42
అయ్యవార్లు - చిట్టిగా, ఇప్పుడు దేనిమీద పాఠం?
చి - చర్మం గురించండి.
అ - చర్మం అంటే ఏమిటి!
చి - గేదెలూ అవీ తొడుక్కునే కోటండి.
అ - ఓరి పశువా “కోటు” అయితే గుండీలేవిరా?
చి - లోపల వేపు నుంటాయండి. కనిపించవు.
43
హనుమానులు - ఏమండోయి! కుంభరాడ్కవిగారు ఈ మధ్య తమరుగారు ఇంకో పుస్తకం రచించారటగా.
కుం - ఏదోనండి రాశాను, కాని నేను అంత చవటపుస్తకం ఎన్నడూ రాయలేదు.
హ - మీరేకాదు. ఎవ్వడూకూడా రాయలేరనుకుంటాను.
కుం - రాయకేం!
హ - అదైనా మీ రనకూడదు ఊరుకోండి.
44
శేషం - చూశారూ, శాస్త్రిణః! మా నాన్నగారు కూడా నున్నూ గొప్పపండితుల్లో జమస్మండి.
శా - నేనామాట నిన్ను చూడ్డంతోటే పోల్చుగున్నా.
45
పెళ్ళాన్ని వంట పూటింట్లో దిగవిడిచి ఎక్కడికో సర్కీటు కొట్టివచ్చిన ఒకదొర తిన్నగా ఆ వంటపూటి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి,
దొ - అవ్వా. వచ్చాను తీసి గెళ్ళడానికి. ఏదీ మా ఆవిడ?
అవ్వ - వచ్చినవాడవు రానేవచ్చావు, నాయన, మరికాస్త పెందరాళేవస్తే నువ్వే తీసుగెడుదువుగా.
46
అక్కన్న - ఏదో అన్నారు, వంట్లో ఎల్లాఉందోయ్, ఉమ్మన్నా?
ఉ - చాలా జబ్బుగా ఉందనీ, చాలా ఆరోగ్యంగా ఉందని కూడా అంటున్నాడు, డాక్టరు?
అ - డాక్టరా. అంటా డాక్టర్లా?
ఉ - డాక్టరే!
అ - అంత విరుద్ధంగా అన్నాడేం!
ఉ - కక్కూర్తి! అతను మాత్రం ఏంజేస్తాడూ ? నిన్న పొద్దున్న నేను సెలవు పుచ్చుగోవలిసొచ్చి అతడు నాకు జబ్బు సర్టిఫిక్కట్టు ఇచ్చాడు. నిన్న సాయంత్రం నేను రెండువేలకి, ఇన్సూరుచేశాను. అందుకని నాకే, అతడే, ఆరోగ్యం సర్టిఫికట్టు ఇచ్చాడు.
అ - “చావూ” “బతుకూ” అంటూ మాటలూ రొండు గాని భావం ఒకటే.
47
టెలిగ్రాం కొట్టడానికి పరదేశిగారు ఆఫీసుకువెళ్ళి, అక్కడి గుమాస్తాతో,
ప - బాబూ, ముందు మాటెలిగ్రాం పట్టండి.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
11
హాస్యవల్లరి