దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/ఇండియన్ ఒపీనియన్

వికీసోర్స్ నుండి

వుంచుకోగలడు. కాని దాన్ని సమూలంగా పెకిలించి పారవేయలేడు. సృష్టికర్త మనిసికి అంతశక్తి ప్రసాదించలేదు. పెద్దపులి తన చర్మం చారలను మార్చుకోగలిగితే మనిషి తన విచిత్ర స్వభావాన్ని మార్చుకోగలుగుతాడు పారిపోయినప్పటికీ రామ్‌సుందర్ తన బలహీనతలకు ఎంత పశ్చాత్తాప పడివుంటాడో మనకు ఎలా తెలుస్తుంది? అతడు పారిపోవడాన్ని అతడి పశ్చాత్తాపానికి తార్కాణంగా భావించ వచ్చుకదా? అతడు సిగ్గులేనివాడైతే పారిపోవలసిన అవసరం వుండేది కాదు అనుమతి పత్రం తీసుకొని, రక్తపు చట్టాన్ని అంగీకరించి జైలుకు పోకుండా ముక్తి పొందియుండేవాడు ప్రభుత్వం చేరువకు చేరి యుండే వాడుకూడా ఏషియాటిక్ ఆఫీసుకు దళారిగా మారి యితర భారతీయుల్ని సైతం మార్చివేసేవాడు. ఇదంతా ఏమీ చేయకుండా జాతికి తన దౌర్బల్యాన్ని చూపించుటకు సంకోచించి, సిగ్గుపడి, తన ముఖం దాచుకున్నాడు. ఇలా చేసి భారతజాతికి అతడు మేలే చేశాడు అతడు పారిపోవడాన్ని యీ విధంగా అర్థం చేసుకుంటే మంచిది



