ర - అయిదు రూపాయలు.
సు - ఎన్నిమాట్లు వచ్చాడు ఇప్పటికి?
ర - ఇరవైసార్లు.
సు - అల్లాయితే నూరూ అక్కడ కక్కవలసిందే.
ర - నూరేమిటి నీ బుర్రా, అయిదే! వాడు ఒకసారి వచ్చాడూ!ఆకడం పందొమ్మిదిసార్లూ ఆ అయిదూ వసూలు చేసుగోడానికి అహోరించాడు.
68
మాణిక్యాలు - అవ్వా! ఏమన్నా పెట్టవ్.
అ - కోడిగుడ్డు ఓటుంది ఇస్తానుండు, పీల్చుదుగాని,
మా - ఈ పీల్చడంలో కొత్త పద్ధతి విన్నావా?
ఆ - ఏమిటి?
మా - అండజంబునకు నిరుపార్శ్వంబుల సూక్ష్మబిలంబుల నిర్మించి, దానినోష్ఠములతో గబాళించి, గంభీర నిశ్వాసంబు గావించినచో తదంతర పదార్థంబు గొంతు ప్రవేశించును. ఇది నూతన ఫక్కి.
అ - వెనకట్లో గుడ్డుకి చెరోపెడా బొక్కపెట్టి పీల్చేవారు! అంతా కొత్తే.
69
క్షీరపురంలో “రసపుత్రవిజయం” ఆడుతూ, రాజసింహుడు తనచేత్తో పట్టుగొచ్చిన హాండ్‌స్టిక్కు ముట్టుగుని,
రా - "పూనితి నిదె ప్రతిన కత్తి ముట్టి”
అని పాడేటప్పటికి అంతా నవ్వగా,
ఒకడు - అదేం కత్తిరోయ్?
అనగా రాజసింహుడు - “మహాత్మా”
అని పద్యం పూర్తిచేసి సిక్కులో ఉన్న కత్తిపైకి లాగగా,
మరిఒకడు - కర్రకత్తిరోయ్
70
బృందావనం - వందనం! ఈకాలంలో గురుభక్తిలేదు.
వం - ఏం జరిగిందేమిటి!
బృం - ఓ కుర్రాడు నాదగ్గిర రెండేళ్ళు ప్రైవేటుగా చెప్పించుగుని నాకు ఇవ్వడంమాట మరిచి చక్కా పోయాడు.
వం - ఏమిటి చెప్పుగుంటా
బృం - జ్ఞాపక శాస్త్రం
వం - అతని పేరు!
బృం - ఏదో ఉందయ్యా, నోట్లో ఆడుతోంది, ఇట్టీ మరిచిపోయానూ.
71
ఒకచోట ఉపన్యాసం పెట్టించినవాడూ, ఇచ్చేవాడూ, రాసేవాడూ మాత్రం హాజరుకాగా, ఇచ్చేవాడు లేచి ప్రారంభిస్తూ,
ఇ - ఆర్య మహాజనులారా!
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
16
హాస్యవల్లరి