పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము


వరుస నీసామ్రాజ్య వైభవంబునకు
గెరలితోఁచిన ధూమకేతు వర్కజుఁడు
నలువంద దుర్యోచనలు మాని వారి[1]
గలసి సహాయంబు గమ్ము వేవేగ
జననాథ మీబుద్ధి సరిపోవదేని 885
యినతనూజునిఁగూడి యీసేన లడఁగు
ననఁ దోఁకద్రొక్కిన యహిరాజులీల
ఘనరోషచిత్తుఁడై కర్ణుఁ డి ట్లనియె

కర్ణ గురుసూనుల సంవాదము



ముది మది దప్పిన ముదుకఁ డటంచు
వదరినఁ గాచితి వాహినీసుతుని 890
బాపఁడ వీవు నీపని యన నెంత?
భూపతి వినుచుండఁ బొంగెద విపుడు[2]
కోపించి నిన్నంటి గూల్పక యున్న
నాపంత మేటికి ననుఁ జూడు మనుచుఁ

  1. నలువంద యీపుచ్చనలు మాని వారి
    గలసి సహాయంబు గమ్ము వేవేగ (క )
  2. భూపతి వినుచుండఁ బొక్కెద విపుడు (2421)