పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

447




యుద్ధమున జచ్చినవారు మఱల బ్రదుకుట

మనమున హర్షించి మాధవహరులు 1835
అరుదైనకరుణాకటాక్షమాధుర్య
వరసుధాసారము ల్వర్షించుటయును
వరుసతుత్తుమురులై వ్రాలినయట్టి
నరయక్ష దనుజకిన్నరముఖ్యబలము
లనువందఁగా గోమలాకారు లగుచు1840

మునుపటికంటెను ముదమునఁ బొదలి
ఘనమైన నిద్ర మేల్కనిన చందముల
నెలయు వేడుకలవాహినులెల్ల లేచి
వెలయు వైభవముల వితతవైఖరుల
నలువందు బంధురానందులై రపుడు;1845

సురలు వర్షించిరి సూనవర్షములు
దురుసుగా దేవదుందుభులు ఘోర్నిల్లె
ఘనముగా గంధర్వగాణము ల్బరఁగె
విననయ్యె తుంబురువీణారవములు
నమితమై తగె నారదాదులనుతులు1850