పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

237

భీష్ముఁడు దుర్యోధనునకు హితము చెప్పుట



గురుతైన యీమహా ఘోరపాపములు[1]
కురురాజ! నిను గట్టి కుడుపకపోవు'!
మంచివాఁడవువోలె మలసి యేతెంచి[2]

కొంచక యిటువంటి కుటిలముల్ మేలె?
నమ్మి శత్రుఁడవై పగఁ దీర్పవచ్చు.
నమ్మిన జెరచుట నాయమ్ముగాదు[3]
ఈ రేడుజగములు నీచేటుబుద్ధి
వారక దలచినవారికే హాని

పరికించి చూచిన పాండుతనూజు
లరుదైనసాహసుల్ హరి కృప గలదు
వారితోఁ బోర, నెవ్వరికి శక్యంబు!
నేరని యీపను ల్నీతి గాదన్న
యిందరిలోఁ బెద్ద లెవరు లేరైరె 835

  1. గురుతైన యీమహాఘోరపాపాలు. (క)
  2. మంచివాడవువోలే మలసి యేతెంచి. (ట)
  3. నమ్మించి చెరచుట నాయంబుగాదు (1378)