పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

461


ధరణీశ్వరుండు మోదంబు నొందుటయు
హరి శంకరునిమీఁద ననిసేయ సనుట2050
కురుసైనికులు యక్షకోటిపై సనుట
భైరవునకు హిడింబానందసునకు
బోరగ్గలం బౌట పోరి భైరవుని
సురవైరిఁ గూల్చుట చూచి రుద్రుండు
నరసుత భీమనందనులద్రుంచుటయు2055
హరి శంభుపుత్త్రుల నని నొంచుటయును
హరితనూజులశంభు డట్ల సేయుటయు
హరిహరులకు యుద్ధ మధికంబు నగుట
హరుఁడు మహాశూల మంకించుటయును
గరిమతో హరిరథాంగంబుఁ బూనుటయు 2060
అయ్యెడ కబ్జజుం డరుగుదెంచుటయు
చయ్యన నిరువుర సన్నుతించుటయు
కలహంబు మానుట కలనిలోఁ బడిన
బలములనెల్లను బ్రతికించుటయును