పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

సౌగంధిక ప్రసవాపహరణము




రావణకుంభకర్ణాది ప్రముఖులను
ఠీవి నెదిర్చి ఖండించినవారు
అంతటి బలసాహసాంకు లీధరణి
కాంతులు వీరితో కలహించి యెదిరి
చెలరేగి యనిసేయఁ జెల్ల దటన్న
నలకూబరుఁడు యక్షనాథున కనియె
అయ్య! యీపని యెంత యీబల మెంత!
వెయ్యారువిధముల విమతులఁ బొగడఁ

మణిమంతుఁ డొప్పకుండుట



దగవౌనె! కాంచనోదరు డుండగాను.
మగటిమిఁ గలమణిమంతుఁ డుండఁగను
వార్త కెక్కిన హరిధ్వజుఁ గుండఁగను
గీర్తిఁ గాంచిన మణిగ్రీవుఁ డుండఁగను
వీరల కెనయైనవీరులు లెక్క
మీరి యుద్ధము సేయ మీ చెంతనుండ
జెరలు గొట్టుచు సర్వసేన లుండఁగను
దరలక ననుకంటితనయుఁ డుండఁగను