పుట:హంసవింశతి.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

liii


మున మగఁడువచ్చి, తలుపు తట్టెను. హేమరేఖ జంకక కొంకక, యిట్లు బొంకెను. “నాథా! నాకుఁ దీవ్రముగాఁ గడుపునొప్పి లేచెను. చచ్చెడిదాననే. ఇతఁడు వచ్చి బ్రతికించెను"

అసహాయుఁ డది విని ఓహో! మేలు చేసితివని వైద్యుని సత్కరించి సాఁగనంపెను.

నాలుగవ రాత్రి కథ

ఒక తొగటసెట్టి భార్య ఒకనాఁడొక పారుపత్తెగానిఁ జూచి వలచినది, ఒక మంత్రసాని ముదుకును బతిమాలుకొని వాని నింటికి రప్పించుకొన్నది. ఇద్దఱు గూడియుండిరి. సంతకు బట్ట లమ్మఁబోయిన భర్త అప్పుడేవచ్చి తలుపు దీయుమనెను. ఆ తొగటబోటి దిసమొలతోఁబోయి తటాలునఁ దలుపుదీసి పతి కన్నులు మూసి పారుపత్తెగాని వెళ్లిపొమ్మని సైగ చేసి మఱలఁ దలుపువేసి సిగ్గున కడ్డముగాఁ బతిపంచె చుట్టుకొని, “చీరవిప్పి జలకమాడఁ బోవుచుంటిని. నీ కంఠధ్వని విని ఆదరబాదర వచ్చితి"నని చెప్పుచుఁ గౌఁగిలించుకొనెను.

ఐదవ రాత్రి కథ

విజయుఁడు-మంజుల గొల్ల దంపతులు. చాలఁ ద్రిప్పలుపడి ఒక పిల్లను గనిరి. ఆ పిల్ల పిల్లకాదు; పిడుగు. అందుచేతఁ ద్వరపడి తలిదండ్రులు పెండ్లి చేయించి సాఁగనంపిరి. నూతన వధూవరులు వెనుక ముందు పోవుచున్నారు. దారిలో మఱ్ఱిచెట్టు వచ్చెను. అక్కడ జారశేఖరుఁడను ప్రాఁత నేస్తుఁ డెదురుపడెను. ఆ పిల్ల వానిని హత్తుకొనెను. భర్త తిరిగిచూచెను. ఇద్దఱొకఁడై యుండిరి. అపుడాపిల్ల తన వీఁపు తట్టుచుండుమని జారునికిఁ జెప్పెను. 'ఏమి ఏ' మని భర్త సమీపించెను. పిల్ల యిట్లనెను. “ఈ దయ్యాల మఱ్ఱి చెట్టును జూడఁగనే నా గుండెలు వకావక లయ్యెను. ఈ మహానుభావుఁడు నన్నుఁ గాపాడెను."

ఆఱవ రాత్రి కథ