పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

సౌగంధిక ప్రసవాపహరణము



వని కేల కరవాల మంకించు విజయుఁ
గనుఁగొని కనుగిల్చి గద్దించి నిల్పి
ఖరకరనందను గౌఁగిటఁ జేర్చి
కరము సంధించి పంకజనాభుఁ డనియె
అనఘాత్మ రాధేయ యసహాయశూర 1090

కృష్ణుఁడు కర్ణునిఁ బొగడుట

యనుపమాటోప నీకాగ్రహం బేల?
వరుస నే దెల్పినవారల నెల్ల
వరయోధలై యుండ వచియింపఁగల్గె
హరునకు నీకు దీ టనుచు నే నిన్ను
ధర నుతించక యుంటి తప్పేమి నాదు! 1095
శంకరునకు నీకు సమమైన యుద్ది
పంకజాప్తతనూజ ప్రధనరంగమున
పాయక హరు నెదుర్పడ నీవు దక్క
నీయోధవరులలో నెవ్వరు గలరు!
ఈ వాహినులెకావ యఁక మాటలేల1100
నీవారు మే మెల్ల నిరుపమాటోప