పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

శ్రీలచే జగతి రాజిలు లింగధరణి
పాలుని దుర్గాధిపతిఁ జేయుఁగాత.
ప్రాణనాథుని జటాబంధంబు మాన్చి
మానిత నవరత్న మకుటంబు దాల్చి
పేరైన పులకలపేరులు దిగిచి
భూరి మౌక్తికహారములు పొసంగించి
కన్నుల వినుసొమ్ము కడలకు వైచి
సన్నుత దివ్యభూషణము అమర్చి 70
పూవిల్తు భస్మంబు పూత బోఁదుడిచి
తావులు గులుకుగంధంబు మై నలఁది
గజచర్మపటము చక్కఁగఁ దొలంగించి
రజితాంబరంబు తీరంబుగాఁ గప్పి
గ్రక్కున వులితోలు కాశ సళ్లించి 75
తక్కక కెంబట్టుదట్టి పొంకించి[1]
జోగివేషము బాపి సొగసైనపుట్టు
భోగిరూపంబు సొంపుగఁ బోసంగించి

  1. తక్కక కెంబట్టు దట్టి పొందించి (చ)