పుట:హరివంశము.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

హరివంశము

వ. దుర్యోధనుండు తనకూఁతు లక్షణం గృష్ణతనయుం డగు సాంబుం డెత్తికొనిపోవ
     వెనుకొని యెయిది పట్టి తెచ్చి హస్తినగరంబునఁ జెఱపెట్టిన నవ్విధం బెఱింగి
     సైరింపక సంకర్షణుం డరిగి (పురబహిరంగణోపవనంబున నిలిచి) తొలుత సామంబు
     ప్రయోగించి తత్ప్రకారంబు కౌరవులు గొనక నిరాకరించిన విజృంభించి.9
మ. పౌరశ్రేణులతో నశేషకురుభూపాలాన్వయశ్రీలతో
     నారూఢన్నతవప్రహర్మ్యములతో నవ్వీడు దుర్వార గ
     ర్వారంభంబున గంగలో వయిచువాఁడై ఘోరసీరంబు ప్రా
     కారాంతంబునఁ జొన్పి పెల్లగిల నుగ్రక్రీడమైఁ దివ్వఁగన్.10
తే. తలఁకి కురుపతి తాను జుట్టలును సాంబుఁ, [1]దెఱవఁ గొనివచ్చి యొప్పించి తేర్చుటయును
     దేఱె బలదేవుఁ డన్నరదేవుఁ డతని, నాత్మగురునిగ వరియించి యర్చ లిచ్చె.11
వ. ఇట్లు గదాపరిశ్రమంబునందు సుయోధనుండు రామశిష్యుం డన జగత్ప్రసిద్ధం
     బయ్యె నాఁటనుండియు హలిహలాకర్షంబున హస్తినాపురం బొకదెస నోడ్డ
     గెడవై యుండు నిది యయ్యమునావిభేదను భుజగర్వప్రభావంబు ప్రలంబధేనుక
     ముష్టికహననంబు మొదలుగా మున్ను నీ వాకర్ణించితి మఱియు నతని పౌరు
     షంబు లనేకంబులు గల వవి త్రిభువనఖ్యాతంబు [2]లనుటయు జనమేజయుండు
     మునీంద్రా యుపేంద్రుండు విదర్భనగరంబుననుండి చనుదెంచిన పిమ్మట నెమ్మెయి
     వర్తనంబునం బచరించె నని యడుగుటయు నవ్వాగ్మివరుం డి ట్లనియె.12
సీ. ద్వారకాపురమున దానవాంతకుఁడు యోగక్షేమ[3]శాలి యై కరుణ నఖిల
     జగముల రక్షించు సన్నాహమున నున్నయాసమయంబున నసుర యొకఁడు
     వనరుహాసనదత్తవర[4]సముద్ధతుఁడు ప్రాగ్జ్యోతిషపతి నరకుండు నాఁగ
     ధారుణీదేవికిఁ దనయుండు సర్వదేవతల కవధ్యుండు దితిజవంశ
తే. మంతటికి దాన యొడయఁ డై యదటు మిగిలి, యెల్లలోకంబులకుఁ జాల నెగ్గుసేయ
     నంతయును విని కినుకఁ జక్రాయుధుండు, దివిజరిపుఁ గూల్చి మహిమ నుద్దీప్తుఁ డయ్యె.13
వ. అమ్మహాదనుజుండు మహేంద్రాదులం బరిభవించి పదంపడి కంసమథనుకడిమి
     కగపడి మడిసినకథయును సవిస్తరంబుగా వినిపించెద వినుము.14
క. సురదైత్యాదులదిక్కునఁ, బరాజయము రాక యుండఁ బద్మభవునిచే
     [5]వరము గొని క్రొత్తసిరిపస, సురారసమువోలె [6]నొడలు సొచ్చి కలంచెన్.15
వ. అప్రమేయదైత్యసేనాసహాయుం డై కడంగి యా నరకాసురుండు.16
చ. తొలితొలి యేఁగి [7]భూరిభుజధుర్యత యొప్పఁగ నింద్రువీటివాఁ
     కిలితలుపుల్ ప్రగాఢపరికీలితముష్టిహతిం బగిల్చి వే

  1. తెఱవతోఁ దగఁగొని వచ్చి తేర్చుటయును
  2. లగుటయు
  3. కారియై
  4. సహాయుండు
  5. వరముగఁ గని క్రొత్తకలిమి
  6. గడిమి
  7. తీవ్రభుజధుర్యత యేఁపఁగ