పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

448

సౌగంధిక ప్రసవాపహరణము



నమరె రంభాదినాట్య ప్రసంగములు
నలినలోచనుఁడు పన్నగకంకణుండు
జలజాసనుండును సంతుష్టులైరి
అప్పుడు ధననాథు నాననాంబుజము
తప్పక చూచి కందర్పారి పలికె 1855

శివుఁడు కుబేరునితో సౌగంధికములను బాండవుల కిమ్మనిచెప్పుట

ధవనాథ వింటివె ద్రౌపదీరమణి,
కనకాబ్జములు గోరి కాంక్షించె నిపుడు
వనజాతములనుంచి వారికి మీకు
ఘనతరం బైనసంగరము వాటిల్లె
పాండునందనులు మాభక్తశేఖరులు1860

పుండరీకాక్షునిఁ బొందినవారు
మనము సేయనిబహుమానము ల్పాండు
తనయుల కెవ్వరు దగఁజేయఁగలరు
వనితాలలామకు వలసినయన్ని
గొనివచ్చి దామముల్ గూర్చి యర్పించు 1865