పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

392

సౌగంధిక ప్రసవాపహరణము



బలుకోచ యాహిడింబానందనుండు [1]
అన విని మీసంబు లల్లన దువ్వి920
దినకరాత్మజుఁ జూచి దేవతారాతి
కాలాంతకుని లీల గద ధరియించి
పోలించి పవమానపుత్రుఁగన్గొనినఁ
గనలి భీముఁడు ఘటోత్కచుని వీక్షించి
కొనుమని కనుగిల్చి గూఢత నున్న925

ఘటోత్కచకర్ణ సంవాదము

చలమునఁ గెరలి రాక్షసచక్రవర్తి
తలకొని మార్తాండతనయునిఁ జూచి
ఏమనంటివికర్ణ ! యీసారి పలుకు
నీమదం బడగింతు నృపతులయెదుట
యెంత సిగ్గెరుఁగవో యిందరు జూడ930
నింతకు మున్నె నిన్నేమిసేసితిని
మరపువచ్చెనొ దొడ్డమగటిమి గల్గు

  1. పరికింప నెందుకుఁ పనికిరానట్టి
    పిరికివాఁడల హిడింబీనందనుండు (త )