పుట:హరివంశము.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

367

క. ఆశార్ఙ్గధన్వుఁ డీతం, డాశంఖసుదర్శనాబ్జహస్తుఁ డితం డా
     పేశలనవజలధరసం, కాశశరీరుండు నలఘుకరుణుఁడు బుద్ధిన్.215
తే. పసిఁడిబొమ్మ నీలపురాతిపలకఁ జెంది, యున్నతెఱంగున బేరురం బొందె లక్ష్మి
     నెఱసి బెరయంగఁ బాలమున్నీటినడుమఁ, బవ్వళించునిత్యానందబావుఁ డితఁడు.216
క. లోకంబుల సృజియించును నాకలితముగాఁగఁ బ్రోచి యన్నియుఁ బిదపన్
     లోకడుపున నడఁగించుమ, హాకర్మరుఁ డితఁ డచింతితాత్ముఁడు మహిమన్.217
సీ. మధుకైటభాసురమథనుఁడై లయసుప్తి నిద్రించి దంష్ట్రియై భద్ర దంష్ట్ర
     నిల యె త్తి కూర్మ మై యలఘుశైలము మోచి నరసింహుడై దైత్యునురము వ్రచ్చి
     కుబ్జుఁడై మూఁడడుగుల మూడుజగములు గొలిచి భార్గవుఁడునై కుతలపతులఁ
     దునుమాడి దశరథతనయుఁడై రావణుఁ బరిమార్చి [1]రోహిణిపట్టి యనఁగ
తే. నొప్పు నన్నయుఁ దానునై యుర్వి నిపుడు, దేవకీసూనుఁడై యున్న దేవదేవుఁ
     డితఁడు పూతనాప్రాణపాయితఁ దలిర్చెఁ, బురిటిపాపఁడై యొప్పారు పరువమునను.218
క. బోరగిలఁగ నించుకయును, నేరనినాఁ డడరిపోవ నెట్టనఁ ద్రోచెం
     గ్రూరశకటంబు చరణాం, భోరుహతలమున నితం డపూర్వపుశక్తిన్.219
తే. ముద్దులాఁడయి వ్రేఁతల మొజంఱఁగి పాలు, వెన్నలును దాఁపరింపంగఁ దన్నుఁ బట్టి
     తల్లి రోలితో దామెనత్రాటఁ గట్ట, నీతఁడ కాఁడె మద్దులు గూల్చి యేపుసూపె.220
క. కాళిందిలోనఁ దిరిగెడు, కాళియనాగంబుఁ గిట్టి కట్టలుక విష
     జ్వాలలు గ్రక్కఁగఁ ద్రొక్కఁడె, నోలి నితఁడు తత్ఫణంబు లొక్కొట [2]నలియన్.221
క. గోవర్ధనపర్వతమును, గోవులకై యెత్తె నితఁడు గొడుగుగ మరి యా
     దేవేంద్రు నంతవానిన్, సావజ్ఞతం జూడఁడే [3]పదానతుఁడైనన్.222
క. తనయౌవనంబు గోపీ, స్తనభరభోగమున భవము చరితార్థముగా
     ననుపముఁ డితఁడు బృందా, వనమునఁ గ్రీడించె గోషవర్గము గొలువన్.223
క. వృషభాకారంబున దు, ర్విషహతురంగాకృతిని ధరించినదేవ
     ద్విషుల నని ద్రుంచె సర్వం, కషబలుఁ డీతండకాఁడె ఘనగోష్ఠమునన్.224
క. ఈ దేవుఁడు యమునాజల, మాదర్శము గాఁగఁ జూపె నక్రూరున క
     య్యాదితనువు గ్రమ్మఱఁ ద, ద్భేదత యాయొడలియంద వెలయించె లలిన్.225
తే. రజకుఁ బొరిగొని కొనియఁ జీరలు సుగంధ, పుష్పదాయికి నొసఁగె నద్భుతవిభూతి
     గంధకారిక కప్సరోంగనలకంటే, నిచ్చె నెక్కుడుసౌందర్య మవ్విభుండు.226
క. బాణాసనంబు విఱిచిన, పాణిన గజకుంభతలము పగిలించి వెసన్
     జాణూరువీఁపు విఱిచె ధు, రీణభుజుం డీయశోగరిష్ఠుఁడు కడఁకన్.227

  1. రేవతిపతి యనంగ
  2. జదియన్
  3. సదా