పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము



అవధరింపుము వసుధాధీశచంద్ర
యవలి కథాక్రమం బది వివరింతు
ధనపతి వచ్చునుద్దండంబుఁ గాంచి
మనమున నులికి ధర్మతనూభవుండు
మొన నిల్చి యున్న తమ్ముని ముఖాంబుజంబుఁ 5
గనుఁగొని నియమొందఁగా నిట్లు పలికె

ధర్మరాజు సంధిసేయ బూనుట


బాలునితోఁ జేయు బవరంబునకు
చాలు చాలై యుండే సమసె సైన్యములు
పడిరి యోధులు తగ్గె బలము గుఱ్ఱములు
బెడిదంపుబలములు బెంచి యేతెంచె 10
శ్రీదుఁ డాతని నాజిఁ జెనకి జయింపఁ
గాఁ దీర దెంతటి ఘనులకు నైన
పరికింపుము ధనాధిపతిసేనలోన