ఈ పుట ఆమోదించబడ్డది
44
సౌగంధిక ప్రసవాపహరణము
పరువడి భాసిల్లు బాహువుల్ గాఁగ
భూనుతంబై మించు పుండరీకములు
మానితహస్తపద్మంబులు గాఁగ[1]
శ్రీల విరాజిల్లు సింహవిస్ఫూర్తి
లాలిత గగనాపలగ్నంబు గాఁగ
చె న్నొంది మిన్నయై చెలగుచుచున్న
పొన్న క్రొవ్విరిమేటి పొక్కిలి గాఁగ
పురుహూతబంధురస్ఫురితకంబములు
బిరుదులు రాణించు పిరుదులు గాఁగ
సముదగ్రశారదాస్తంభభాగ్యములు
కమనీయమృదులోరుకాండముల్ గాఁగ
రకమై వెలింగెడురజతకాహళులు
సుకరంపుజంఘికోస్ఫురణలు గాఁగ
నాకమహీజాతనవపల్లవములు
ప్రాకటం బగుపాదపద్మముల్ గాఁగ
- ↑ చెలువొందు తారాద్రి శీతాద్రి గోత్రములు
కులుకుచు జొక్కపుగుబ్బలు గాఁగ (క)