పుట:హరివంశము.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

429

ఉ. సాధితసర్వధర్మ యవసాదితదుర్జనకర్మ నిత్యస
     త్యోదితశర్మ నీతిసముపార్జితభాసురభర్మ బాణసం
     వేధితవైరిమర్మ దురుపేక్ష్యసముద్యమమర్మ వృత్తసం
     శోధితపుణ్యజీవన యశోమయగాంగజలైక పావనా.284
క. శ్రీమల్లచమూపతిసే, వామధురిమనిత్యసుముఖ వామవిచార
     [1]న్యామూఢవిముఖ యర్చిత, వామార్ధాంగపరతత్త్వ వాసవసత్త్వా.285
మాలిని. అనతనృపతికాంతాహారహంసాపకారీ
     [2]ధ్వనితగురుధనుఃప్రోద్వాంతనారాచవృష్టి
     వినమదభిమతార్థానిష్క్రియాసారదృష్టి
     జనితసుజనహర్షా సత్యనిత్యప్రకర్షా.286
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామ
     ధేయప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందు సప్తమాశ్వాసము.

  1. వ్యామోహ
  2. ధ్వనిగురుధనురంభోధ్వాంత