழிయే
   విల్లిపుత్తూర్ నగరత్తై విళక్కినాన్ వాழிయే
       వేదియర్కోన్ పట్టర్ పిరాన్ మేదినియిల్ వాழிయే.

194

ఆండాళ్

తిరునక్షత్రతనియన్:-
   కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవామ్‌
   పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరజ్గనాయకమ్‌||
నిత్యతనియన్:-
   నీళాతుజ్గ స్తన గిరి తటీ సుప్త ముద్బోధ్యకృష్ణం
   సారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ద మధ్యాపయన్తీ|
   స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుజ్త్కే
   గోదా తస్యై నమ ఇదమిదం భూయాయేనాస్తు భూయ:||

వీరు కలియుగాది తొంబది యెనిమిదవ సంవత్సరమగు నళనామ సంవత్సర కర్కాటక శుద్ద(శ్రావణశుక్ల) చతుర్దశీ మంగళవారము పూర్వపల్గునీ నక్షత్రమున జనకచక్రవర్తికి సీతాదేవివలె భూదేవి అంశమున పెరియాళ్వార్లకు కుమార్తెగా అయోనిజగా తులసీ వనమందవతరించిరి. తండ్రిగారు వీరి రూపలావణ్యాదులు చూచి "కోదై" యను తిరునామముంచిరి.

వీరు బాల్యమునుండి తండ్రిగారి యనుష్ఠానమును చూచి వారు వినిపించు శ్రీవిష్ణుపురాణ భాగవతాది కథలను విని శ్రీరంగనాథుని యందు మిక్కిలి ప్రావణ్యము కలవారై యుండిరి. తమ తండ్రిగారు పెరుమాళ్లకై కూర్చిన మాలికలను ముందు తాము దరించి అద్దములో చూచుకొని తాను "శ్రీరంగనాథులకు తగియుంటినా లేదా" అని పరీక్షించుకొను చుండెను.

ఇట్లుండగా ఒకనాడు పెరియాళ్వార్లు ఈ దృశ్యము చూచి అపచారమని నాడు పెరుమాళ్లకు పుష్పకైంకర్యమును నిలిపివేసిరి. వటపత్రశాయి పెరియాళ్వార్లకు స్వప్నమున సాక్షాత్కరించి గోదాదేవి ప్రభావమును తెలిపి ఆమె ధరించిన పుష్పములే తనకు ప్రీతికరములనియు వానినే సమర్పింపుమనియు ఆనతిచ్చిరి.

గోదాదేవియు పరమపురుషుని భర్తగాగోరి ద్వాపరయుగమున గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతము నాదర్శముగా ధనుర్మాస వ్రతమాచరించి శ్రీరంగనాథుని వివాహము చేసికొనిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు. 1 తిరుప్పావై 30 పా. 2 నాచ్చియార్ తిరుమొழி. వీరిప్రభావము గురుపరంపరా ప్రభావాదులలో చూడవచ్చును.

195

అవతారస్థలం: శ్రీవిల్లిపుత్తూరు
తిరునక్షత్రం:కర్కాటకం , పుబ్బ
ప్రబంధములు:తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొழி 143 పాశురములు
మంగళాశాసన దివ్యదేశములు: 11

నాళ్‌పాట్టు

పా. ఇన్ఱో తిరువాడి ప్పురమ్‌-ఎమక్కాగ
    నన్ఱో; ఇజ్గు ఆణ్డాళ్ అవదరిత్తాల్-కున్ఱాద
    వాయ్వాన వైగున్దవాన్;పోగన్దన్నై ఇగழ்న్దు
    ఆళ్వార్ తిరుమగళారాయ్.

పా. పెరియాళ్వార్ పెణ్పిళ్ళైయాయ్; ఆణ్డాళ్ పిఱన్ద
    తిరువాడి ప్పూరత్తిన్ శీర్మై-ఒరునాళైక్కు
    ఉణ్డో మనమే! ఉణర్‌న్దుపార్-ఆణ్డాళుక్కు
    ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుం ఉణ్డు.

