దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/ప్రధమ సత్యాగ్రహఖైదీ

వికీసోర్స్ నుండి

జరిగింది కూడా ఫలానా రోజున. ఫలానరాత్రి, యిన్ని గంటలకు ఫలానా కొట్లో పత్రాలు ఫలానా ఫలానా వాళ్లు తీసుకోబోతున్నారు అని ఆఫీసుకు సమాచారం అందింది. ఆ వార్త అందగానే అట్టి వాళ్ల దగ్గరకు వెళ్లి అలా చేయవద్దని నచ్చచెప్పారు. ఆకొట్టు దగ్గర పికిటింగు కూడా చేశారు. అయినా నాటిరాత్రి 11 గంటలకు భారతీయ నేతలు కొందరు రహస్యంగా పత్రాలు తీసుకున్నారు. ఇలాంటి ఘట్టంవల్ల ఒక సిద్ధాంత ప్రకారం సాగుతున్న ఉద్యమానికి విఘాతం కలిగింది. మర్నాడే ఆ పెద్ద మనుష్యులపేర్లు పత్రికల్లో ప్రకటించబడ్డాయి. మనిషి పడే సిగ్గులజ్ఞలకు కూడా ఒక హద్దనేది వుంటుంది! దీనికంతటికీ కారణం స్వార్థమే స్వార్థం జడలు విరబోసుకునేసరికి మనిషి జారిపోతాడు. సిగ్గులజ్ఞలు అతణ్ని ఏమీ చేయలేవు ఈ విధంగా అంతఃకలహాలకు లోనై సుమారు 500 మంది భారతీయులు పత్రాలు పుచ్చుకున్నారు. కొద్ది రోజులు యీ తతంగం సొంత ఇళ్లలో జరిగింది. మెల్ల మెల్లగా అట్టివారిని చలివదిలి వేసింది ఆ తరువాత బహిరంగంగానే ఏషియాటిక్ ఆఫీసుకు వెళ్ళి అనుమతి పత్రాలు తీసుకోవడం ప్రారంభించారు



