పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

215

గలిగె నా కిది కన్నె కయ్యం బటంచు[1]
గొలువుచావడినుండి గుప్పున దుమికి
వలనొప్పఁ దండ్రికి వలగొని మ్రొక్కి
యింతటి పనికి యక్షేశ్వర నీవు
చింతల్ల నేటికి సెల విమ్ము నాకు
చని దేవర యనుజ్ఞ జనపతిఁబట్టి
గొనివత్తు నిపుడె నీకొల్వులోపలికి
మలసి నాతోఁ గొంత మార్కొనెనేని
చలమునఁ గలనీలోఁ జక్కు. గావింతు
నన విని ధననాథుఁ డగుగాక యనుచు
వినుత ధైర్యౌదార్య విక్రమాన్వితుని
జాంగలు రావించి సకలసైన్యముల

నలకూబరుఁడు యుద్ధమునకు వెడలుట



బొంగుచుఁ బిలిపించి భూషాదు లొసఁగి

  1. a. కలిగె నా కిది వేగ కయ్యం బటంచు
       కొలువుచావిడి నుంచి గప్పున దుమికి, (చ)
    b కలిగె నా కిది... న్నెకయ్యం బటంచు
       కొలువుచావడినుంచి గుప్పున దుమికి (క)