పుట:హరివంశము.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

377

క. శ్రీకంఠగగనతటినీ, శీకరకోరకితజూట శీతకిరణరే
     ఖాకల్పకల్పతరు[1]లీ, లాకల్ప దయవిలాస లాలితసుజనా.44
ఉ. నీమహనీయనామములు నీమహనీయగుణోదయంబులు
     న్నీమహనీయశీలములు నిత్యవిచిత్రము లాద్యసంయమి
     స్తోమనిరుక్తులం దెలిసి చూతురు ప్రాజ్ఞులు సర్వదేవచూ
     డామణిలగ్నముల్ భవవిడంబనమోచనముల్ మహేశ్వరా.45
మ. ఉరుఖట్వాంగకపాలభస్మభుజగాద్యుద్దామచిహ్నంబు ల
     ట్లరుదై యొప్పు ప్రభూతభూతవికృతవ్యాపారము ల్సూడ్కికిన్
     బరమౌత్సుక్య మొనర్పఁగా నెసఁగురూపం బొంద కీ వున్న నె
     వ్వరు సర్వజ్ఞ యెఱుంగువారు భవదవ్యక్తాద్యసూక్ష్మాకృతిన్.46
క. చిరతపముల మెచ్చును సు, స్థిరభక్తికి వలచి వచ్చి చిక్కును ద్రిజగ
     ద్వరదా! ప్రభు! నినుఁ దక్కఁగ, హర! యన్యునిఁ జెప్పగలనె యామ్నాయంబుల్.47
ఉ. మేదిని తోయముల్ శిఖి సమీరుఁడు మిన్ను రవీందు లాత్మనా
     నై దును మూఁడు నీతనువులై వెలుఁగొందఁ బ్రపంచనిష్ప్రపం
     చోదితభావకర్తవయి యొక్కఁడవుం దనరారు టెందు లో
     కాదిని ని న్నెఱుంగు బుధుఁ డన్యు గణించునె విశ్వవందితా.48
ఉ. దక్షుఁ డదక్షుఁడై చెడియెఁ దన్మఖమందుఁ గడంగి బాహుదం
     [2]తాక్షిరసజ్ఞలాదిగ నపాయము నొంది రనేకనిర్జరుల్
     ప్రక్షతు లైరి నీనుదుటిపావకుఁ డేఁచినఁ గాలుఁ గాలుఁడున్
     రక్షకుఁ డైననీ వొకఁడ రాజవు రాజకళావిభూషణా.49
మ. గిరిరాజాత్మజ దేవి నీకు, గిరి నీగేహంబు, విశ్వామరే
     శ్వరులుం బంట్లు సుభూతముల్ సహచరవ్రాతంబు ద్రైలోక్యమున్
     బరమైశ్వర్యపదంబు నీకు నెన సెప్ప న్నీవ కా కన్యు లె
     వ్వరు నీ యుద్ధత తాండవం [3]బనితరవ్యాప్తంబ యంబాపతీ.50
క. హుతభుజుఁడును యజమానుఁడు, హుతమును నీవ యని చెప్పుచున్న విశ్రుతులా
     శ్రుతిమఖములు నీప్రియములు, క్రతుఫలదాతవును నీ వొకండవు రుద్రా!51
క. అతిసౌమ్యము లతిఘోరము, లతిసూక్ష్మము లతివిపులము లద్భుతములు నీ
     వితతాకారంబులు త, ద్గతహృదయుల కెఱుఁగవచ్చుఁ గందర్పహరా.52
క. [4]భూతివిధాయకుఁడ వఖిల, భూతనియామకుఁడ వీవు భూతనిధివి స
     ద్భూతిదుఁడవు నమ్రులకును, భూతేశ్వర నీమహిను ప్రభూతంబు శివా.53
క. భద్రాకారుఁడవు సతత, భద్రచరిత్రుఁడవు పరమభవ్యుఁడవు మహా
     భద్రాభిధానుఁడవు బహు, భద్ర[5]ప్రదుఁడవు త్రిలోకపతివి మహేశా.54

  1. శీలాకల్ప
  2. త్రాక్షరసంజ్ఞ
  3. బు నితరావ్యాప్యంబె
  4. భూత
  5. పదుండవు