పుట:హరివంశము.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

హరివంశము

చ. నినుఁ గొనియాడ నేర్తు నని నిక్కువ మెవ్వఁడు శక్తియుక్తుఁ డె
     వ్వనిమనము న్మనీషయును వట్రిలు నెవ్వనిజిహ్వ సాగు నే
     యనువు ప్రశంస చెప్పు సకలార్థసహిష్ణుఁడ వీవు సైపఁగాఁ
     జనుఁ బరమేశ మాదృశులసంస్తుతి చాపలమున్ వృషధ్వజా.55
ఉ. ఏ ననిశంబు దేవ నిను నెంతయు భక్తిఁ దలంతు నీవు న
     న్నీ నెఱివానిఁగా నెఱుఁగు దిట్లగు టించుక చిత్తగించినం
     బూని కృతార్థతామహిమఁ బొందని భక్తశుభ[1]క్రియానుసం
     ధానము నీకు నైజము గదా జగదాత్మక! యెవ్విధంబునన్.56
క. మ్రొక్కెదఁ గృప రక్షింపుము, మ్రొక్కెదఁ గృపతోడఁ జూడుము నిరంతరమున్
     మ్రొక్కెదఁ గృపఁ గైకొను [2]మే, దిక్కున నీదిక్కె మాకు దిక్కు శరణ్యా!57
వ. అని బహుభంగులఁ బ్రస్తుతించినం బ్రసన్నుం డై పరమేశ్వరుండు పద్మలోచను
     పాణిపంకజంబు నిజహస్తతలంబునం గబళించి సర్వదేవమునిసముదయంబులు విను
     చుండ నతని కి ట్లనియె.58
తే. దేవవంద్య జనార్దన దివ్యతపము, పేర్మిఁ దొల్లియ తగుసిద్ధిఁ బేర్చినాఁడ
     వీవు పుత్రుఁడు నీ కుదయించెఁ గాదె, మున్ను నాయీగివలన జగన్నుతార్థ.59
క. విను మేను ప్రథమయుగమున, ననేక వత్సరశతంబు లంచితనిష్ఠం
     బనుపడి కావించితిఁ దప, మనఘా యెం దేని నొక్కయభిలాషమునన్.60
వ. ఆసమయంబున.61
క. నాకుఁ బరిచర్య చేయుట, కై కొండుక[3]ప్రాయమున నిజాత్మజ నిమ్మై
     నాకజనకుండు దెచ్చి స, ఖీకలితసహాయ నప్పగించెం బ్రీతిన్.62
వ. ఏను నక్కన్నియ కొలువున కియ్యకొంటి న ట్లున్న మమ్ము నిద్దఱం గూర్చుట
     యపేక్షించి సహస్రాక్షుం డక్షుద్రసాహసక్రియావిజృంభమాణోద్దాముం డగు
     కాముం బనిచినం బనిపూని.63
సీ. ముందటియెలమావిమొక్కల సలరింపఁ గర్త దా నగు చెలికాఁడు నడువ
     నిరువంకలందును విరులతేనియగ్రోలుదొరలు మోదంబునఁ ద్రుళ్లియాడ
     నునుఁగుత్తుకలు తీపుగొనఁ గూయుపులుఁగులచారునాదములు గైవారములుగఁ
     జందనగిరినుండి చనుదెంచి చల్లనిబం ట్లెల్లపనులకుఁ బరువువెట్టఁ
తే. జిలుకమావులు గట్టినచిగురుదేరి, పసిఁడిబలుమీనుపడగ నల్దెసల మెఱయఁ
     జెఱుకువిలుఁబువ్వుటమ్ము లేడ్తెఱ ధరించి, కట్టి బిగిసి యేతెంచె నక్కడిఁదిమగఁడు.64
వ. ఇట్లు వచ్చి పచ్చవిల్తుండు వివిక్తప్రదేశంబునఁ బవిత్రచిత్రకాయవర్మాస్తరణంబున
     నాసీనుండ నై యనూనధ్యానముకుళితలోచనం బగు పవనస్థానంబున నాత్మాను
     సంధానంబు సేయుచు వెలుపలి నడవడి దడవుగా నుడిగి మగుడి మనంబు

  1. ప్రదాన
  2. మీ, దిక్కగు టొక్కటియ మాకు దేవశరణ్యా.
  3. కాయమున