19

ఇండియన్ ఒపీనియన్

నేను పాఠకులకు సత్యాగ్రహానికి సంబంధించిన లోపలి మరియు బయటి సాధనాలన్నింటిని గురించి తెలియజేయాలని, భావిస్తున్నాను అందువల్ల ఇండియన్ ఒపీనియన్ అను వార పత్రికను గురించి వివరిస్తాను అది యిప్పటికీ దక్షిణాఫ్రికానుంచి వెలువడుతున్నది. దక్షిణాఫ్రికాలో ప్రప్రధమంగా హిందుస్తానీ ప్రెస్ ప్రారంభించిన ఘనత శ్రీ మదనజీత్ వ్యావహారిక్ అను గుజరాతీ సజ్జనుడికి దక్కింది. అనేక యిబ్బందులు పడి ప్రెస్ నడుపుతూ ఒక వారపత్రిక ప్రచురించాలనే నిర్ణయానికి అతడు వచ్చాడు. ఈ విషయంలో అతడు కీ. శే. మనసుఖలాల్ నాజర్ మరియు నా సలహా కోరాడు. దర్బన్ నుంచి పత్రిక ప్రారంభమైంది. శ్రీ మనసుఖలాల్ నాజర్ ఆ పత్రికకు గౌరవ సంపాదకుడుగా వున్నారు. పత్రిక ప్రచురణు వల్ల నష్టం రాసాగింది. అప్పుడు ప్రెస్సులో పనిచేసే వారందరినీ అందు భాగస్వాములుగా చేసి, ఒక పొలం తీసుకొని అక్కడ వారందరికీ నివాసం ఏర్పాటు చేసి పత్రిక నడపించాలని నిర్ణయానికి వచ్చారు. ఆ పొలం డర్బనుకు 13 మైళ్ల దూరాన ఒక అందమైన పర్వతం మీద వున్నది. దానికి అతి దగ్గరలో 3 మైళ్ల దూరాన రైలు స్టేషను వున్నది. దాని పేరు ఫినిక్స్ పత్రిక పేరు మొదటి నుంచి ఇండియన్ ఒఫీనియస్ అని పెట్టారు ఒకప్పుడు యిది ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, తమిళభాషల్లో వెలువడింది తమిళం, హిందీ పత్రికల ప్రచురణ భారం బాగాపెరిగిపోయింది. పొలానికి వచ్చి వుండే పని వాళ్లు దొరకలేదు. తమిళ హిందీ భాషల్లో వ్రాసేవారు. వ్రాసిన వ్యాసాల్ని సరిదిద్దువారు లేకపోయినందున ఆ రెండు శాఖల్ని ఆపివేశారు. ఇంగ్లీషు, గుజరాతీ భాషల్లో మాత్రం పత్రిక వెలువడసాగింది సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభమైనప్పుడు యీ రెండు భాషల్లోనే పత్రిక తెలువడుతూ వున్నది. పొలంలో వుంటూ సంస్థలో పనిచేసే వారిలో హిందీ (ఉత్తరప్రదేశ్). తమిళ్ (మద్రాసు), గుజరాతీ, ఇంగ్లీషు వాళ్లంతా వున్నారు శ్రీ మనసుఖలాల్ నాజర్ హరాత్తుగా మృతి చెందారు. అప్పుడు ఒక ఆంగ్ల మిత్రుడు హర్బర్ట్‌కిచన్ ఇండియన్ ఒపీనియస్ పత్రికకు సంపాదకులైనారు తరువాత శ్రీ హెనరీపోలక్ చాలా కాలం వరకు సంపాదకులుగా పున్నారు నేను, పోలక్ యిద్దరం జైల్లో వున్నప్పుడు ఫాదరీ కీ. శే. జోసఫ్ డోక్ పత్రికకు సంపాదకులుగా వున్నారు. ఈ పత్రిక ద్వారా భారతీయులందరికీ, జరుగుతున్న సమాచారం పూర్తిగా అందజేయుటకు అవకాశం లభించింది. ఇంగ్లీషు విభాగం ద్వారా గుజరాతీ రానివారికి కూడా సత్యాగ్రహ విశేషాలు తెలిపి శిక్షణ యివ్వడం ప్రారంభమైంది. ఇండియా, ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా యందలి తెల్ల జాతీయులకు ఇండియన్ ఒపీనియన్ సాప్తాహిక పత్రికగా రూపొంది వారి అవసరాలు తీర్చసాగింది. పత్రిక లేకుండా కూడా సత్యాగ్రహం వంటి సమరం సాగించవచ్చు కాని ఇండియన్ ఒపీనియన్ పత్రికవల్ల మాకు ఎన్నో సౌకర్యాలు కలిగాయి జాతికి తేలికగా సత్యాగ్రహ సమరాన్ని గురించిన శిక్షణ యివ్వగలిగాము, ప్రపంచంలో వున్న భారతీయులందరికీ సత్యాగ్రహ సంగ్రామ ఘట్టాల్ని గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందించగలిగాము మరో సాధనం వల్ల యింత సౌకర్యం కలిగి యుండేది కాదు. సత్యాగ్రహ సంగ్రామం సాగించుటకు ఎన్నో సాధనాలు ఉపయోగపడ్డాయి. కామి వాటన్నింటిలోను ఇండియన్ ఒపీనియన్ గొప్ప సాధనంగా ఉపయోగపడిందని చెప్పకతప్పదు