పా. అ--క్కుడిక్కు ఒరు శన్దదియాయ్-ఆళ్వార్గళ్
    తంశయలై; వి-- నిఱ్కుం తన్మైయళాయ్-పి--య్
    ప్పழுత్తాళై యాణ్డాళై ప్పత్తియుడన్ నాళుమ్‌
    వழுత్తాయ్ మనమే! మగిழ்న్దు.

వాழி తిరునామజ్గళ్

    తిరువాడి ప్పూరత్తిల్ శెగత్తుదిత్తాళ్ వాழிయే
           తిరుప్పావై ముప్పదుమ్‌ శెప్పినాళ్ వాழிయే
    పెరియాళ్వార్ పెత్తెడుత్త పెణ్పిళ్లై వాழிయే
           పెరుమ్బూదూర్ మామునిక్కు ప్పిన్నానాళ్ వాழிయే
    ఒరునూత్తు నాఱ్పత్తు మూన్ఱురైత్తాళ్ వాழிయే
          ఉయర రజ్గర్కేకణ్ణి యుగన్దళిత్తాళ్ వాழிయే
    మరువారుం తిరుమల్లి వళనాడు వాழிయర్
          వణ్ పుదువై నగర్ కోదై మలర్ పదజ్గళ్ వాழிయే

    శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
    శ్రీరంగ రాజహరిచన్దనయోగదృశ్యామ్!
    సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
    గోదామనన్య శరణశ్శరణం ప్రపద్యే||

196

తొండరడిప్పొడి ఆళ్వార్

తిరునక్షత్రతనియన్:-
   కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి కులోద్భవమ్‌|
   చోళోర్వ్యాం వనమాలాంశం భక్తవద్రేణు మాశ్రయే||
నిత్యతనియన్:-
   తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్‌
   ప్రాబోధకీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంత మీడే||

వీరు కుంభఘోణమునకు సమీపమునగల మండంగుడియను దివ్యదేశమున కలియుగాది రెండువందల తొంబదియెనిమిది సంవత్సరమునకు సమమైన ప్రభవ నామ సంవత్సర ధనుర్మాసమున (మార్గశిరము) కృష్ణ పక్ష చతుర్దశీ మంగళవారము జ్యేష్ఠా నక్షత్రమున వనమాలాంశమున అవతరించిరి.

వీరికి తండ్రిగారు "విప్రనారాయణు"లను తిరునామమునుంచిరి. వీరొకానొక పర్యాయము శ్రీరంగము వేంచేసి ఉభయ కావేరీ పరీవాహమధ్యమున పవళించియున్న శ్రీరంగనాథులను సేవించి ఆనందనిర్బరులై అందే నిత్యనివాసము చేయుచుండిరి.

వీరును పెరియాళ్వార్లవలె ప్రతినిత్యము పుష్పమాలా కైంకర్యము చేయుచుండేడివారు. అందులకై యొక నందన వనమును కల్పించిరి. వీరు కొంతకాలము "దేవదేవి" యను స్త్రీసాంగత్యము వలన మోహపరవశులై యుండియు భగవదనుగ్రహమువలన జ్ఞానోదయముకాగా సవాసనగా నితర సంబంధములన్నియు వదలి తదేక ద్యానపరులై స్వామికైంకర్యము చేయుచుండిరి. వీరనుగ్రహించిన దివ్యప్రబంధములు రెండు 1. తిరుప్పళ్ళి యెழுచ్చి 2. తిరుమాలై

ఆళ్వార్లు: తొండరడిప్పొడి ఆళ్వార్లు
అవతారము: ధనుర్మాసము, జ్యేష్ఠానక్షత్రము
అనుగ్రహించిన ప్రబంధము:తిరుప్పళ్ళియెழுచ్చి 10 పా, తిరుమాలై 45 పా
మంగళాశాసన దివ్యదేశములు: 3

నాళ్‌పాట్టు

   మన్నియశీర్ మార్‌గழிయిల్ కేట్‌టై యిన్ఱు మానిలత్తీర్!
   ఎన్నిదమ క్కేత్‌తమెనిల్ ఉరైక్కేన్-తున్నుపుగழ்
   మామఱైయోన్;తొణ్డరడిప్పొడియాళ్వార్ పిఱప్పాల్
   నాన్మఱైయోర్;కొణ్డాడుంనాళ్.