18

ప్రధమ సత్యాగ్రహఖైదీ

ఎంత కష్టపడ్డా 500కి మించి భారతీయుల పేర్లు రాకపోయేసరికి ఏషియాటిక్ శాఖకు సంబంధించిన అధికారులు భారతీయులను అరెస్టు చేయడం అవసరమని నిర్ణయానికి వచ్చారు. పాఠకులకు జర్మిస్టస్ పేరు తెలుసుకదా! అక్కడ భారతీయులు చాలామంది ఉంటున్నారు. వారిలో ఒకని పేరు రామసుందర్ పండిత్ అతడు చూచుటకు శూరుడు వీరుడుగా కనబడేవాడు వాచాలుడు కొద్ది సంస్కృత శ్లోకాలు అతడినోటికి వచ్చు ఉత్తర ప్రదేశ్‌కి చెందినవాడు కనుక తులసీ రామాయణ మందలి కొన్ని దోహాలు, చౌపాయీలు కూడా అతనికి వచ్చు పండిత్ కనుక జనం అతణ్ని గౌరవిస్తూ వుండేవారు. ఉపన్యాసాలు యిస్తూ ఆవేశాన్ని కూడా నింపుతూ వుండేవాడు. అక్కడ ప్రభుత్వానికి దాసోహం చేసిన కొందరు భారతీయ ప్రభుద్దులు ఏషియాటిక్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్లి యీ పండిత్‌ని ఆరెస్టు చేయండి. దానితో భయపడిపోయి జనం పత్రాలకోసం ఎగబడతారని రెచ్చగొట్టారు. ఆ ఆఫీసు అధికారి పొంగిపాయి వెంటనే రామసుందర్ పండిత్‌ను అరెస్టు చేయించాడు. ఈ రకమైన మొదటికేసు కావడం వల్ల పండిత్ అరెస్టు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. భారతీయుల్లో పెద్ద అలజడి ప్రారంభమైంది. జర్మిస్టన్ వరకే ప్రచలితమై యున్న పండిత్ పేరు ఒక్క క్షణంలో దక్షిణాఫ్రికా యందంతట వ్యాపించింది ఏ ఒక్క మహాపురుషుణ్ణి అరెస్టు చేసినా అతడిపేరు సర్వత్ర వ్యాపించునట్లు రామ సుందర్ పండిత్ పేరు అంతటా వ్యాపించింది. అందరి దృష్టి ఆయన మీదకు మళ్లింది. అతణ్ణి అరెస్టు చేస్తే శాంతికి ప్రమాధం ఏమీ కలుగకపోయినా ప్రభుత్వం అందుకు పూనుకొని పెద్ద ఏర్పాట్లు చేసింది ఒక పెద్ద భారతీయ నాయకుడి హోదా అతడికి కల్పించి ప్రభుత్వం పెద్ద అట్టహాసం చేసింది. అతడికి గౌరవం కల్పించింది. విచారణ జరిగిన రోజున కోర్టు అంతా జనంతో క్రిక్కిరిసి పోయింది. అతడికి ఒక నెల రోజుల పాటు సాధారణఖైదు శిక్ష విధించారు. అతణ్ణి జోహన్స్ బర్గ్ జైల్లో వుంచారు. అక్కడ యూరోషియస్ వార్డులో అతడికి ప్రత్యేకించి ఒక గది కేటాయించారు. జనం ఏమి యిబ్బంది లేకుండా అతణ్ణి కలుసుకొనే ఏర్పాట్లు చేయబడ్డాయి బయటి నుంచి భోజనం తెప్పించుకొనే ఏర్పాటు కూడా చేశారు. దానితో భారతీయులు రోజూ రుచికరమైన భోజనం అతడికి పంపిస్తూ వున్నారు అతడికి జైలు శిక్ష విధించబడిన రోజున పెద్ద జాతీయ ఉత్సవం జరిగింది అతణ్ణి జైల్లో పెట్టినందు వల్ల జాతికి బలం, ఉత్సాహం అధికంగా లభించాయి. వందలాది భారతీయులు జైలుకు వెళ్లుటకు సిద్ధపడ్డారు ఏషియాటిక్ శాఖ ఆశించిన ఆశ నెరవేరలేదు. జర్మిస్టస్ యందలి భారతీయులైనా అనుమతి పత్రాలు తీసుకొనుటకు ముందుకు రాలేదు. అధికారులు చేసిన యీ హడావుడి వల్ల జాతికే లాభం కలిగింది. ఒక నెల గడిచిపోయింది రామసుందరపండిత్ జైలునుంచి విడుదల అయ్యాడు. మేళాతాళాలతో ఆయనను సభాస్థలి వరకు ఉరేగింపుగా తీసుకువెళ్లారు. కొందరు ఆ సభలో ఆవేశంతో ఉపన్యాసాలు యిచ్చారు. రామసుందర్ పండిత్‌ను దండలతో ముంచెత్తి వేశారు. ఆయన గౌరవార్థం కొందరు జనానికి పెద్ద విందు ఏర్పాటు చేశారు. అతడికి దక్కిన గౌరవాన్ని చూచి కొందరికి తీయని అసూయ కూడా కలిగింది. మనం కూడా జైలుకు వెళ్లి వుంటే మనకు కూడా యిట్టి గౌరవం దక్కి వుండేది కదా అని కొందరు తహతహలాడిపోయారు

