Jump to content

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/గ్రంథాలయ సర్వస్వము

వికీసోర్స్ నుండి

గ్రంథాలయ సర్వస్వం (Wikidata item: Q15699685), ఒక తెలుగు పత్రిక. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం గ్రంధాలయోద్యమాభివృద్ధి కోసం ఈ గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1916 సంవత్సరం నుంచి ప్రచురణ నిర్వహిస్తొంది. ఇది మూడు నెలలకు ఒకసారి వెలువడే త్రైమాసిక పత్రిక. ప్రధమ సంపుటం 1916 లో మొదలయి ఈనాటికి (2024) ఏప్రిల్ లో ఈ మాస పత్రిక 85వ సంపుటంగా నిరాఘాటంగా కొనసాగుతోంది.

ప్రాజెక్ట్:గ్రంథాలయ సర్వస్వము

[మార్చు]

(తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్)

లక్ష్యం

[మార్చు]

గ్రంథాలయ సర్వస్వం సంచికల కంటెంట్ అంటే -వాటి విశేష వ్యాసాలు, బొమ్మలు, వ్యాఖ్యలు వికీ కామన్స్, వికీసోర్స్ నుంచి ఇతర ప్రాజెక్ట్ లకు విస్తరించడం ఈ మొత్తం సమాచారం వికీడేటా లో పొందుపరచడం.

ప్రారంభం

[మార్చు]

ఈ పత్రిక నేపథ్యం గమనించిన నిర్వాహకులు ఏ.రాజశేఖర్ గారి ప్రతిపాదనతో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపునుండి ఆ సంస్థ అధికారులను (మౌఖికంగానే) సంప్రదించి గూగులు మీట్ లో 30 ఏప్రిల్ 2024న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం తరపున ఆ సంస్థ కార్యదర్శి డా.రావి శారద గారు, వికీ సోర్స్ నుండి డా. రాజశేఖర్ గారు, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నుంచి పవన్ సంతోష్ గారు, వి.జె.సుశీల పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో మన వికీ సోర్స్ విధానాన్ని వివరించి ఆ పత్రికలను వికీసోర్స్ కు అందచేయమని అభ్యర్ధించడమైనది. ఆ ప్రతిపాదనకు శారదగారు అంగీకరించి, ఆ పత్రికలను మొదట విడతగా 11 సంపుటాలను 'మనసు ఫౌండేషన్' వారి సహకారంతో స్కాన్ చేయించారు.
అయితే సముదాయం ఆమోదంతో మన తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్, వికిసోర్స్ తరపునుంచి సంయుక్తంగా APLA సంస్థకు ముందుగా ఒక అభ్యర్ధనపత్రంను అధికారికంగా (లెటర్ హెడ్) సమర్పించడం జరిగింది.

అభ్యర్ధనపత్రం

ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఈ పత్రిక ప్రతులను వికీసోర్స్ లో పొందుపరచడానికి మొదటి విడతలో 11 సంపుటాలకు (1916 నుంచి 1937) సంబంధించి 71 సంచికలు (మాన్యుస్చ్రిప్త్) అందచేశారు.

సహకార సంస్థలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ
  2. మనసు ఫౌండేషన్, బెంగళూరు

ప్రాజెక్టు రూపకల్పన

[మార్చు]

వీటిలో ఆనాటి రచయతలు రచించిన వ్యాసాలు, పద్యాలు, అనువాద రచనలు, ఛాయాచిత్రాలు, రంగు చిత్రాలు ఉన్నాయి. కొన్ని ప్రకటనలలో రచయితల పుస్తకాల జాబితాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పనులు ఈ క్రింది ఈయబడిన విధముగా రూపకల్పన చేయబడ్డాయి.
ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ పనికి ప్రకటనలు వదలివేసి పత్రికలో సంపాదకీయం, పరిచయం, ముందుమాట, వ్యాసాలు, పద్యాలు, పాటలు, బొమ్మలు మాత్రము తీసుకొవాలి.

కామన్స్

[మార్చు]

ఈ 71 మానుస్క్రిప్ట్ లు వికీమీడియా కామన్స్ లోకి అప్లోడ్ చేయడం వర్గాలు:

  • ప్రధాన వర్గము “గ్రంథాలయ సర్వస్వము” Category:Granthalaya Sarvasvamu
  • ప్రతి సంపుటమునకు ఒక వర్గము సృష్టించాలి. ఆవిధంగా ప్రధాన వర్గములో సంపుటిల ఉపవర్గాలు ఉంటాయి
ఉదాహరణకి ఇలా: Category:Granthalaya Sarvasvamu, Vol. 1
  • ప్రతి సంచికకి ఆ సంపుటి వర్గము చేర్చాలి ఆవిధంగా దీంట్లో సంచికల దస్తాలు (ఫైళ్లు), సంచికల నుండి క్రాప్ టూల్ ద్వారా వెలికి తీసిన బొమ్మలు ఉంటాయి (క్రింద యీయబడిన విధంగా)
  • స్కాన్ చేసిన మనసు ఫౌండేషన్ సంస్థకు ఒక ప్రత్యేక వర్గం ఇలా: Category:Scans from Manasu Foundation

