పుట:హాస్యవల్లరి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకోడు - ఇదింకా నయమేనోయ్, ఓపక్షానికీ, ఓడికి గుండుదెబ్బతగిలీ, తలా ... ఏది! తలా, బెసికిపోతే తరవాత ఓఝాముకి వాడు తల గోక్కోవలిసొచ్చి, మరోగంటకి తల ఊడిపోయిన సంగతి గ్రహించడం మొదలుపెడదాం అనుకున్నాట్ట.

26

ఎనభై మంది పిల్లలుగల ఒకానొక క్లాసులో నలుగురు ముగ్గురు తప్ప తక్కిన అంతా హాజరై ఉన్నట్టు తోచగ, ఆ సహస్ర నామాలు లాంటివి పిలుస్తూ కూచోడం కాలయాపనం అనుకుని,

మేష్టరు - ఆబ్సెంటు అయన నలుగురు ముగ్గురూ ఠంగున నుంచోండి. చట్టున రాసు గుంటానూ.

27

వైద్యుడు - ప్రొద్దున్న ఒక గంటా, సాయంత్రం ఒకగంటా తప్ప నేను వైద్యం చేయనేచేయను.

మిత్రుడు - మరేంజేస్తారు కడంటైమంతా?

వై - వైదిక గ్రంథాలు చూస్తూంటాను.

మి - అవును. మీ వైద్యానికి అపరం వాటి అవసరం ఉన్నట్టు వేటి అవసరమూ లేదు.

28

మార్తాండం - బట్టతలకి ఘట్టి మందంటూ ఇచ్చారు మీరు. అబ్బే, ఇదేం మందండీ! తలకాయ ఊరికే పారణం ముద్దల్లా అల్లానే ఉందిగాని ఎక్కడా గరగరేనా పుట్టిందే!

డాక్షరు - ఎందుచేతచెప్మా! ఈ పాటికి కొంత బరిహస్సు విజృంభించ వలసిందేనే మరీ.

మా - ఎమోనండీ! ఏమైనాసరే, ఇహను నేను ఆ మందు బుడ్లు మట్టుకు తాగను.

29

గడబిడ చేస్తూన్న పిల్లవాడితో ఒక పంతులుగారు కలగజేసుకుని.

పం - ఏమిటబ్బాయి, అది?

పి - అదాండీ సర్వనామం అండి.

పం - (పిల్లవాణ్ణి ఒక్కటికొట్టి) ఇది?

పి - (బిక్క మొహంతో) ఇదీ అంతేనండి. కాస్త పొగరుమోతు రకపుది.

30

సత్రం గుమాస్తా - రాసుగో వాలి, భోజనాని కొచ్చింది ఎవరెవరబ్బాయి, చెప్పూ.

అబ్బాయి - నేనొకణ్ణండి.

- నువ్వు నానదిక్కడ? నీ పేరు!

- రాచయ్యండి.

- సరే, రాచయ్య, ఇంకెవరు!

- మానాన్న ఒకడండి.

- సరే మీనాన్న ఒకడూ. ఇంకా ఎవ్వరూలేరుగద!

- అంతేనండి.

- అంతే?

- ఎవర్నేనా అడగండి కావలిస్తే.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

8

హాస్యవల్లరి