పుట:హరివంశము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

హరివంశము


క.

జనులకు నతిదుస్సహ మగు, పెనుగంపుఁ గఠోరకటుకభీషణరూపం
బున నెదురుగాలి పైకొని, చనుదేరఁగ దానిబడిన చని య యయ్యవులన్.

78


సీ.

పాతాళమున నున్నఫణిరాజుకోఱలపసయెల్ల రూపమై యెసఁగె ననఁగఁ
గాలకూటానలగర్వంబు సర్వంబు ప్రచ్ఛన్నతనులీలఁ బ్రబలె ననఁగ
[1]నరకాగ్నిశతముల పరుసదనం బంతయును నొక్కచోఁ గూడి తనరె ననఁగ
నాభిచారకవిధియాభిజాత్యము సకలము మూర్తిమంతమై యమరె ననఁగ


తే.

నధికవికృతమై యౌన్నత్య ముబరంబు, దాఁకి మ్రాకుల నంతటఁ దానకాన
రాఁ బ్రభూతవిస్తారమై క్రాలుకపట, కటుకపిత్థభూజాతంబు గాంచె నతఁడు.

79

శ్రీకృష్ణుఁడు విషమయం బగుకపిత్థవృక్షము నున్మూలించుట

వ.

ఇట్లు దూరంబునం గని దాని చేరువకుం బోవ నతిసంకటం బై యున్న మాయా
మయం బగువనంబు గనపగొడ్డండ్ల నెఱగత్తుల నఱకి పడవైచుచుం దెరువు
గావించుకొని కదియునంత.

80


మ.

తరుమూర్తిం గలభర్తఁ జేరి తమవత్సశ్రేణియుం దారుఁ ద
త్పరిపక్వార్ద్రఫలోపజీవనమునన్ దర్పించి యున్నట్టియు
ద్ధురగోరూపనిశాచరీసమితి తద్గోపావలిం గాంచి చె
చ్చెర నొక్కుమ్మడి రోసి పాసి ఖరదృష్టిం జూచుచుండెం బొరిన్.

81


వ.

యదుకుమారుండును ముప్పదిబారలపఱపైన బంధురస్కంధంబునఁ దదర్ధపరిణా
హంబగు దేహంబున నపరిమేయం బగుసముచ్ఛ్రాయంబున నతిభయంకరం
బై యున్న యన్నగంబు దప్పక చూచి మహాకుంభప్రమాణంబు లగుతత్ఫలంబులు
గనుంగొని యివియ కావే నిజదుర్గంధి యగుగంధవహువలన నస్మద్బంధుబాధ
గావించినయవి. వీనిం దొలుత రూపడంచి మఱి నాచేయంగఁబూనిన పనియం
తయుం జేసెద నని బలదేవుండునుం దానునుం గూడి కడంగి.

82


చ.

క్రమమునఁ బిందెలుం బసరుఁగాయలును న్మఱిదోరబండులుం
గమిసినపండులుం గెలలు గట్టి తదున్నతశాఖ లన్నియుం
దమమయమై తలిర్పఁగ నతండును బాహులు సాంచి హస్తగ
మ్యము లగువాని నెల్ల నలియన్ భువివైచుచు వచ్చెఁ దోడుతోన్.

83


సీ.

ఆర్చుచు గోపాలు[2]రందియీ సందంద బడియలరాలను బడఁగవైచి
కొన్ని దవ్వులవానిఁ గోమరార వానిన కొని ధాత్రిఁ దొరఁగించి కొన్ని లీల
[3]నిక్కి [4]పెళ్లని కొమ్మ లుక్కున విఱుగంగఁ దిగిచి ధారుణిఁ ద్రోచి పగులఁ ద్రొక్కి
కొన్ని యివ్విధమున నన్నింటి రాల్పంగ నిష్ఫలం బయ్యె నన్నీచతురువు


తే.

ఫలనిపాతహతం బగుబహుళరవము, చటులశాఖావిభంజనజనితరవము
సమదగోపాలనివహగర్జారవంబుఁ, గలసి గగనంబు శబ్దాత్మకంబుఁ జేసి.

84
  1. నురగాగ్ని
  2. రందఱు
  3. భ్రళ్లనఁ గొమ్మలు గ్రక్కున
  4. పెల్లున