బొమ్మలు

  • ప్రతి మానుస్చ్రిప్త్ లో ఉన్నపేజీల లోని బొమ్మలను గుర్తించి, క్రాప్ టూల్ ఉపయోగించి బొమ్మలను కామన్స్ లో అప్లోడ్ చేయాలి. ఉదా: కందుకూరి వీరేశలింగం బొమ్మ
  • ఒకటి కంటే ఎక్కువ బొమ్మలున్నప్పుడు వాటిని విడిగా కత్తిరించి అప్లోడ్ చేయాలి.
  • ఈ బొమ్మలను గ్రంథాలయ సర్వస్వము సంపుటి సంఖ్య/సంచిక సంఖ్య వర్గం లో చేర్చాలి .

వికీసోర్స్

[మార్చు]

సూచికలు

[మార్చు]
  • ప్రతి సంచిక (సంపుటం/సంచిక)కు సూచిక తయారు చేయడము. ఈ విధంగా 71 సూచికలు చేయాలి.
ఉదా:గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1
సహాయం
  • సూచికలో ప్రతి సంపుటికి చెందిన సంచికల సంఖ్యలకు లింకులు (1.1,1.2, 1.3,1.4).
ఉదా: గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1
  • ప్రతి సూచికలో పేజీలు సరిచూడడము; ముఖచిత్రం, ఖాళీ పేజీలు, చిత్రాలు, ప్రకటనలు గుర్తించడం కోసం పేజీ లిస్టింగ్ విడ్జెట్ (Pagelisting Widget) ఉపయోగించాలి.
  • విషయసూచిక రూపొందించడంలో పేజీలు సరిచూడడము
ఉదా:
  • విషయసూచిక లో వ్యాసాలకు క్ర.సంఖ్య, శీర్షిక, రచయత పేరు, పేజీ. సంఖ్య ఉండాలి
ఉదా: పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/11
  • విషయసూచికలో పటాలకు క్ర.సంఖ్య, శీర్షిక, పేజీ.సంఖ్య ఉండాలి
ఉదా: పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/12
  • కొన్ని సంచికలలో విషయసూచిక లేదు. అప్పుడు సంచిక చూసి విషయసూచిక తయారు చేయాలి
ఉదా: సంపుటము 4, సంచిక 1
  • పేజీలు ప్రూఫ్ రీడింగ్ కు ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉపయోగించాలి. OCR ఉపకరణము వాడి (ఉదా:గూగుల్) అచ్చు దిద్దాలి.
  • ప్రూఫ్ రీడింగ్ లో సరిగ్గా రాని బొమ్మలు కామన్స్ లోంచి తీసి చేర్చాలి
  • సూచిక ప్రచురించడం

వర్గాలు

[మార్చు]

రచనలు-రచయతలు

[మార్చు]
  • విషయసూచిక నుంచి రచయితలకు వ్యాస రచయితలకు (లేని వారికీ మాత్రమే) పేజీలు సృష్టించాలి. రచయిత:అయ్యంకి వేంకటరమణయ్య
  • అక్కడ రచయితలకు వారి పేజీలకు లింకులుండాలి.
  • ఈ రచయితల వ్యాసాలు శీర్షిక లంకెతో సహా అక్కడ రాయాలి. ఆయా రచయితల ఇతర రచనలు కూడా చేర్చవచ్చు.
  • రచయితల గురించిన సమావేశం సేకరించాలి

వికీపీడియా

[మార్చు]

వికీపీడియాలో చేర్చిన వ్యాసాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సమావేశాలు, సదస్సులు
  2. ఎ.పి.పాత్రో
  3. గ్రంథాలయ సంఘాలు

వికీ వ్యాఖ్య

[మార్చు]
పుస్తకం[1]
గ్రంథాలయము[2]
  • పద్యాలు, పాటలు

వికీడేటా

[మార్చు]

ఈ క్రింది ఈయబడిన విధంగా ఐటెంలు చేర్చాలి

  • గ్రంథాలయ సర్వస్వము విషయం అనుసరించి వికీపీడియాలో రాసిన వ్యాసము లేదా వ్యాసములు,
  • వికీసోర్సులో ప్రచురణలు,
  • వికీసోర్సులో జాబితా అయిన ముఖ్యమైన వ్యాసాలు,
  • వికీసోర్సులో రచయతలు ఉదా: బసవరాజు అప్పారావు[[3]]

సమయం ప్రతిపాదన

[మార్చు]

30.12.2024

కామన్స్ నుంచి సహాయక వనరులు

[మార్చు]

కొనసాగింపు

[మార్చు]

12వ సంపుటి నుండి ఇదే విధానంలో చేయాలి