అపరాధముల నోర్వ సమయము
Wikisource నుండి
| త్యాగరాజు కృతులు |
అపరాధముల నోర్వ సమయము రాగం: వనాళి తాళం: ఆది పల్లవి: అపరాధముల నోర్వ సమయము కృప జూడు ఘనమైన నా ॥అ॥ అనుపల్లవి: చపలచిత్తుఁడై మనసెఱుఁగకనే జాలికలుగజేసుకొని మొరలనిడే ॥అ॥ చరణము(లు) సకలలోకుల ఫలాఫలము లెఱిఁగి సంరక్షించుచునుండఁగ న న్నొకని బ్రోవ తెలియును కీర్తన సుశతక మొనర్చుకొన్న త్యాగరాజుని ॥అ॥