పుట:హరివంశము.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1.

15


ఉ.

అమ్మెయిఁ గూడినట్టిఘను లందఱు నాతని నత్యుదగ్రపీ
ఠమ్మున నుంచి పెంపు ప్రకటంబుగఁ బావనమంత్రయుక్తతో
యమ్ముల సౌర్వభౌమ విభవాఢ్యునిఁగా నభిషిక్తుఁ జేసి రొ
క్కుమ్మడి మ్రోసే దివ్యమురజోత్కటనాదము లెల్లదిక్కులన్.

116


వ.

ఇవ్విధంబున [1]నవ్విశుద్ధతేజునకుం బూజితస్థైర్యం బగునైశ్వర్యం బొసంగి కృత
కృత్యులై కృత్యవేదు లగునాచతుర్ముఖాదులు నిజస్ధానంబుల కరిగిరి. తదనంతరంబ.

117


క.

ఏకాతపత్రముగ సిరి, గైకొని నృపమౌళి రత్నకలికాకలితా
లోకంబు చరణపీఠ, శ్రీ కున్నతిసేయఁ బృథుఁడు చెన్ను వహించెన్.

118


చ.

తనజనకుండు ధర్మగతి దప్పుట నొప్పఱి తొల్లి యొల్లఁబో
యిన జనకోటి దాను గడు నెక్కుడుగా నొనరించు నాదరం
బున ననురంజనోత్సవముఁ బొందఁగ రా జను పేరి కొక్కఁడున్
బెనుపగుపాత్ర మయ్యె గుణపేశలుఁ డాతఁడు నీతిధన్యతన్.

119


చ.

జలనిధులైన మెట్టలగు శైలములైన నడంగు [2]నవ్వియ
త్తలమయినం దలంబ యగు దానములైనఁ దిరోహితంబులై
తొలఁగు నతండు సంచరణదోహలమున్ బ్రసరించుచో రసా
తలసురధామసీమలను దద్రథ[3]రోధము లే దొకింతయున్.

120


క.

దునకయు వెద పెట్టకయున్, దనరె నఖిలసస్యములును ధారుణి గోవుల్
పెనుపొందెఁ గామదోహిను, లనఁ దరువులు మధురమధుఫలాఢ్యము లయ్యెన్.

121


సీ.

ఆసమయంబున నంభోజసంభవుయాగంబునంచు [4]సుత్యాహమునను
సొరిది సంజాతుఁ డై సూతుండు నాఁ జనుమునియుఁ దన్మఖకాలమునన జనన
మొంది మాగధుఁడు నా నొప్పుసంయమియు నయ్యజునాజ్ఞఁ గైవారులై దివిజుల
నలరించు పని నున్కి నందుల ఋషులు వేల్పులుఁ బ్రియంబున వారిఁ బిలువఁ బనిచి
తే. పృథునరేశ్వరుఁ డిటమీదఁ బేర్మి యెసఁగఁ, జేయఁగల[5]కార్యములు సవిశేషకృతులు
నాత్మదృష్టిమైఁ గని మీర లతనియెదిరి, కేఁగి కైవార మొనరింపుఁ డింపుమిగుల.

122


వ.

అని పనిచిన నమ్మహామనస్కులపనువు గైకొని వార లరిగి యావైన్యుం గని
మధురమనోహరగంభీరధీరపవిత్రచిత్రస్తోత్రంబుల నమ్మహాక్షత్రియు నుద్దేశించి
యుపన్యాసంబులు సేసిన బ్రీతుండై యయ్యాదిమవదాన్యుండు సౌజన్యసుముఖ
త్వంబు శోభిల్ల సూతునకు సూతదేశంబును మాగధునకు మగధజనపదంబు
నుద్యోగంబుగా నిచ్చిన నయ్యౌదార్యంబు సూచి కార్యాపేక్షు లై మహీజనం
బులు మన కితఁడు వృత్తిప్రదాత యగు నని కదిసి తమ తమ నేర్పు [6]లెలర్పం

  1. సమిద్ధ
  2. నుర్వియె
  3. దుర్గ
  4. సామాభినుతము చోట
  5. కార్యములను విశేష
  6. లేర్పడం