వె - రెండూ ఓటేలే. మనకి చెరిసహం వస్తుంది బహుమతీ.
భూ - కాదులే “అభాగ్యం” అంటే భాగ్యం లేకపోవడం మాత్రమే. “దౌర్భగ్యం” అంటే దరిద్రం ఉండడం. అంచేత నేనే కొట్టేస్తా.
వె - ఏడ్చావులే! నాదాల్లో సారస్యం, జీవం, ఆత్మా లేవని రాయించి నెగ్గుతా!
భూ - నా దానికి శరీరమే లేదనీ, అది అసలు ఏమీ లేదనీ రాయించి నేనే నెగ్గి మరీ నీకు కనపడతా!
16
తెనుగు పాండిత్యానికి పేరుపొంది పోటీలో సంభావన కొట్టిన ఒక దొరగారితో వారి హిందూస్నేహితు డొకడు ముచ్చటిస్తూ.
హిం - మా గ్రంథాలు మీరేమన్నా చూశారూ, అసలు?
దొ - అవును. మీ రామాయణ మహా భారతాలు మనకు మాంచి స్నేహితులు. వారితో మేము ముట్టులో నున్నాము.
హిం - ఉన్నారూ, బాగుంది. అయితే మీకు తర్జుమా కూడా వచ్చినట్టే?
దొ - టర్జుమా! ఓ. అడి వెనుకనే వచ్చు.
హిం - ఇంకా కొంచెం సెలవియ్యండి.
దొ - ఉదాహరణా మీకు కావలసినది! ఇడుగో! 'దహార్స్ ఈజ్ ఈటింగ్ గ్రాస్' “గుఱ్ఱముగారు గడ్డి భోజనము చేయుచున్నారు.”
17
కుంటికాలు జగ్గయ్య ప్లీడరుగారు బోనులో ఉన్న వెంకటప్పగారిని 'క్రాసు' చేస్తూ.
జ - మీది ద్వారపూడి కాదుటయ్యా?
వెం - చిత్తం.
జ - వెనక మీ అబ్బాయిని రాజమండ్రిలో పట్టుగుని పోలీసువారు కేసు పెట్టలేదూ అతనిమీద?
వెం - అయితేం ? వెంటనే కొట్టేశారు. అప్పుడు నేను అక్కడే వున్నా.
జ - అక్కడికి ఎందుకు వెళ్ళారు మీ రప్పుడూ?
వెం - అక్కడికీ వెళ్ళక ఎక్కడికీ వెళ్ళక ఓచోటే అహోరించడానికి నేను వట్టి కుంటిముండావాణ్ణి కాదుగామరీ!
18
మంగన్న - ఓ వేసంకాలంలేదు దిబ్బాలేదు, నావీపు ఎప్పుడూ పెట్లుతూ ఉంటుందండీ!
మిత్రుడు - మీభార్య-అనగా మీ కళత్రం - కాపరానికి వచ్చినట్టేనా!
మం - ఆ. ఏణ్ణర్థం అయింది.
మి - ఇహనే మ్మరీ. అప్పణించేమో! నిదానంగా జ్ఞాపకం చేసుగోండి, ఈ పేలాపన!
19
ఒక ఇంటి ఎదట కట్టిఉన్న ఇంగ్లీషు నోటీసుబల్ల పరకాయించి చూసీకూడా ఇంగ్లీషు సాంప్రదాయం తెలియని పిచ్చెయ్య లోపలికి చొరబడగా,
యజమానుడు - ఔట్సైడువాళ్ళు లోనికి రాకూడదని తెలియదండి?
పి - అబ్బో! తెలుసు, తెలుసు! అందుకనే వచ్చాను, మొగాణ్ణిగనుక.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
6
హాస్యవల్లరి