పుట:హరివంశము.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

హరివంశము

     ధీరోదాత్త[1]పతిప్రియాచరణభక్తిప్రౌఢ యాతన్వి దాఁ
     బ్రారంభించె మహారణక్రియకు నాప్రత్యర్థితో నుక్కునన్.162
తే. శ్రమను మెఱయ భల్లార్థచంద్రక్షురప్రముఖశిలీముఖములు బహుముఖములందు
     సత్య యేయంగ సత్యంబు సత్యరహితు, నొంచుమాడ్కి నయ్యంపఱ నొంచె నరకు.163
చ. తనపని మాని యింక వనితం బురికొల్పి రణంబొనర్పఁ బం
     చి నను జయింపనోపునె యిసీ యిది యేటిది యంచు భూమినం
     దనుఁ డపహాసవిస్మయ[2]మదప్రకటాననుఁ డై కడంగి యే
     సె నఖిలలోకరక్షకునిచెల్వపయిం బటుదీప్తబాణముల్.164
క. తోడన చనుఁగవ యొక్కట, నేడమ్ములఁ బార్శ్వయుగ్మ మెసఁగుకరయుగం
     బాడఁగ నాఱిట నేసినఁ, జేడియ యించుకయు లెక్క చేయక యలుకన్.165
శా. విల్లుం గేతువుఁ ద్రుంచి రథ్యముల నుర్విం గూల్చి సూతున్ వెసం
     ద్రెళ్లంజేయఁగ హీనసారతమెయిన్ దీనత్వ [3]మ ట్లొందియున్
     భల్లంబుల్ నిగిడింప రాక్షసుఁడు చాపం బొండు గైకొన్న న
     వ్విల్లు న్నుగ్గుగఁ జేసె నాక్షణము దేవీరత్న ముగ్రోద్ధతిన్.166
క. మూఁడవవి ల్లెత్తిన నది, పోడిమి చెడిపోవ నసుర పొలుపరి యలుకన్
     వాఁడిమి యొసఁగఁగ నొకగద, వేఁడిమితో వైచె వృష్ణివిభుసతిదెసకున్.167
వ. దాని నడుమన తిలప్రమాణశకలంబులు గావించి సత్యభామ భీమాటోపపరిదీపిత
     యై మఱియుం బ్రతివీరుచేఁ బర్యాయప్రయుక్తంబు లగు శక్తిపరిఘంబులు
     పొడిసేసి భాసితముఖంబు లగు శిలీముఖంబుల నతని వెఱచఱవ నేసినం జూచి
     ఖేచరులు ప్రశంసించి రట్టి సంరంభంబునకుఁ బ్రీతుం డై పీతాంబరుండు.168
మ. చెలువం జక్కఁగఁ గౌఁగిలించి సమరస్వేదోజ్జ్వలం బైన యు
     గ్మలిఫాలంబుఁ గపోలయుగ్మకము నున్మార్జించుచుం దేవి య
     గ్గలికం బెద్దపెనంగి డస్సి తిటు లింకం జాలు నిల్మంచు మె
     చ్చులు దోడ్తోడ మనంబునం బ్రియము లై సొంపారు ప్రేమంబునన్.169
క. తనయఱుత నేవళం బొకఁ, డనుకూలతఁ [4]గేలఁ బుచ్చి యాసతియఱుతన్
     వనరుహలోచనుఁ డిడి లో, చనపారణ సేసెఁ దత్ప్రసాదనదృష్టిన్.170
సీ. ఎయ్యది గాంక్షించి యెన్నఁడుఁ గానలే దయ్యె రుక్మిణీయంత యదియుఁ దొల్లి
     కౌస్తుభాభరణంబుకంటెను వల్లభం బై యుండు నెయ్యది యవ్విభునకు
     నఖిలలోకములవిఖ్యాతమై యెయ్యది [5]వెలవెట్టరానిపెంపులఁ దనర్చు
     జగతి జనాలోకచ ద్రికగాఁ జేయు నెయ్యది దనకాంతి నెల్లనాఁడు

  1. పరిష్క్రియావరణశక్తిప్రౌఢ యాతన్వియున్
  2. విధావిధుతాననుడై; వికాసనిజాననుఁడై
  3. మట్లుండియున్
  4. బెలయ
  5. వెలకట్ట