కాని రామ సుందరపండిత్ నిజానికి సత్తురూపాయి రకం అతడిదంతా కృత్రిమ వ్యవహారం అతణ్ణి హరాత్తుగా అరెస్టు చేశారు కనుక ఒకనెల మాసం పాటు జైలు తప్పదని భావించారు. జైల్లో అతడికి లభించి యుందలేదు స్వేచ్ఛగా తిరిగే మనిషి అందులోనూ వ్యసనాలకు అలవాటుపడ్డ వాడు ఎంత మంచి భోజనం లభించినా, జైల్లో గల ఏకాంతవాసాన్ని, సంయమనాన్ని సహించలేకపోయాడు రాజభోగాలు అనుభవించినా అతడికి కారాగారవాసం రుచించలేదు. ట్రాన్స్‌వాల్‌ను, సత్యాగ్రహపోరాటాన్ని వదిలి రాత్రికి రాత్రే ఎక్కడికో పారిపోయాడు. ప్రతి సమాజంలోను గడుసురకం జనం వుంటారు అదే విధంగా ప్రతి ఉద్యమంలోను గడుసురకం చేరతారు. అతని వల్ల భారతీయులకు ఏమో ఒరుగుతుందని భావించి అతడికధ నాకు తెలియనీయకుండా గోప్యంగా వుంచారు. తరువాత అసలు రామ సుందర్, గిర్‌మిటియాగా దక్షిణాఫ్రికా వచ్చి ఆ ఎగ్రిమెంటు పూర్తి కాకుండానే పారిపోయిన ఒక గిర్‌మిటియా కార్మికుడని నాకు చెప్పారు. అతడు గిర్‌మిటియాకు చెందినవాడని నేను ఏహ్యభావంతో వ్రాయడం లేదు. అతడు గిర్‌మిటియా అవడంలో దోషం ఏమీ లేదు. నిజానికి భారతజాతీయ సత్యాగ్రహ పోరాటంలో పాల్గొని విజయపధాన నడిపించిన వారిలో గిర్‌మిటియా కార్మికులే ఎక్కువ అన్న విషయం పాఠకులు గ్రహింతురుగాక అయితే గిర్‌మిటియా కార్మికుడుగా వచ్చి, ఆ ఎగ్రిమెంటు పూర్తి కాకుండానే పారిపోవడం రామసుందర్ చేసిన అపరాధమే ఇక్కడ రామసుందర్ పండిత్ కధ. అతనికి సంబంధించిన వివరం ఆతణ్ణి తప్పు పట్టాలనే ఉద్దేశ్యంతో నేను పేర్కొనలేదు. ఇందు దాగియున్న గూఢరహస్యాన్ని తెలుపుటకే పేర్కొన్నాను పరిశుద్ధహృదయంతో ఆరంభించిన ఏ ఉద్యమంలోనైనా సరే పరిశుద్ధమైన ఆచరణ కలవారినే చేర్చుకోవాలి. అయితే ఎంత జాగ్రత్తపడ్డా పరిశుద్ధంగా జరిగే ఉద్యమంలో ఆపరిశుద్ధ మనష్యులు కూడా చేరుతూ వుంటారు. అయితే నాయకులు సదా జాగరూకులై వుండాలి సంచాలకుడు పరిశుద్ధుడై యుంటే యిలాంటి వాళ్ల వల్ల ఉద్యమం దెబ్బతినదని మనవి చేస్తున్నాను రామసుందర్‌పండిత్ నిజస్వరూపం బైటపడే సరికి జాతికి అతిని యెడ గలగౌరవం పూర్తిగా తగ్గిపోయింది. పండిత్‌రూపం పోయి అతడు కేవలం రామసుందర్‌గా మిగిలిపోయాడు జాతి అతణ్ణి మరిచి పోయింది కాని దీనివల్ల పోరాటానికి బలం పెరిగింది సత్యాగ్రహిగా అతడు అనుభవించిన జైలు శిక్ష వృధాకాలేదు. అతడు జైలుకు వెళ్లి నందున పెరిగిన జాతి బలం తరగలేదు అతడి బలహీనత వల్ల కలిగిన ఫలితాన్ని చూచి అటువంటి బలహీనులంతా పోరాటాన్ని వదిలి పారిపోయారు. ఇటువంటి యింకా కొంతమంది బలహీసుల బలహీసతలు