197

వాழிతిరునామజ్గళ్

   మణ్ణంగుడి యదనై వాழ்విత్తాన్ వాழிయే
           మార్గழிయిల్ కేట్టెదనిల్ వన్దుదిత్తాన్ వాழிయే
   తెణ్డిరై శూழరజ్గరై యే దెయ్‌వ మెన్ఱాన్ వాழிయే
           తిరుమాలై యొన్బ త--మ్‌ శెప్పినాన్ వాழிయే
   పణ్డు తిరుప్పళ్లియెழுచ్చి ప్పత్తురైత్తాన్ వాழிయే
          పావై యర్గళ్ కలవితనై పழிత్త శెల్వన్ వాழிయే
   తొణ్డుశెయ్‌దు తుళబత్తాల్ తులజ్గినాన్ వాழிయే
          తొణ్డరడిప్పొడి యాళ్వార్ తుణైప్పదజ్గళ్ వాழிయే.

తొండరడిప్పొడి ఆళ్వార్

TONDARADIPPODI ALWAR

మందంగుడి

198 సారంగ మహామునీ

తిరుప్పాణియాళ్వార్

తిరునక్షత్ర తనియన్:-
   వృశ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే|
   శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాశ్రయే||
నిత్యతనియన్:-
   శ్రీ లోకసారంగ మహామునీంద్ర స్కంధాధి రూడం కలయామి నిత్యమ్‌
   కళంక హీనం కమనీయ భక్తం కవీశ్వరం గాయక సార్వభౌమమ్‌||
   ఆపాదచూడ మనుభూయ హరిం శయానం,
   మధ్యే కనేర దుహితుర్ము దితాస్తరాత్మా|
   అదృష్టతాం నయనయో ర్విషయాప్తరాణాం
   యోనిశ్చికాయ మననై మునివాహనాం తమ్‌||

వీరు శ్రీరంగమునకు సమీపమున గల ఉఱైయూర్ అను దివ్య దేశమున కలియుగాది 342 సంవత్సరమునకు సరియగు దుర్మతి నామ సం||ర వృశ్చిక మాస (కార్తీక) కృష్ణపక్ష విదియా బుధవారమున రోహిణీ నక్షత్రమున ఒక బ్రాహ్మణుని క్షేత్రమున(పొలమున)వ్రీహి సస్యమున శ్రీవత్సాంశమున అయోనిజులై అవతరించిరి. ఆ త్రోవను పోవుచున్న ఒక మాలదాసరి వీరిని చూచి సంతాన హీనుడగుటచే వారిని భగవత్ప్రసాదముగా భావించి తనగృహమునకు తీసికొని పోయి పెంచుచుండెను.

వీరును అంత్యవర్ణమున పెరుగుటచే తమ అవకర్షమును దలచి శ్రీరంగక్షేత్రమును చేరక దక్షిణ తీరమునందే యుండి ఏకతారను మీటుచు శ్రీరంగనాథుని స్తుతించుచు ఆనంద నిర్బరులై యుండిరి.

