పుట:హంసవింశతి.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lii


కథా సంగ్రహము

ప్రధాన కథ

చిత్రభోగుఁడు రాజు. శివసత్తి నానాదేశములు చూచిన జోగురాలు. ఆమె వచ్చి, హేమవతియను ఆయూరి సాతాని చిన్నది- విష్ణుదాసుని యిల్లాలు- అన్నులమిన్నయని చెప్పి, రాజుకు మోజు కలిగించెను. రాజదూతిక వెళ్లి హేమవతికి రాజుపై మోజు కలిగించెను. ఇంతలో విష్ణుదాసుఁడు దూరదేశమేఁగుట సంభవించెను. ఇదే సందని ఆ యిల్లాలు ప్రొద్దు గ్రుంకినంతనే రాజునొద్దకుఁ బయనమయ్యెను. పెంపుడు హంస పోనీయలేదు. నిలిపి కథ చెప్పుచుండెను. ఈ రీతిగా నిరువది రోజులు గడచెను. ఇరువది యొకటవ రోజున ఇంటివాఁడు దిగెను. సతి పతివ్రత యయ్యెను. రాజు సద్బుద్ధియయ్యెను.

హంస ఒక కథల పుస్తకము. వింశతి విభావరులు కాలక్షేపము జరిగెను.

మొదటి రాత్రి కథ

ఇల్లాండ్రు ఱంకాడరాదని ధర్మోపదేశము. కథ లేదు.

రెండవ రాత్రి కథ

చారుశీలా గుణదీపకులు బ్రాహ్మణ దంపతులు. వారి సుపుత్రుఁడు కాశీలింగము తెచ్చి శివాలయము కట్టించెను. ఆలయపుఁ బూలతోఁట బావికడ, ఏతపువాఱు కొఱికి, యొక నక్క చచ్చెను. ఆ నక్క 'ఆహారంబె చూచెఁగాని, తనచేటు తెలియదయ్యె'. అట్లే-ఱేనిపట్ల కక్కుర్తి పడినచోఁ జేటు తప్పదని హెచ్చరిక.

మూడవ రాత్రి కథ

అసహాయుఁడు నాయకుఁడు. అతనిభార్య హేమరేఖ. ఆ విలాసిని యొకనాఁడు తలుపువేసి, గుప్తగుణుఁడను వైద్యునితోఁ గ్రీడించుచుండెను. ఆసమయ