పుట:హరివంశము.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

హరివంశము

క. ఒప్పుగఁ బరిపాటి యొకఁడు, దప్పక మాచేతలెల్లఁ దగఁ దడవితి నీ
     విప్పటికి నింతసాలుం, జెప్పుము నీరాక కొకవిశేషం బనఘా.35
వ. అని యడిగిన నయ్యోగీశ్వరుం డఖిలేశ్వరున కి ట్లనియె.36
సీ. దక్షిణాంభోనిధితటమునఁ గోకర్ణ మనుమహాస్థానంబునందు వినుము
     దివ్యలింగాకృతిఁ దేజరిల్లెడు దేవదేవేశు శంకరు దేవపూజ్యు
     వృషభవాహనుఁ జారువీణారవాన్విత యగుగీతపూజ నత్యంతభక్తి
     నారాధనము చేసి యట నివృత్తుండనై యర్ధేశ్వరునిదెస కరుగుచుండి
తే. నడుమఁగంటిఁ గుండినపురనాథుఁ డైన, భీష్మకుని నాతఁడును నన్నుఁ బ్రియమెలర్ప
     నర్చితునిఁ జేసె భువిఁగల యఖిలనృపుల, నాజరాసంధుఁదొట్టి యే నచటఁ గాంచి.37
వ. వీ రేమిటికిం గూడి యున్నా రని విదర్భరాజు నడిగిన నతం డాత్మీయకన్యయగు
     రుక్మిణీదేవిం జైద్యుఁ డగుశీశుపాలున కిచ్చువాఁ డై తాను రావించినఁ దద్వివా
     హంబునకు [1]మగధాదులు వచ్చుటయు నెల్లిరేపాడి లగ్నం బగుటయుం జెప్పిన
     నవ్విధం బెఱింగింప నీయున్నయెడ కరుగుదెంచితి.38
శా. నీ వాకన్నియఁ గోరినాఁడవు [2]మది న్నీ కీక వైదర్భుఁ డి
     ట్లావిద్వేషిమతంబు సేయఁగలవాఁ డైనాఁడు తత్కార్య మిం
     కేవిఘ్నంబును లేక సిద్ధ మగు [3]నట్లేనిన్ యశోహాని యొం
     డీవిశ్వంబున నింతకంటెఁ గలదే యేభంగి నీపేర్మికిన్.39
వ. కావున నుగ్సేనమహారాజుఁ బురస్కరించి బలదేవసహాయుండ వై సాత్యకి
     ప్రముఖనిఖిలయోధవీరులం దోడ్కొని సైన్యం బంతయుఁ దోడనడవ నీ ప్రొద్ద
     కదలి పోయి యక్కడం బ్రోవుగొని యున్న రాచపదువులం గుదియించి సమ్ముదం
     బున ముదితం బరిగ్రహించి తెమ్ము భవదీయబాహుయోగంబున సుదర్శనం బగు
     సుదర్శనంబునకుఁ దీర్ప రానిపను లెక్కడఁ గల వది యట్లుండె.40

నారదుఁడు శ్రీకృష్ణుని రుక్మిణీదేవిం బరిగ్రహించికొని తేర నియోగించుట

క. వీను మంతరిక్షతలమున, ననఘా యంతర్హితుండనై చూచితి న
     వ్వనితారత్నము లీలా, వనమున నెచ్చెలులతోడ వగఁ బొగులంగన్.41
చ. నిను విని నీదెసం దలఁపు నెక్కొని చిక్కిన నెమ్మనంబు నీ
     యనుపమసద్గుణస్తుతికి నమ్ముడు వోయినజిహ్వయుం బ్రియం
     బునఁ దమకించి నీలలితమూర్తిఁ గనుంగొనఁ గోరుచూడ్కియుం
     దన కమరంగ రాజసుత తక్కినభంగు లెఱుంగ దేమియున్.42
సీ. పలుక నెంతయు గ్రుయ్యఁబాఱిననునుఁజెక్కు లందందఁ దడిపెడునశ్రువారి
     యింకినచనుదోయి [4]యేకావళీసూత్రభూషితం బైనది పొలుపు దక్కి
     పాటన యెడలుటఁ బాపటరూపేది కడుమాసినది నీలకచభరంబు
     వేఁడియూర్పుల తోన వెడలునోయుసుఱును [5]ననఁగఁ దూఁగాడెడు నంగవల్లి

  1. మగధాధిపతి
  2. తుది
  3. నట్లైన
  4. యేకాళిమాత్రని
  5. నందందఁ దూఁగాడు