పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

సౌగంధిక ప్రసవాపహరణము



కురురాజ గురుసూనుల సంభాషణము


  
ధరణీశ నీయెడ తప్పేమి లేదు
నలువంద కమలాప్తనందనుం డనెడి
పలుకొంటె చేరిన పాప మొక్కటియె
ఇన్న రాధము పల్కు లిచ్చగించుటకు
నిన్నుంచి యిది యొక్క నేరంబు గలిగె870

మెలఁగుచు నీపాలిమృత్యువై చేరి
సొలవక నాసలఁ జూపి నమ్మించి[1]
శంకింప కిట నిన్నుఁ జంపింతు ననుచు
గంకణం బిదె చేతఁ గట్టి యున్నాఁడు
అదిగాక రాధేయు ననువెల్ల వినుము;875

కదలని నెరబంటు కైవడి వదలి
కదనంబునకు నిన్నుఁ గదియించి మీఁద
సదపడి కార్యంబు పైకొననేని
యనిలోన నిను డించి యరుగు వేగంబె ,
మన మెఱుంగమె! కర్ణు మగతనంబెల్ల 880

  1. తొలఁగక యుండినఁ దోర్బలంబునను (1378)