సంగ్రామం జరిగిన రోజుల్లోను, సంగ్రామం జరిగిన తరువాత జాతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అదే విధంగా ఇండియన్ ఒపీనియన్ పత్రికలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట, పత్రికకు విజ్ఞాపనలు తీసుకొనేవారు ప్రెస్సులో బయటివారి అచ్చు పనులు కూడా చేసేవారు. ఈ రెండు పనులకు మంచిపని వాళ్లను వినియోగించవలసి వచ్చింది. ఏరకమైన విజ్ఞాపనలు తీసుకోవాలి ఏ రకం విజ్ఞాపనలు తీసుకోకూడదు అను విషయంలో ధర్మసంకటం ఏర్పడింది. అంతేగాక ప్రకటించకూడని విజ్ఞాపనలు అందినప్పుడు, ఆ విజ్ఞాపనలు యిచ్చిన వాడు అగ్రగణ్యుడగు భారతీయుడైనప్పుడు, అతణ్ణి సంతోషపెట్టుటకు పనికిమాలిన విజ్ఞాపనలు తేవడానికి, ప్రచురించిన విజ్ఞాపనల డబ్బు వసూలు చేసి తెచ్చుకోడానికి వ్యక్తిత్వం కలిగిన మాపనివాళ్లు చాలా సమయం వెచ్చించవలసిన అవసరం ఏర్పడింది. విజ్ఞాపనలకోసం దాతల భజన చేయవలసి వచ్చేది అసలు పత్రికను ఎందుకు నడుపుతున్నాం? డబ్బు సంపాదించడానికా లేక జాతికి సేవచేయుటకా? సేవచేయడానికే అయితే ఎవ్వరినీ వత్తిడిచేయకూడదుకదా! జాతి కోరితేనే సేవ చేయాలి అయితే జాతి ఎలా కోరుతుంది? స్వయంగా చందా చెల్లించి చందాదారులుగా చేరడమే జాతికోరికకు తర్కాణం అవుతుంది. విజ్ఞాపనలకోసం దాతల చుట్టూ తిరగడంమాని పత్రికా ప్రచురణకు అయ్యే ఖర్చు చందాదారులను చేర్చి తద్వారాభరించడం మంచిది. దీనివల్ల ఆకర్షించేవారికి, ఆకర్షింపబడేవారికి యిరువురికీ పాఠం నేర్పినట్లవుతుంది ఈ విషయాలన్నింటినీ యోచించి వెంటనే నిర్ణయాన్ని అమలు పరిచాము విజ్ఞాపనలకోసం తెగతిరిగేవారంతా శ్వాసపీల్చుకొని, పత్రికను ఉపయోగకరంగాను. అందంగాను తీర్చిదిద్దుటకు కృషి ప్రారంభించారు. జాతి ప్రజలకు ఇండియన్ ఒపీనియన్ పత్రిక తమదేనని, దానిని నడపడం తమ బాధ్యతయేనని బోధపడింది. కార్యకర్తలమంతా ఆనందించాము జాతిప్రయోజనాన్ని దృష్టియందుంచుకొని జనం పత్రికకోసం ఎదురుచూచే విధంగా పత్రికను రూపొందించే కృషికి ఆంతా పూనుకున్నాము ప్రతి భారతీయుణ్ణి నిలబెట్టి యీ పత్రికను కొనమని చెప్పడం కార్యకర్తలంతా తమ కర్తవ్యంగా భావించాము అచిరకాలంలోనే ఇండియన్ ఒపీనియన్‌పత్రిక అంతరిక శక్తి బాగా పెరిగింది. పత్రికా స్వరూపంలో కూడా మంచి మార్పు వచ్చింది. అది ఒక శక్తి అయిపోయింది. ఆ పత్రిక చందాదారుల సంఖ్య సామాన్యంగా 1200 నుంచి 1500 వరకు వుండేది పత్రిక వార్షిక చందా పెంచవలసి వచ్చింది. సత్యాగ్రహసంగ్రామం ఉగ్రరూపం దాల్చినప్పుడు వార్షికచందాదారుల సంఖ్య 3500 దాకా పెరిగింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికా పాఠకుల సంఖ్య 20,000వరకు వుండేది. ఇంతమంది పారకుల కోసం 3000 కంటే మించి విడి ప్రతులు అమ్మకం కావడం విశేషమే

