పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

సౌగంధిక ప్రసవాపహరణము



తొడరి యీదుష్టచతుష్టయం బెపుడు
బలువిడి నాబాహుబలశౌర్యగరిమ
వలనొప్పఁ జూచి యోర్వఁగజాల రనఘ,
యెందుకు పనికిరా రీనీచమతులు1120
నిందింతు రెంతటి నెరయోధనైన
కుటిలోక్తులకు నేను కొరగాను నాదు
పటుశక్తి గని మెచ్చి పనిగొనవలయు
పన్నగభూషణు ఖలిమి నాబలిమి
కన్నులపండువుగాఁ జూతుగాని1125
నెదురుమీరఁగ నన్ను నీవెంట దోడ్క
చనుమన్న హర్షించి జలజలోచనుఁడు
గురుకృపాదులను మక్కువ సన్నుతించి
సురనదీనందను జూచి యిట్లనియె
గాంగేయసందడి కయ్యంబు గలదు1130
గంగాధరునిమీఁదఁ గర్ణుని వెంట
నా సైన్యములు నేను నడిచెద మివుడె
నీ సేనలును నీవు నృపులు యోధలును
ధననాథునిమీఁద యుద్ధమునకు జనుఁడు