పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

369


భూరికిరీటంబు పొట్టు గావించి
క్రూరత రధముపై కుప్పించి దుమికి
కరవాలు బెరికి వెక్కసముగా నార్చి 545

నరవాహనునిబెట్టు నరకిన నతఁడు
నరదంబుపై వాలి యంతఁలోఁ దెలిసి
కోదండమునఁబెట్టు గొట్టిన నతఁడు
పోదట్టి నక్షంబుఁ బొడువ శ్రీదుండు
కళవళ మంది రాక్షసకులేశ్వరుని 550

ప్రళయాంతకుని లీల బలుగఁద బూని
మోదీన నది దాకి మూర్ఛిలి యపుడు
ఆదైత్యకులమౌళి యవనిపై వ్రాలె
వేమరు పరికించి వికలంబు నొంది
సామజేంద్రము నెక్కి శమననందనుఁడు555

ప్రకటించి నడచె తురగంబు నెక్కి;
నకులుండు నడచె తురంగంబు మ్రోల[1]
దుర్యోధనుండును దుశ్శాసనుండు

  1. నకులుండు నడచె మానవనాథుతోడ (ట)