శ్రీరంగనాథులును వీరి భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంతసించి వారిని తోడ్కొని రమ్మని శ్రీలోకపారంగ మహామునీంద్రులను పంపిరి. వారును ఆళ్వార్లను పరిపరివిధముల ప్రార్థించినను ఆళ్వార్లు తమ నైచ్యమును తలచి శ్రీరంగ ప్రవేశము చేయుటకు అంగీకరింపలేదు. అంతట లోకపారంగమునీంద్రులు శ్రీరంగనాథులపై "ఆన"పెట్టి ఆళ్వార్లను తమభుజములపై వేంచేపుచేసికొని వచ్చి శ్రీరంగనాథుని సేవింపజేసిరి. ఆళ్వార్లను శ్రీరంగనాథుని సేవించి ఆనంద నిర్భరులై "అమలనాది పిరాన్" అను దివ్యప్రబంధము ననుగ్రహించిరి. "అణియరంగన్ ఎన్నముదినై కణ్డకణ్గళ్ ముత్తొన్ఱినై క్కాణవే" శ్రీరంగనాథులను సేవించిన నా నేత్రములు ఇతర విషయములను జూడజాలవు అని శ్రీరంగనాథులలో నైక్యము చెందిరి. తిరునక్షత్రము:వృశ్చికమాసం, రోహిణి.

199 అవతారస్థలం: ఉఱైయూర్

దివ్యప్రబంధము:అమలనాదిపిరాన్ 10 పా

మంగళాశాసన దివ్యదేశములు: 3

నాళ్‌పాట్టు

కార్తిగై యిల్ రోహిణినాళ్, కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్
వాయ్‌త్త పుగழ்పాణర్ వన్దుదిప్పాల్-అత్తియర్ గళ్
అన్బుడనేదాన్; అమలనాది పిరాన్ కత్‌తదఱ్పిన్;
నన్గుడనే కొణ్డాడుం నాళ్.

వాழிతిరునామమ్

ఉమ్బర్ తొழு0 మెయ్‌జ్ఞాన ముఱై యూరాన్ వాழிయే
      ఉరోగిణినాళ్ కార్‌తిగై యిల్ ఉదిత్త వళ్లళ్ వాழிయే
వమ్బివిழ்తార్ మునితోళిల్ వగుత్తపిరాన్ వాழிయే
      మలర్‌క్కణ్ణిల్ వేఱొన్ఱుం వై యాదాన్ వాழிయే
అమ్బువియిల్ మదిళరజ్గ రగం పుగున్దాన్ వాழிయే
      అమలనాది పిరాన్ పత్తు మరుళినాన్ వాழிయే
శెమ్పతుమై యరుళ్ కూఱుం శెల్వనార్ వాழிయే
      తిరుప్పాణన్ పొఱ్పదజ్గళ్ శగతలత్తిల్ వాழிయే

200

తిరుమంగై ఆళ్వార్లు

తిరునక్షత్ర తనియన్:-
   వృశ్చికే కృత్తికా జాతాం చతుష్కవి శిఖామణిమ్‌|
   షట్ర్సబంధ కృతం శార్జ్గ మూర్తిం కలిహ మాశ్రయే||
నిత్య తనియన్:-
   కలయామి కలిధ్వంసిం కవిం లోక దివాకరమ్‌
   యస్య గోభి: ప్రకాశాభి రావిద్యం విహతం తమ:||

వీరు కలియుగాది 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక(కార్తిక)మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున శార్జ్గాంశమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము "నీలనిఱైత్తర్".

వీరు పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొనిరి. అందులకై వీరు శ్రీవైష్ణవ తదీయారాధన నిర్వహించుచు ద్రవ్యమునకై చౌర్యమును చేయదొడగిరి. వీరి అద్యవసాయమును పరీక్షింపదలచి పెండ్లికుమారుని వేషమున వచ్చిన శ్రియ:పతిని గూడ దోచి స్వామి శ్రీపాదస్పర్శచే జ్ఞానోదయముకాగా "నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి.

వీరు తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారముచేయుచు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుచుండిరి. మరియు వేదబాహ్యులైన జైన బౌద్దాదులను జయించి ఆద్రవ్యముతో శ్రీరంగనాథులకు మణి మంటప ప్రాకారాదులు నిర్మించిరి.