ఇండియన్ ఒపీనియన్ పత్రికను భారతజాతి తమదిగా భావించింది పత్రికాప్రతులు జోహాన్స్‌బర్గుకు కొంచెం ఆలస్యంగా చేరితే జనం ఊరుకునేవారుకాదు. ఆదివారం ఉదయం పత్రికాప్రతులు జోహాన్స్‌బర్గుకు చేరుతూవుండేవి. పత్రికలు చేరగానే జనం ముందుగా గుజరాతీ పత్రిక తీసుకొని గబగబా పత్రికనంతటనీ చదివేస్తూ వుండేవారు. ఒకడు చదువుతూవుంటే, పది పదిహేనుమంది చుట్టూ నిలబడివింటూ వుండేవారు బీదవాళ్లు ముగ్గురు నలుగురు కలిసి పత్రిక కొని చదివేవారు

విజ్ఞాపనల్ని ఆపివేసినట్లే, ప్రెస్సులో బయటి అచ్చుపనులు తీసుకోవడం కూడా ఆపివేశాము విజ్ఞాపనలు తీసుకోకపోవడానికి ఏ కారణాలు పనిచేశాయో, అచ్చుపనులు తీసుకోకపోవడానికి కూడా అవే కారణాలు పనిచేశాయి. అందువల్ల కంపోజిటర్లకు సమయం చిక్కినందున పుస్తక ప్రచురణ ప్రారంభించాము పుస్తక ప్రచురణకు లక్ష్యం డబ్బు సంపాదనకాదు సత్యాగ్రహ సంగ్రామానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలు ప్రచురించినందున వాటి అమ్మకంకూడా పెరిగింది. ఈ విధంగా ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సు రెండూ దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ పోరాటానికి ఎంతో సహకరించాయి. సత్యాగ్రహం భారతీయుల హృదయాలలో వ్రేళ్లు పాతుకున్న కొద్దీ ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సులు రెండూ ఎంతో ప్రగతిని సాధించాయి



20

నిర్భంధాల వెల్లువ

రామసుందర్ పండిత్‌ను నిర్బంధించడంవల్ల ప్రభుత్వానికి ప్రయోజనం కలుగలేదని మనం చూచాం రెండో వైపున ప్రజల్లో ఉత్సాహం పెరిగిపోతున్న విషయం ప్రభుత్వం గ్రహించింది. ఇండియన్ ఓపీనియన్‌లో ప్రచురించబడే వ్యాసాల్ని, ఇండియన్ ఏసియాటిక్ శాఖ వాళ్లు కూడా శ్రద్ధగా చదువుతున్నారు జాతీయ పోరాటమేదీ రహస్యంగా జరగలేదు జాతిబలాన్ని జాతిబలహీనతల్ని రెండిటినీ జనం ఇండియన్ ఓపీనియన్ ద్వారా మిత్రులైనా, శతృవులైనా, తటస్థంగా వుండేవారైనా తెలుసుకుంటున్నారు తప్పుడుపని చేయనవసరంలేదు మోసానికి అతి తెలివికి చోటులేదు. తమ ఆత్మబలంతోనే విజయం సాధించుటకు అవకాశం వున్నా సత్యాగ్రహ సంగ్రామంలో రహస్యానికి తావులేదని కార్యకర్తలంతా తెలుసుకున్నారు. జాతి బలహీనతలనే రోగాల్ని తొలగించుకోవాలంటే వాటిని బయటపెట్టి, వాటిని బాగా అందరూ తెలుసుకో గలగాలని కార్యకర్తలు గ్రహించారు. ఏషియాటిక్ శాఖవారు. ఇండియన్ ఒపీనియన్ విధానం యిదేనని తెలుసుకున్నారు. భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామ చరిత్రగా ఇండియన్ ఒపీనియన్ పత్రిక రూపొందడం గమనించిన ఏషియాటిక్ శాఖాధికారులు యీ సంగ్రామానికి సంబంధించిన నాయకుల్ని