పుట:హరివంశము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

హరివంశము

శతధన్వుఁడు కృష్ణునకు వెఱచి తురగారూఢుఁ డై పాఱిపోవుట

క.

తనకు నొకనాఁట శతయో, జనములు సను హృదయ యను లసత్తురగనితం
బినిగలిమి దాని నెక్కి ప, వనసమగతిఁ జనియె మనసు వడఁకఁగ భీతిన్.

209


ఉ.

అంత నెఱింగి శౌరియు సహాగ్రజుఁడై రథ మెక్కి యయ్యప
క్రాంతుని వెన్నడిం దగులఁగాఁ దనపోయెడిదవ్వు వోయి తా
నంతటఁ బోవలేక మృతినందె హయాంగన భోజవర్యుఁడున్
భ్రాంతతఁ బాదచారి యయి పాఱె విదేహపురంబు చేరువన్.

210


క.

కనుఁగొని కృష్ణుఁడు బలదే, వున కిట్లను హయములకు [1]తెవు లగు వెసం
జననిచ్చుట గావున నీ, వనఘా కొనిరమ్ము రథము నల్లన వెనుకన్.

211


తే.

విగతవాహనుఁ డైనయివ్విమతుఁ డోపు, కొలఁది మెల్లనఁ బాఱెడుఁ గూడ ముట్టి
పట్టికొనియెద ననిన నబ్బలియుఁ డట్ల, కాక యన డిగ్గ నుఱికి యాకంసరిపుఁడు.

212


క.

[2]కొంతదడ వరిగె వెసుకొని, యంతటఁ గడు నలిగి యాతఁ డాశతధను న
త్యంతక్రోధంబున మది, [3]శాంతింపక తునియవైచెఁ [4]జక్రముచేతన్.

213


వ.

ఇట్లు తల ద్రుంచి శతధన్వుం జేరఁబోయి.
క. [5]మొలయును జీరయు నోరును, దలయును శోధించి చూచి తత్తనువున న
వ్విలసితరత్నము గానఁడ, హలధరుఁడును గూడ వచ్చె నంతటిలోనన్.

214


వ.

ఆతం డవ్విధం బతనికిం జెప్పి శతధన్వువధంబు వితథం బయ్యె నను పలుకు పలికిన
నది బొం కనుతలంపునఁ గటకటంబడి బలుండు.

215


తే.

[6]అర్థతృష్ణ యెట్టిదియొ నీయట్టివాఁడు, నిస్సిరో యింతమాత్రకు నిట్టిఁడయ్యెఁ
బలుకు లేటికి నీతోడి భ్రాతృధర్మ, మింక నింతియ చాలు నీయిచ్చఁ జనుము.

216


వ.

అని యతని శపథవాక్యంబులు విశ్వసింపక సాంత్వనంబులు గైకొనక యిమ్మాయ
లేనెఱుంగనియవియె యుడుగు మని పాసి యొక్కరుండును మిథిలాపురంబునకుం
జని జనకరాజు చేత సత్కృతుండయి తత్సదనంబున నుండె వెన్నుండును సైన్య
సుగ్రీవమేఘపుష్పపలాహకంబు లను రథ్యంబులు గల యాదివ్యరథంబుతోడ
మగుడి ద్వారవతీపురంబునకు వచ్చె నక్కడ.

217


క.

వైదేహపురనివాసు మ, హాదుర్దమసత్త్వు సాత్వతాగ్రణి ఘను దా
మోదరపూర్వజుఁ గానం, గా దుర్యోధనుఁడు వచ్చి కడు వినయమునన్.

213
  1. నెవులు గడువెసమైఁ సెవులగు (పూ. ము.)
  2. వ. కొంత దవ్వు వెనుకొని యంట నరిగి యంతట నట్లు శతధన్వుమస్తకంబు దునియం జక్రంబు వైచి చేరంబోయి.
  3. చింతింపక
  4. చక్రము
  5. తలయును జీరయు నోరు మొదలుగా (పూ. ము.)
  6. అకట