జూతికంటబడ్డాయి. కాని నేను వారిని గురించి పేర్లు అడ్రసులతో సహా యిక్కడ వివరించదలచలేదు. అందువల్ల కలిగే లాభమూ ఏమీ లేదు. జాతి యొక్కశక్తిని మరియు జాతి యొక్క బలహీనతను పాఠకులు గ్రహించాలి రామసుందర్ వంటివాళ్లు ఎంతో మంది వస్తారు. వెళ్తారు. అయినా జాతి బలం చెక్కు చెదరదు అటువంటి వాళ్లవల్ల కూడా జాతికి బలమే చేకూరుతుందని నా అభిప్రాయం పాఠకులు రామసుందర్‌ను దోషిగా భావించకూడదు. ఈ జగత్తు నందలి మనుష్యులంతా అపూర్ణులే ఒక వ్యక్తి యొక్క అపూర్ణత్వం స్పష్టంగా కనబడినప్పుడు మిగతా వారంతా అతడిని వ్రేలెత్తి చూపిస్తూవుంటారు. కాని నిజానికి అది మన పొరపాటే అవుతుంది. వాస్తవానికి రామసుందర్ తెలిసియుండి బలహీనుడు కాలేదు. మనిషి తన స్వభావాన్ని మార్చుకోగలడు దాన్ని అధీనంలో వుంచుకోగలడు. కాని దాన్ని సమూలంగా పెకిలించి పారవేయలేడు. సృష్టికర్త మనిసికి అంతశక్తి ప్రసాదించలేదు. పెద్దపులి తన చర్మం చారలను మార్చుకోగలిగితే మనిషి తన విచిత్ర స్వభావాన్ని మార్చుకోగలుగుతాడు పారిపోయినప్పటికీ రామ్‌సుందర్ తన బలహీనతలకు ఎంత పశ్చాత్తాప పడివుంటాడో మనకు ఎలా తెలుస్తుంది? అతడు పారిపోవడాన్ని అతడి పశ్చాత్తాపానికి తార్కాణంగా భావించ వచ్చుకదా? అతడు సిగ్గులేనివాడైతే పారిపోవలసిన అవసరం వుండేది కాదు అనుమతి పత్రం తీసుకొని, రక్తపు చట్టాన్ని అంగీకరించి జైలుకు పోకుండా ముక్తి పొందియుండేవాడు ప్రభుత్వం చేరువకు చేరి యుండే వాడుకూడా ఏషియాటిక్ ఆఫీసుకు దళారిగా మారి యితర భారతీయుల్ని సైతం మార్చివేసేవాడు. ఇదంతా ఏమీ చేయకుండా జాతికి తన దౌర్బల్యాన్ని చూపించుటకు సంకోచించి, సిగ్గుపడి, తన ముఖం దాచుకున్నాడు. ఇలా చేసి భారతజాతికి అతడు మేలే చేశాడు అతడు పారిపోవడాన్ని యీ విధంగా అర్థం చేసుకుంటే మంచిది



19

ఇండియన్ ఒపీనియన్

నేను పాఠకులకు సత్యాగ్రహానికి సంబంధించిన లోపలి మరియు బయటి సాధనాలన్నింటిని గురించి తెలియజేయాలని, భావిస్తున్నాను అందువల్ల ఇండియన్ ఒపీనియన్ అను వార పత్రికను గురించి వివరిస్తాను అది యిప్పటికీ దక్షిణాఫ్రికానుంచి వెలువడుతున్నది. దక్షిణాఫ్రికాలో ప్రప్రధమంగా హిందుస్తానీ ప్రెస్ ప్రారంభించిన ఘనత శ్రీ మదనజీత్ వ్యావహారిక్ అను గుజరాతీ సజ్జనుడికి దక్కింది. అనేక యిబ్బందులు పడి ప్రెస్ నడుపుతూ ఒక వారపత్రిక ప్రచురించాలనే నిర్ణయానికి అతడు వచ్చాడు. ఈ విషయంలో అతడు కీ. శే. మనసుఖలాల్ నాజర్ మరియు నా సలహా కోరాడు. దర్బన్ నుంచి పత్రిక ప్రారంభమైంది. శ్రీ మనసుఖలాల్