పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

సౌగంధిక ప్రసవాపహరణము




బిరుదధ్వజంబులు బెక్కింటి నవియు
వారెల్ల నెరయోధపర్యులు గారె!15
పో రేలసంధియై పొసఁగుట లెస్స
నావిని శమననందనుని వీక్షించి

గాండీవి దానికొడఁబడకుండుట


దేవేంద్రపుత్రుండు ధృతిమీరఁ బలికె
ముందుగా కయ్యంబు మొనసేయకున్నఁ
బొందు సంధి యొనర్పఁ బొసఁగుఁ గా కిపుడు 20
అదియేల దీరు మీ యాత్మలో నింత
బెదరేల ననుఁజూడు పృధ్వీతలేంద్ర!
అరమర లొకయింత యైనను లేక
కురుపాండవులు జతగూడయుండగను
నొరసి కయ్య మొనర్ప నుగ్రునికైనఁ25
దరమె నాభుజశక్తి ధననాథుకడిమి
కను మని శత్రులు గడగడవణక
తనరేడి దేవదత్తంబుఁ బూరించి
వల కేల విలు గుణధ్వనిజేసి యార్చి
కలనికి బలములు గవియించుటయును30