పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

401





పంతంబు గల నెరబంటవు గనుక
తలపోయ నీకును దగినట్టివారి1070
పలుదెఱంగుల మెచ్చి ప్రస్తుతించితివి
అన విని రోషించి యమరేంద్రసుతుఁడు

అర్జునుఁడు కర్ణుని దూషించుట

వనజాప్తనందనువదనంబుఁ జూచి
వ్రేలనిచ్చిన మరి ప్రేలెదు క్రొవ్వి
చీలల్ల నీ కేల సిగ్గు లేదాయె!1075
నీచాత్మ యెవరు దండించిన వినవు.
కోచకూతలు రేఁగి కూసెద వేల
అతఁడు జగత్కర్త యతఁ డాదివిష్ణుఁ
డతఁడు సన్మునివంద్యుఁ డతఁ డప్రమేయుఁ
డతఁ డఘుదూరుఁ దనంతుఁ డచ్యుతుఁడు 1080
అతని దూషింప నీక ర్హ మే మూర్ఖ!
మగటిమిగల దొడ్డమగవానివలెనె
పొగరెక్కి నీ వేల పొంగెద విపుడు?
చలమున నాఖడ్గశక్తికి నిన్ను'
బలిపెట్టకున్న నీ ప్రజ్ఞలు మాన 1085