పుట:హరివంశము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

హరివంశము


మ.

అనినం బెల్చన నవ్వి యమ్మునులతో నాతండు న న్నొక్కరుం
డనుశాసింపఁ బ్రభుండె ధర్మమున కధ్యక్షుండ నే నొల్లకుం
డిన సర్వోర్వియుఁ ద్రొక్కి తోయములలో డిందింతు [1]మిన్నైన వ్ర
త్తు నశేషాండ[2]పుటంబు గాల్తు వల దీదుర్వాక్యముల్ మాదెసన్.

107


వ.

మీ రేమియు నెఱుంగ రూరక పొం డనుటయు వారు మఱియును బెక్కుతెఱం
గులం [3]బలుకం దొడంగి తా రెంత దెలిపిన నాదుర్వినీతుండు తనదుర్వినయంబు
చూపం గడంగినం గినిసి నిజతేజోబలంబున నాబలశాలిం [4]బట్టి మిడుకమిడుకం
ద్రొక్కి మంత్రయుక్త[5]కుశంబుల నతని యెడమతొడ [6]వ్రచ్చిన నందు.

108


క.

కాలినకొఱవ తెఱుంగునఁ, [7]గాళిమమగు కుఱుచమేను గలపురుషుఁ డొకం
డాలోకనదుస్సహుఁడై , యాలో జనియించి [8]భీతి వడుఁకుచు నెదురన్.

109


వ.

కృతాంజలి యై నిలిచినం జూచి మునులు నిషీద యని పలికి నిషేధించి. రతండు
కల్మషసంభవుండు నిషాదుం డనం బరఁగె. వింధ్యప్రముఖసంచారు లగుపాప
కారులు కిరాతకైవర్తాదు లెల్లఁ దత్సంతానజాతు లై. రమ్మహాద్విజులు మఱియును.

110


వేనశరీరమథనంబునఁ బృథుఁ డుద్భవించినప్రకారము

క.

[9]వెర వొప్పఁగ వేనజనే, శ్వరుదక్షిణకరతలంబు సంరంభముతో
దరువంగ నరణిమథన, స్ఫురితుం డగు జాతవేదుపోలిక యమరన్.

111


ఉ.

ఆజగవాఖ్యమై పరఁగునాద్యశరాసనమున్ సముల్లస
త్తేజము దీప్తబాణములు దివ్యకనత్కవచంబుఁ దాల్చి యు
ద్వేజితశత్రుఁ డప్రతిమదీర్ఘతనుండు జనించె రాజవి
ద్యాజితలోకుఁ డైన పృథుఁ డమును లమ్మును లద్భుతవార్ధిఁ దేలఁగన్.

112


క.

ఆతండు ప్రభవింప మహా, భూతము లన్నియును బ్రీతిఁ బొదలుచు సేవా
కౌతూహలమున నచటికి, నేతెంచె నుదాత్తమూర్తు లెంతయు వెలయన్.

113


మ.

అభిషేకార్థముగా నిజోదకము లింపారంగఁ గొంచున్ సరి
త్ప్రభుఁ డాపూర్ణసరిత్సరస్సహితుడై ప్రాదుర్భవించెన్ సరో
జభవుం డింద్రుఁడు లోనుగాఁ గలమరుత్సంఘంబుతో నేఁగుదెం
చె భువిన్ బేర్కలసంయమీంద్రతతి వచ్చెం బేర్చుమోదంబునన్.

114


ఆ.

అట్లు జాతుఁ డైన యాసుపుత్రుండు పు, న్నామనరకమోక్షణం బొనర్ప
వేనుఁ డపుడ పుణ్యవృత్తి సంసేవ్యలో, కముల కరిగె సురలు గారవింప.

115
  1. మిమ్ముం దహింతు; మిమ్మందఱిన్, దునియం ద్రుంతు నశేషమున్ వలవ దీదుర్వాదముల్ మాదెసన్.
  2. ముదాల్తు నింక
  3. బెలుపం
  4. బెట్టుకట్టి
  5. కుశస్థలంబుల
  6. దర్చిన నందు
  7. గాలంబగుగుఱుచమేను గల
  8. చుండనడఁగుచు.
  9. కర మొప్పఁగ