పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఆవలివారు కయ్యమె కోరుచుండ
నీవేళ కమలంబు లిచ్చుట గొదువ
దీనత్వ మొంది ప్రార్ధించివేడినను65
బూనికౌగిటఁజేర్చి పొం దొనరించి
నలువొందకమలముల్ నవనిధానములు
నలకాపురంబైన నర్పింపవచ్చు.
నేపున గర్వించి యెదిరించినపుడు
నీపాదములయాన నేతృణ మియ్య70
ననిన సందఱు యోధు లటువలెఁబలికి
కనలుచుఁ గదలి శంఖములు పూరించి
దారుణసింహనాదములు బర్వించి
పోరికి సేనలు బురికొల్పుటయును
వారి వీరికి నింత వర్ణింపరాని75
హోరాహవం బయ్యెఁ గురకులాధీశ!

'

ఉభయపక్షములకును సంకులసమరమగుట.



మదకరు ల్మదకరు ల్మార్కొనుకరణి
పొదలి పులుల్ పులు ల్బోరుచందమునఁ