పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము

370



శౌర్యంబు లుప్పొంగ జనిరి వెంబడిన[1]
వహికెక్క నెరయోధవర్యులతోడ 560
సహదేవు డరుదెంచె జనపతి వెంట
చతురంగబలములు సమకట్టి మొనను
చతురుఁడై వెన కృపాచార్యుఁడు నడచె
ఆటమున్న పడియున్న యర్జునుఁ జూచి
పిటపిట కోరలు బెట్టుగా దీటి 565

హనుమంతుడు కుబేరునితో యుద్ధము సేయుట
ఉభయపక్షముల వారికిని జరిగిన చిత్రయుద్ధము

కేతనంబున నున్న కేసరిసుతుఁడు
భూతలం బదుర నద్భుతశక్తి దుమికి
నక్షత్రమండలోన్నతమైనయొక్క
వృక్షంబు కూకటి వ్రేళ్లతో బెరికి
కరముల సంధించి గద్దించి నడువ 570
పరికించి చతురంగబలములు పగిలె
చిడిముడి పడి సర్వసేనాధిపతులు

  1. శౌర్యంబు లుప్పొంగి జనిరి వెంబడిగ (ట)