పుట:హాస్యవల్లరి.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

ఇన్ఫెంటుక్లాసు పరీక్షచేస్తూ ఒక ఇనస్పెక్టరుగారు తన ఒక్కొక్క చేతులో రెండేసి చొప్పున లక్కగాడిదలు పెట్టుగుని,

- ఒకటోవాడు, ఇవి ఏమిటమ్మా!

ఒక - గాడిదలండి.

- ఇవి ఏమి మోస్తున్నాయి! రెండోవాడు!

రెండు - బట్టలండి.

- ఇక్కడున్న గాడిదలు మొత్తం ఎన్ని ? అయిదో వాడు!

అయి - అయిదండి!

21

మేష్టరు - ఏమోయ్. బుచ్చన్నా! ఏదీ క్షమార్పణకాగితం? రాసుగొస్తానన్నావ్, క్లాసు పిల్లల ఎదట?

బు - ఇదుగోనండి. అని ఇవ్వగా,

మే - (చూసి) సరే. ఇకనైనాసరే నువ్వు తిన్నగా ఉంటేసరి, నావాడవే పట్టుగెళ్ళు.

బు - మీ దగ్గరే ఉంచండి!

మే - ఎందుకూ?

బు - నేను మళ్ళీ మళ్ళీ రాసి ఇస్తూండలేనండీ!

22

బుచ్చి అబ్బాయి - ఒక్కొక్క కుక్కకి ఉండేబుద్ధి యజమానికి కూడా ఉండదు.

గౌరం - (తనకి కుక్క లేకపోయినా) ఒక్కొక్క కుక్క అనక్కర్లేదు. మా కుక్క అల్లాంటిదే.

బు - ప్రతిష్ఠ లేనప్పుడుకూడా అబద్దం ఎందుకూ?

గౌ - నీకుమల్లే సందర్భాలు కనిపెడుతూ కూచోడం నాచేత గాదు, పోదూ!

23

ఎలాగైనా క్లాసు ఎగవేయదల్చుకొన్న ఒక అబ్బాయి మేష్టరుతో,

- సార్, నాకు తల నొప్పి దంచేస్తోంది. క్లాసులో కూర్చోలేనండి.

మే - కూర్చో లేకపోతే నుంచో.

- పంతులికి అంత కాఠిన్యం పనికిరాదండి.

మే - నిజమే, నీ కవిత్వంలో మృదుత్వం ఉంది.

24

రాలయ్య పూటకూళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి ఒక రంగంలో, వడ్డించే వాడితో.

రా - ఏమిటయ్యా నీ గడుస్దనం, నాకు తెలియకడుగుతానూ నాలిక తెంపుగున్నా నాకేమీ రాల్చవ్. వాణ్ణెవణ్ణో ఆమూల కూర్చున్నవాణ్ణి మట్టుకు మేపుతున్నావు, మాంచి తరిపిదూణ్ణి మేపినట్టు. పప్పురైటర్ని ఇల్లా పిలు కనుక్కోవాలీ!

వడ్డనమనిషి - ఆ మూల ఆయనేనండీ.

25

కొందరు కోతలరాయుళ్ళు ఒక చోటచేరి దారుణాలు చెప్పుగుంటూ,

ఒకడు - ఓడికి యుద్ధంలో గుండుదెబ్బ తగిలి కుడిచెయ్యి ఊడిపోయిందిట. వాడది ఎరగడు. తరవాత ఓ ఘంటకి జేబులోంచి చుట్ట తీసుగోవలసి, అప్పుడు గ్రహించాట్ట చెయ్యి లేదు కదా అని.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

7

హాస్యవల్లరి