వీరు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన చతుర్వేద సారభూతమైన నాల్గు ప్రబంధములకు షడంగములుగా ఆరుప్రబంధములను అనుగ్రహించిరి. వీరివైభవము వాచామగోచారము. దానిని గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.

ఆళ్వార్లు: తిరుమంగై ఆళ్వార్లు
తిరునక్షత్రం: వృశ్చికమాసం-కృత్తిక
అవతారస్థలం: తిరుక్కుఱైయలూర్
ప్రబంధములు: 1 పెరియతిరుమొழி 2 తిరుక్కురున్దాణ్డగమ్‌ 3 తిరునెడున్దాణ్డగమ్‌ 4 తిరువెழுక్కూత్తిఱుక్కై 5 పెరియ తిరుమడల్ 6 శిఱయ తిరుమడల్.
మంగళాశాసనంచేసిన దివ్యదేశములు: 86

201

నాళ్‌పాట్టు

పా. పేదై నెన్‌న్జే! ఇన్‌ఱై ప్పెరుమై అఱిన్దిలైయో!
   ఏదు ప్పెరుమై; ఇన్‌ఱైక్కెన్నెన్నిల్?-ఓదుగిన్ఱేన్
   వాయ్‌త్త పుగழ் మంగై యర్‌కోన్; మానిలత్తిల్ వన్దుదిత్త;
   కార్తిగైయిల్; కార్తిగై నాళ్ కాణ్

పా. మాఱన్ పణిత్త తమిழ் మఱైక్కు, మజ్గైయర్‌కోన్
    అఱజ్గం కూఱ అవదరిత్త-వీఱుడైయ
    కార్తిగైయిల్ కార్తిగైనాళ్ ఎన్ఱెన్ఱు కాదలిప్పార్
    వాయ్‌త్త మలర్ త్తాళ్‌గళ్ నెన్‌న్జే! వాழ்త్తు

వాழி తిరునామమ్‌

ఐయనరుళ్‌మారి శెయ్యపడియిణైకళ్ వాழிయే
        అన్దుకిలుమ్‌ శీరావుమ్‌ అణై యుమరై వాழிయే
మై యిలకు వేలణైత్త వన్మైమిక వాழிయే
        మాఱామలన్జలిశెయ్ మలర్‌క్కరజ్గళ్ వాழிయే
శెయ్య కలనుడనలజ్గళ్ శేర్‌మార్‌పుం వాழிయే
        తిణ్బుయముం పణిమలర్‌న్ద త్తిరుక్కழுత్తుమ్‌ వాழிయే
మై యల్ శెయ్యుముక ముఱువల్ మలర్ క్కణ్గళ్ వాழிయే
        మన్నుముడితొప్పారుమ్‌ వలయుముడన్ వాழிయే
కలన్ద తిరుకార్‌తిగై యిల్ కార్తిగై వన్దోన్ వాழிయే
        కాశినియిలొణ్ కురైయలూర్ క్కావలోన్ వాழிయే
నలం తిగழாయిరత్తు ఎణ్పత్తు నాలురైత్తాన్ వాழிయే
        నాలైన్దు మాఱైన్దుం నమక్కురైత్తాన్ వాழிయే
ఇలజ్గెழுకూత్ తిరుక్కై యిరుమడ లీన్దాన్ వాழிయే
        ఇమ్మూన్ఱిల్ పాట్టిరునూత్‌తిరుపత్తేழி శైత్తాన్ వాழிయే
వలం తిగழு0 కుముదవల్లి మణవాళన్ వాழிయే
        వాట్కలియన్ పరకాలన్ మంగై యర్కోన్ వాழிయే

శ్రీమదాలి శ్రీనగరి నాథాయ కలివైరిణే
చతుష్కని ప్రధానాయ పరకాలాయ మంగళమ్‌.

202