20
ఇన్ఫెంటుక్లాసు పరీక్షచేస్తూ ఒక ఇనస్పెక్టరుగారు తన ఒక్కొక్క చేతులో రెండేసి చొప్పున లక్కగాడిదలు పెట్టుగుని,
ఇ - ఒకటోవాడు, ఇవి ఏమిటమ్మా!
ఒక - గాడిదలండి.
ఇ - ఇవి ఏమి మోస్తున్నాయి! రెండోవాడు!
రెండు - బట్టలండి.
ఇ - ఇక్కడున్న గాడిదలు మొత్తం ఎన్ని ? అయిదో వాడు!
అయి - అయిదండి!
21
మేష్టరు - ఏమోయ్. బుచ్చన్నా! ఏదీ క్షమార్పణకాగితం? రాసుగొస్తానన్నావ్, క్లాసు పిల్లల ఎదట?
బు - ఇదుగోనండి. అని ఇవ్వగా,
మే - (చూసి) సరే. ఇకనైనాసరే నువ్వు తిన్నగా ఉంటేసరి, నావాడవే పట్టుగెళ్ళు.
బు - మీ దగ్గరే ఉంచండి!
మే - ఎందుకూ?
బు - నేను మళ్ళీ మళ్ళీ రాసి ఇస్తూండలేనండీ!
22
బుచ్చి అబ్బాయి - ఒక్కొక్క కుక్కకి ఉండేబుద్ధి యజమానికి కూడా ఉండదు.
గౌరం - (తనకి కుక్క లేకపోయినా) ఒక్కొక్క కుక్క అనక్కర్లేదు. మా కుక్క అల్లాంటిదే.
బు - ప్రతిష్ఠ లేనప్పుడుకూడా అబద్దం ఎందుకూ?
గౌ - నీకుమల్లే సందర్భాలు కనిపెడుతూ కూచోడం నాచేత గాదు, పోదూ!
23
ఎలాగైనా క్లాసు ఎగవేయదల్చుకొన్న ఒక అబ్బాయి మేష్టరుతో,
అ - సార్, నాకు తల నొప్పి దంచేస్తోంది. క్లాసులో కూర్చోలేనండి.
మే - కూర్చో లేకపోతే నుంచో.
అ - పంతులికి అంత కాఠిన్యం పనికిరాదండి.
మే - నిజమే, నీ కవిత్వంలో మృదుత్వం ఉంది.
24
రాలయ్య పూటకూళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి ఒక రంగంలో, వడ్డించే వాడితో.
రా - ఏమిటయ్యా నీ గడుస్దనం, నాకు తెలియకడుగుతానూ నాలిక తెంపుగున్నా నాకేమీ రాల్చవ్. వాణ్ణెవణ్ణో ఆమూల కూర్చున్నవాణ్ణి మట్టుకు మేపుతున్నావు, మాంచి తరిపిదూణ్ణి మేపినట్టు. పప్పురైటర్ని ఇల్లా పిలు కనుక్కోవాలీ!
వడ్డనమనిషి - ఆ మూల ఆయనేనండీ.
25
కొందరు కోతలరాయుళ్ళు ఒక చోటచేరి దారుణాలు చెప్పుగుంటూ,
ఒకడు - ఓడికి యుద్ధంలో గుండుదెబ్బ తగిలి కుడిచెయ్యి ఊడిపోయిందిట. వాడది ఎరగడు. తరవాత ఓ ఘంటకి జేబులోంచి చుట్ట తీసుగోవలసి, అప్పుడు గ్రహించాట్ట చెయ్యి లేదు కదా అని.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
7
హాస్యవల్లరి