పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

సౌగంధిక ప్రసవాపహరణము

పరువడి భాసిల్లు బాహువుల్ గాఁగ
భూనుతంబై మించు పుండరీకములు
మానితహస్తపద్మంబులు గాఁగ[1]
శ్రీల విరాజిల్లు సింహవిస్ఫూర్తి
లాలిత గగనాపలగ్నంబు గాఁగ
చె న్నొంది మిన్నయై చెలగుచుచున్న
పొన్న క్రొవ్విరిమేటి పొక్కిలి గాఁగ
పురుహూతబంధురస్ఫురితకంబములు
బిరుదులు రాణించు పిరుదులు గాఁగ
సముదగ్రశారదాస్తంభభాగ్యములు
కమనీయమృదులోరుకాండముల్ గాఁగ
రకమై వెలింగెడురజతకాహళులు
సుకరంపుజంఘికోస్ఫురణలు గాఁగ
నాకమహీజాతనవపల్లవములు
ప్రాకటం బగుపాదపద్మముల్ గాఁగ

  1. చెలువొందు తారాద్రి శీతాద్రి గోత్రములు
    కులుకుచు జొక్కపుగుబ్బలు గాఁగ (క)