పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

391




విహితంబుగా దిది వినుము తెల్పెదను
నెరయ శ్రీదునకును నీకు వెన్నుద్ది;905
దొరయ మణిగ్రీవ దుశ్శాసనులకు
నలువంద మణిమంతునకు శకునికిని ;
నలకూబరునకు సైంధవునకు జోడు
నన్ను నే నెన్నుకో నాయంబుఁ గాదు
పన్నగభూషణ ప్రముఖులౌయోధ
వరులెల్ల నాజోడు వర్ణించి చూడ910
గురుకృపార్జునభీష్మగురుసుత భీమ
నకులాదు లైన మానవకోటు లెల్ల
ప్రకటించు యక్ష, కాల్బలములజోడు
నరనాథ యొకటికి నవ్వు పుట్టెడిని !
తిర మొంద నావార్త తెలిపెద వినుము915
వారిలోపల మనవారిలోపలను
పేరు గీర్తులు లేని బీదలలోనఁ
దలపోసి యెంచఁగాఁ దగదు కయ్యంబు